రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): వర్షాల కారణంగా హసనపర్తి–కాజీపేట సెక్షన్ మధ్యలో ట్రాక్‌లపై ప్రమాదకర స్ధాయిలో నీటి ప్రవాహం చేరుకోవడంతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్లను పూర్తిగాను, పాక్షికంగా రద్దు చేయడంతో పాటు మరి కొన్నింటిని అధికారులు దారి మళ్లించారు. సికింద్రాబాద్–సిర్పుర్ కాగజ్‌నగర్ (17233) రైలును ఈ నెల 27, సిర్పూర్ కాగజ్‌నగర్–సికింద్రాబాద్(17223) రైలును ఈ నెల 28న పూర్తిగా రద్దు చేశారు.
సికింద్రాబాద్–ధనాపూర్ (12791)రైలును గురువారం కాజీపేట, విజయవాడ, దువ్వాడ, విజయనగరం మీదుగా దారి మళ్లించారు. చెన్నై సెంట్రల్–అహ్మదాబాద్ (12656) రైలును వరంగల్లు, సికింద్రాబాద్, వాడి, సోలాపూర్, మన్మాడ్ మీదుగా దారి మళ్లించారు. చైన్నె సెంట్రల్–మాత వైష్ణోదేవి కాత్ర రైలును గుంటూరు, సికింద్రాబాద్, మన్మాడ్ మీదుగా దారి మళ్లించారు. రామేశ్వరం–బెనారస్ (22535) రైలును విజయవాడ, దువ్వాడ, విజయనగరం మీదుగా దారి మళ్లించారు.
హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటు
వర్షాల నేపథ్యంలో రైళ్ల సమాచారం తెలుసుకునేందుకు వీలుగా విజయవాడ, ఒంగోలు, తెనాలి, సామర్లకోట, ఏలూరు, రాజమండ్రి స్టేషన్‌లతో పాటు గూడురు స్టేషన్‌లలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్‌లు విజయవాడ 0866–2576924, గూడూరు 7815909300 స్టేషన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు గురువారం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment