
సాక్షి, పశ్చిమ గోదావరి : పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉధృతి పెరుగుతుంది. ఎగువ నుంచి వరదనీరు ఎక్కువగా ఉండటంతో కాఫర్ డ్యామ్‌కు వెళ్లే అప్రోచ్ రోడ్డు మునిగిపోయింది. అప్రోచ్ రోడ్డుపై నుంచి గోదావరి వరద నీరు ప్రవహిస్తుంది. ప్రాజెక్టు వద్ద 600 మీటర్ల వెడల్పు మేర గోదావరి నీరు ప్రవహిస్తుంది. అక్కడ మొత్తం గోదావరి వెడల్పు 2400 మీటర్లు కాగా, ఇప్పటికే 2200 మీటర్ల మేర నదిని కాఫర్ డ్యామ్ నిర్మాణంతో అధికారులు మూసివేశారు. దీంతో ఖాళీగా కొద్ది భాగం నుంచే వరద నీరు కిందకి వెళుతుంది.