జూరాలకు 14వేల క్యూసెక్కులు
Published Wed, Sep 21 2016 11:53 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM
జూరాల : కృష్ణానది పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు బుధవారం 14వేల క్యూసెక్కుల వరద వచ్చింది. ఈ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ 9.65టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.41టీఎంసీలుగా ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాలువలకు 450క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 750క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీని నుంచి ఎత్తిపోతల పథకాలు నెట్టెంపాడుకు 1,500క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 630క్యూసెక్కులు, భీమా లిఫ్ట్–1కు 1,300క్యూసెక్కులు, లిఫ్ట్–2 ద్వారా 750క్యూసెక్కులను అధికారులు పంపింగ్ చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో వరద పెరిగింది. 56,319క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో ఈ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటినిల్వ 129.72టీఎంసీలు కాగా ప్రస్తుతం 122.83టీఎంసీలుగా ఉంది. విద్యుదుత్పత్తి ద్వారా 45వేల క్యూసెక్కుల నీటిని దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు. ఈ ఇన్‌ఫ్లో వరద శుక్రవారం నాటికి జూరాల ప్రాజెక్టుకు చేరుకునే అవకాశముంది. అలాగే నారాయణపూర్ ప్రాజెక్టుకూ ఇన్‌ఫ్లో పెరిగింది. ప్రస్తుతం 35,908క్యూసెక్కుల వరద వస్తుండగా నీటినిల్వ మట్టాన్ని పెంచుతూ ఆరువేల క్యూసెక్కులను విద్యుదుత్పత్తి ద్వారా జూరాల రిజర్వాయర్‌కు విడుదల చేస్తున్నారు.
Advertisement
Advertisement