విజయనగరం జిల్లాలోని గరుగుబిల్లి మండలంలో ఉన్న తోటపల్లి రిజర్వాయర్‌కు వరదనీటి ప్రవాహం పెరుగుతోంది.
వీరఘట్టం: విజయనగరం జిల్లాలోని గరుగుబిల్లి మండలంలో ఉన్న తోటపల్లి రిజర్వాయర్‌కు వరదనీటి ప్రవాహం పెరుగుతోంది. బుధవారం ఉదయం ఇన్‌ఫ్లో 6,600 క్యూసెక్కులుగా ఉంది. దీంతో నాలుగు గేట్లు ఎత్తి కిందకు 4,900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటి మట్టం 102.9 మీటర్లుగా ఉంది.