జూరాల: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 1.6లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. సోమవారం ఎనిమిది క్రస్టుగేట్లు ఎత్తి 1,14,121 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 47వేల క్యూసెక్కులు విడుదల చేశారు.
జూరాలకు కొనసాగుతున్న వరద
Published Tue, Aug 9 2016 2:08 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM
జూరాల: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 1.6లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. సోమవారం ఎనిమిది క్రస్టుగేట్లు ఎత్తి 1,14,121 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 47వేల క్యూసెక్కులు విడుదల చేశారు. మొత్తం 1,62,786 క్యూసెక్కుల వరదను జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. జూరాల రిజర్వాయర్ సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.71 టీఎంసీల నీటినిల్వను కొనసాగిస్తున్నారు. కుడి ప్రధాన కాలువ ద్వారా 250 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సమాంతర కాలువ ద్వారా 1300 క్యూసెక్కులు వదులుతున్నారు. భీమా లిఫ్ట్–2 ద్వారా 1500 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్–1 ద్వారా 1300 క్యూసెక్కులను వినియోగిస్తున్నారు.
Advertisement
Advertisement