రాళ్లపాడు జలాశయానికి వరద ఉధృతి
Published Mon, Nov 30 2015 8:51 AM | Last Updated on Sun, Sep 3 2017 1:16 PM
ఒంగోలు : ప్రకాశం జిల్లాలోని రాళ్లపాడు జలాశయం వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉంది. అల్పపీడనం కారణంగా జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వరద నీరు భారీగా చేరడంతో ఉధృతి పెరుగుతోంది. దీంతో అధికారులు 5 గేట్లను ఎత్తి 9 వేల క్యూసెక్కుల నీటిని మన్నేరుకు విడుదల చేశారు. రాళ్లపాడు జలాశయం పూర్తి సామర్ధ్యం 20.5 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 19.6 అడుగులగా ఉంది. నీటి మట్టం పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమై నీటిని విడుదల చేస్తున్నారు.
Advertisement
Advertisement