సాక్షి, అనంతపురం : ఇటీవల నీటి నిర్వహణ ప్రాజెక్టులకు సంబంధించి భారత ప్రభుత్వ జల శక్తి మంత్రిత్వ శాఖ కోకా–కోలా ఇండియా ఫౌండేషన్ ను జాతీయ అవార్డుతో సత్కరించింది. అనంతపురంలో సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ప్రాజెక్ట్ జలధార ద్వారా కరువు ప్రాంతాలలో అభివృద్ధికి దోహదపడినందుకు ఈ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సహకారంతో ’ప్రాజెక్ట్ జలధార’ ద్వారా ...ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలోసాధించిన ఫలితాలను గురించి ఆనందన –కోకా–కోలా ఇండియా ఫౌండేషన్, ఎస్ ఎం సెహగల్ ఫౌండేషన్ ప్రతినిధులు వివరించారు.
ఈ ప్రాజెక్ట్ భూగర్భ జలాలను పెంపొందించటంలో ఎన్నదగిన ఫలితాలను సాధించిందన్నారు. వివరాల్లోకి వెళితే... పెరిగిన భూగర్భజలసిరి... గ్రామీణాభివృద్ధి ఎన్జిఓ ఎస్‌ఎం సెహగల్ ఫౌండేషన్ సహకారంతో ఆనందన – కోకా–కోలా ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ’వాటర్ స్టీవార్డ్‌షిప్’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగమైన ప్రాజెక్ట్ ’జలధార’ ను ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రారంభించారు.
తద్వారా అనంతపురంలో 5 చెక్ డ్యామ్స్‌ను కోడూరు– సుబ్బారావుపేట, ముద్దపల్లి– తిమ్మడిపల్లి , మధురేపల్లి – కందురుపర్తి నల్లపరెడ్డి పల్లి గ్రామాలలో 416 మిలియన్ లీటర్ల నీటి సేకరణ సామర్థ్యంతో నిర్మించారు.దీంతో భూగర్భజలాల పెంపుదల కారణంగా సాగు విస్తీర్ణంలో 35% పెరుగుదల నమోదయింది, తగ్గుతున్న నీటి కొరత... ఈ ప్రాంతంలో నీటి కొరత సమస్య కూడా పరిష్కారమవుతోంది.
భూగర్భ జలాలు పెరగటంతో పంట దిగుబడిలో కూడా గణనీయమైన రీతిలో 75% పెరుగుదల నమోదయింది. దానితో పాటే భూసారమూ పెరిగింది. ఒక సంవత్సరంలో రైతులు బహుళ పంటలు పండించడానికి ఇది వీలు కల్పించింది. అదనంగా, 82% మంది రైతులు పంటల నాణ్యతలో గణనీయమైన మెరుగుదలను గమనించారు. ప్రాజెక్ట్ అమలులో భాగంగా 7 నీటి నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా నీటి నిర్వహణలో స్థానికుల ప్రమేయాన్ని కూడా పొందగలిగింది.
ఇందులో 75 మంది పురుషులు, 17 మంది మహిళలు సహా 92 మంది సభ్యులు ఉన్నారు. నీటి–ఎద్దడి ఉన్న భూములలో భూగర్భ జలాలను పెంచటం, వాటర్‌షెడ్‌లను మెరుగుపరచడం ద్వారా కోకోకోలా ఫౌండేషన్ కృషి చేస్తోంది. ఆ కృషి ఫలితంగానే కంపెనీ వినియోగిస్తున్న నీటిలో 200% పైగా తిరిగి అందించగలిగింది. మంచి ఫలితాలు సాధించాం... అనంతపురంలో చెక్ డ్యామ్‌ల నిర్మాణంతో. భూమి నాణ్యత మెరుగుపరచి పంట దిగుబడిని, భూగర్భజల స్థాయిలను గణనీయంగా పెంచగలిగాం. ఫలితంగా, నేడు రైతులు విభిన్న పంటలను పండిస్తున్నారు మా నీటి నిర్వహణ కమిటీలు ఈ కార్యక్రమాలను కొనసాగించడానికి తగిన శిక్షణ పొందాయి.
Comments
Please login to add a commentAdd a comment