Cofferdam
-
పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరో కీలక ఘట్టం పూర్తి
-
Polavaram Project: పోలవరంలో మరో కీలక ఘట్టం
సాక్షి, అమరావతి: బహుళార్ధక సాధక ప్రాజెక్టు పోలవరం పనుల్లో బుధవారం మరో కీలక ఘట్టం పూర్తయింది. టీడీపీ సర్కారు నిర్వాకాలతో ఎదురైన సవాళ్లను అధిగమించి 1,655 మీటర్ల పొడవు, 31.5 మీటర్ల ఎత్తుతో దిగువ కాఫర్ డ్యామ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. ఇందుకోసం 34.83 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి, కోర్ (నల్లరేగడి మట్టి), రాళ్లను వినియోగించింది. గోదావరికి ఎంత భారీ వరద వచ్చినా ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యామ్ నిర్మాణ ప్రాంతంలోకి ఇక వరద ఎగదన్నే అవకాశమే ఉండదు. వరదల్లోనూ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులను కొనసాగించేందుకు మార్గం సుగమమైందని పోలవరం సీఈ సుధాకర్‌బాబు ‘సాక్షి’కి తెలిపారు. ఈ నేపథ్యంలో డయాఫ్రమ్ వాల్ సామర్థ్యంపై ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్) నివేదిక ఇవ్వడమే తరువాయి డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్), సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) మార్గదర్శకాల మేరకు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులపై రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయనుంది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్‌ను పూర్తి చేయడం ద్వారా రైతులకు పోలవరం ఫలాలను శరవేగంగా అందించే దిశగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారు. టీడీపీ నిర్వాకాలతోనే జాప్యం.. ♦గోదావరి గర్భంలో 2,454 మీటర్ల పొడవున ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణానికి వీలుగా ప్రవాహాన్ని మళ్లించేందుకు ఎగువన 2,840 మీటర్ల పొడవు, 43 మీటర్ల ఎత్తుతో ఒక కాఫర్ డ్యామ్‌ను, స్పిల్‌వే నుంచి దిగువకు విడుదల చేసిన జలాలు ఎగదన్నకుండా దిగువన 1,655 మీటర్ల పొడవు 30.5 మీటర్ల ఎత్తుతో మరొక కాఫర్ డ్యామ్ నిర్మించాలి. ♦గత సర్కార్ నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్ ఛానల్ పూర్తి చేయకుండానే ఈసీఆర్ఎఫ్ డ్యామ్‌కి పునాది వేసి కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేయలేక చేతులెత్తేసింది. దీంతో 2019లో గోదావరి వరద ప్రవాహం ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉధృతితో ప్రవహించడంతో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై నాలుగు ప్రదేశాల్లో భారీ అగాధాలు ఏర్పడ్డాయి. దిగువ కాఫర్ డ్యామ్ 0 నుంచి 680 మీటర్ల వరకు కోతకు గురైంది. ♦సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే పోలవరాన్ని పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ ఎగువ కాఫర్ డ్యామ్, స్పిల్, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్లను పూర్తి చేసి గోదావరి ప్రవాహాన్ని 6.1 కి.మీ. పొడవున మళ్లించారు. ♦అయితే దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రదేశంలో పనులు చేపట్టాల్సిన విధానాన్ని ఖరారు చేయడంలో డీడీఆర్పీ, సీడబ్ల్యూసీ జాప్యం చేశాయి. చదవండి: సాకారమవుతున్న స్వప్నం ఆకస్మిక వరదలు రాకుంటే గతేడాదే పూర్తి.. ♦దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రదేశంలో జియో మెంబ్రేన్ బ్యాగ్‌లలో ఇసుక నింపి జెట్ గ్రౌటింగ్, వైబ్రో కాంపాక్షన్ చేస్తూ పూడ్చి అనంతరం 30.5 మీటర్ల ఎత్తుకు పూర్తి చేసే విధానాన్ని 2022 ఏప్రిల్‌లో సీడబ్ల్యూసీ నిర్దేశించింది. ♦సాధారణంగా జూలై మూడో వారం నుంచి గోదావరికి వరదలు వస్తాయి. దేశంలో జియో మెంబ్రేన్ బ్యాగ్‌ల వినియోగం తక్కువ. ఈ నేపథ్యంలో వాటి లభ్యత కూడా స్వల్పమే. సమయం తక్కువగా ఉండటంతో గుజరాత్, అస్సోం సంస్థలకు తయారీ ఆర్డర్ ఇచ్చి తక్కువ సమయంలోనే 2.50 లక్షల బ్యాగ్‌లు సేకరించారు. వాటిని ఇసుకతో నింపి కోతకు గురైన ప్రదేశంలో పూడ్చి జెట్ గ్రౌటింగ్ ద్వారా వైబ్రో కాంపాక్షన్ చేస్తూ యధాస్థితికి తెచ్చారు. ♦ఆ తర్వాత దానిపై 20 మీటర్ల ఎత్తుతో గతేడాది జూలై 9 నాటికి దిగువ కాఫర్ డ్యామ్ పనులు చేశారు. అయితే అదే రోజు రాత్రి భారీ వరద రావడంతో స్పిల్‌వే నుంచి దిగువకు విడుదల చేసిన వరద దిగువ కాఫర్ డ్యామ్‌ను ముంచెత్తింది. ఆకస్మిక వరదలు రాకుంటే గతేడాదే దిగువ కాఫర్ డ్యామ్ పూర్తయ్యేదని పోలవరం ఎస్ఈ నరసింహమూర్తి తెలిపారు. ♦ వరదలు తగ్గాక నవంబర్‌లో దిగువ కాఫర్ డ్యామ్ పనులను ప్రారంభించిన మేఘా సంస్థ బుధవారానికి పూర్తి చేసింది. గతేడాది భారీగా వరదలు వచ్చిన నేపథ్యంలో ఎంత ప్రవాహం వచ్చినా సమర్థంగా తట్టుకునేలా ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తును 44 మీటర్లకు పెంచారు. దిగువ కాఫర్ డ్యామ్ ఎత్తును 30.5 మీటర్లతో కాకుండా 31.5 మీటర్లకు పెంచి పనులు పూర్తి చేశారు. -
నీటి ప్రోజెక్టుల నిర్మాణ చరిత్రలోనే సరికొత్త అడుగులు
-
చకచకా దిగువ కాఫర్ డ్యాం పనులు
-
చకచకా దిగువ కాఫర్ డ్యాం పనులు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు డిజైన్లు కొలిక్కివస్తున్నాయి. దీంతో పనులు ఊపందుకుంటున్నాయి. గత ప్రభుత్వ చర్యల కారణంగా పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్‌డ్యామ్, ప్రధాన డ్యామ్‌లో కొంత భాగం వరదలకు కోతకు గురయ్యాయి. వీటిని పూడ్చడానికి రూపొందించిన డిజైన్లు పోలవరం పీపీఏ, సీడబ్ల్యూసీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని వెంటనే ఆమోదించాలని ఇటీవల పోలవరం పరిశీలనకు వచ్చిన కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి తదనుగుణంగా చర్యలు చేపట్టారు. దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చేందుకు ఇక్కడ డయాఫ్రమ్ వాల్ నిర్మించి, దానికి ఇరువైపులా ఇసుక, జియోమెంబ్రేన్ బ్యాగ్‌లతో పూడ్చే విధానానికి సీడబ్ల్యూసీ ఆమోదించింది. రెండ్రోజుల్లోగా జియోమెంబ్రేన్ బ్యాగ్‌లను తెప్పించి, కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చనున్నారు. మేలోగా ఈ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. దిగువ కాఫర్ డ్యామ్ కోతకు గురైన సమయంలోనే ప్రధాన డ్యామ్ కూడా గ్యాప్–2 ప్రాంతంలో కూడా 12 మీటర్ల లోతుకు కోతకు గురయింది. ఈ ప్రాంతం పూడ్చివేత విధానాన్ని రూపొందించేందుకు ఢిల్లీ ఐఐటీ రిటైర్డు డైరెక్టర్ ప్రొఫెసర్ వీఎస్ రాజు నేతృత్వంలో కేంద్రం నిపుణుల కమిటీని నియమించింది. ఈనెల 25లోగా ఈ కమిటీ విధానాన్ని రూపొందిస్తే.. దానిపై 28 లేదా 29న కేంద్ర మంత్రి షెకావత్ నేతృత్వంలో సీడబ్ల్యూసీ, పీపీఏ, డీడీఆర్పీలు సమావేశమై కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే విధానంతోపాటు ప్రధాన డ్యామ్ డిజైన్లను కొలిక్కి తేనున్నాయి. -
దిగువ కాఫర్ డ్యామ్‌కు ఓకే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ (పునాది)లో కోతకు గురైన కొంత భాగంలో డయాఫ్రమ్ వాల్, ఇసుక, జియోమెంబ్రేన్ బ్యాగ్‌లతో పూడ్చాలని కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్యన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన కొంత భాగాన్ని, పోలవరం ప్రాజెక్టుకు దిగువన గోదావరి ఎడమ గట్టు (పురుషోత్తపట్నం గట్టు), కుడి గట్టు (పోలవరం గట్టు)లను పటిష్టం చేసే డిజైన్లను కొలిక్కి తెచ్చేందుకు వారంలోగా మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించారు. ఈనెల 4న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పోలవరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిజైన్లను పీపీఏ, సీడబ్ల్యూసీ సకాలంలో ఆమోదించకపోవడంతో పోలవరం పనుల్లో జాప్యం జరుగుతోందని సీఎం వైఎస్ జగన్ కేంద్ర మంత్రి షెకావత్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన షెకావత్.. పక్షం రోజుల్లోగా పెండింగ్ డిజైన్లను ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని సలహాదారు వెదిరె శ్రీరాంను ఆదేశించారు. పెండింగ్ డిజైన్లను కొలిక్కితేవడమే అజెండాగా గురువారం ఢిల్లీలో వెదిరె శ్రీరాం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. టీడీపీ సర్కార్ గోదావరి వరదను మళ్లించేలా పోలవరం స్పిల్ వేను నిర్మించకుండానే.. ఈసీఆర్ఎఫ్ డయాఫ్రమ్ వాల్, ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్‌ల నిర్మాణాన్ని చేపట్టి మధ్యలోనే వదిలేసింది. 2019, 2020లలో గోదావరి వరద ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య ఖాళీ ప్రదేశాల ద్వారా ప్రవహించింది. ఆ వరద ఉధృతికి దిగువ కాఫర్ డ్యామ్‌లో 440 మీటర్ల నుంచి 660 మీటర్ల వరకు 220 మీటర్ల పొడవు, 36 మీటర్ల లోతు మేర కోతకు గురైంది. కోతకు గురైన ప్రాంతాన్ని డయాఫ్రమ్ వాల్ నిర్మించి, ఇసుకతో నింపి, డెన్సిఫికేషన్ (సాంద్రీకరణ) చేస్తూ పూడుస్తామని ఈఎన్సీ నారాయణరెడ్డి ప్రతిపాదించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మించడంతోపాటు ఇసుక, జియోమెంబ్రేన్ బ్యాగ్‌లతో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చాలని డీడీఆర్పీ చైర్మన్, సభ్యులు చేసిన ప్రతిపాదనకు సలహాదారు వెదిరె శ్రీరాం ఆమోదం తెలిపారు. -
దిగువ కాఫర్ డ్యామ్‌కు లైన్ క్లియర్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్ డ్యామ్ పనులకు మార్గం సుగమమైంది. ఈ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని బాగుచేసేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ రూపొందించిన డిజైన్‌ను డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) ఆమోదించింది. డీడీఆర్పీ నిర్ణయం, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల మేరకు పోలవరం పనులను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో గోదావరి వరదను మళ్లించే స్పిల్ వేను నిర్మించకుండానే.. ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) డయాఫ్రమ్ వాల్‌తోపాటు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల నిర్మాణాన్ని చేపట్టింది. దీనిని మధ్యలోనే వదిలేసింది. దాంతో 2019, 2020లలో గోదావరి వరద ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య ఖాళీ ప్రదేశాల ద్వారా ప్రవహించింది. వరద ఉద్ధృతికి దిగువ కాఫర్ డ్యామ్‌లో 220 మీటర్ల పొడవు, 36 మీటర్ల లోతు వరకు కోతకు గురైంది. ఈ ప్రాంతం అభివృద్ధిపై బుధవారం డీడీఆర్పీ చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలో వర్చువల్ విధానంలో జరిగిన సమావేశంలో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు, ఎస్ఈ నరసింహమూర్తి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. డయాఫ్రమ్ వాల్,జియోమెంబ్రేన్ బ్యాగ్‌లతో కోతకు గురైన ప్రాంతంలో డయాఫ్రమ్ వాల్ నిర్మించి.. దాని పక్కన ఒక పొర ఇసుక, మరో పొర జియోమెంబ్రేన్ బ్యాగ్‌లు, మరో పొరను రాళ్లతో వేసి అభివృద్ధి చేసేలా జలవనరుల శాఖ రూపొందించిన డిజైన్‌కు డీడీఆర్పీ ఆమోదం తెలిపింది. డయాఫ్రమ్ వాల్, రాళ్లు, ఇసుక, జియోమెంబ్రేన్ బ్యాగ్‌లతో ఆ ప్రాంతాన్ని 15 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పూడ్చాలి. వాటిపై మరో 9.17 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మట్టి వేయాలి. దీంతో దిగువ కాఫర్ డ్యామ్ పూర్తవుతుంది. స్పిల్ వే నుంచి విడుదలైన గోదావరి జలాలు ఈసీఆర్ఎఫ్ వెనక్కి ఎగదన్నకుండా దిగువ కాఫర్ డ్యామ్ అడ్డుకుంటుంది. జూన్, 2021 నాటికే ఎగువ కాఫర్ డ్యామ్ పూర్తయింది. దాంతో గోదావరి వరదల సమయంలోనూ ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య ఈసీఆర్ఎఫ్ నిర్మాణాన్ని చేపట్టి నిరంతరాయంగా పనులు పూర్తి చేయవచ్చు. డయాఫ్రమ్ వాల్ పటిష్టత తేలాకే ఈసీఆర్ఎఫ్ పునాది అయిన డయాఫ్రమ్ వాల్‌ను ఎల్ అండ్ టీ, బావర్ సంస్థలు నిర్మించాయి. డయాఫ్రమ్ వాల్‌పై 2018, 2019, 2020 వరదల ప్రభావం పడింది. వరద ఉధృతి ప్రభావం వల్ల డయాఫ్రమ్ వాల్ ఏమైనా దెబ్బతిందా? లేదా? అన్నది తేల్చాలని ఎల్ అండ్ టీ, బావర్ సంస్థను డీడీఆర్పీ ఆదేశించింది. ఆ రెండు సంస్థలు డయాఫ్రమ్ వాల్ పటిష్టతను పరీక్షించాయి. మరో వారంలో నివేదిక ఇస్తామని ఆ సంస్థలు తెలిపాయి. ఆ నివేదిక వచ్చాక ఈసీఆర్ఎఫ్ పనులపై తుది నిర్ణయం తీసుకుంటామని డీడీఆర్పీ చైర్మన్ ఏబీ పాండ్య చెప్పారు. -
పెన్నా కాఫర్ డ్యామ్‌కు గండి
నెల్లూరు (క్రైమ్): పెన్నా నదికి నీటి ప్రవాహం అధికం కావడంతో కాఫర్ డ్యామ్ (మట్టి కట్ట)కు గండి పడింది. ఆకస్మికంగా పెరిగిన నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఆరుగురిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో పెన్నానదిపై నూతన బ్యారేజీ నిర్మాణంలో ఉంది. బ్యారేజ్‌కు అవతల వైపు నీటిని నిల్వ చేసేందుకు కాఫర్ డ్యామ్ నిర్మించారు. ఆదివారం సాయంత్రం నీరు అధికం కావడంతో దీనికి గండి పడి, దిగువ ప్రాంతానికి నీటి ప్రవాహం పెరిగింది. పశువులు మేపుకునేందుకు, ఈత కొట్టేందుకు వెళ్లిన మహిళలు, పురుషులు.. మొత్తం ఆరుగురు నీటి ప్రవాహంలో చిక్కుకుపోయారు. అందులో భాస్కర్ అనే వ్యక్తి డయల్ 100కు ఫోన్ చేసి తమను రక్షించాలని అభ్యర్థించాడు. స్పందించిన ఎస్పీ సీహెచ్ విజయారావు సిబ్బందిని అప్రమత్తం చేశారు. నగర డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి నేతృత్వంలో సంతపేట ఇన్స్పెక్టర్ అన్వర్‌బాషా, ఎస్ఐ నాగరాజు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన పెన్నానది వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సంబంధిత అధికారులతో మాట్లాడి బ్యారేజీ గేట్లను మూయించారు. తాళ్లు, గజ ఈతగాళ్ల సాయంతో అతి కష్టం మీద భాస్కర్, అతని స్నేహితుడిని, పొర్లుకట్టకు చెందిన కాకు చిన్నమ్మ, ఆర్ సుబ్బాయమ్మ, గుణలను రక్షించారు. మరో వ్యక్తి అప్పటికే రైల్వే బ్రిడ్జి పిల్లర్‌ను ఎక్కడంతో తాళ్ల సహాయంతో అతన్ని బ్రిడ్జి మీదకు చేర్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిని ఎస్పీ అభినందించగా, బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
కాఫర్ డ్యామ్పేరుతో కపట నాటకం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు చేసిన నిర్వాకాలు ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు గుదిబండలా మారుతున్నాయి. ఒక్కదాని తర్వాత ఒకటిగా వస్తున్న సమస్యలు, న్యాయ వివావాదాలు ఇంజినీర్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పొరుగు రాష్ట్రాలతో వివాదాలను రాష్ట్రస్థాయిలోనే పరిష్కరించుకునేందుకు గతంలోని చంద్రబాబు సర్కారు ఏ మాత్రం కృషి చేయలేదు. దీంతో ప్రాజెక్టు పనులు నిలిపేయాలని కోరుతూ పొరుగు రాష్ట్రమైన ఒడిశా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు కారణంగా తమ రాష్ట్రంలోని సంరక్షిత గిరిజన గ్రామాలు ముంపుకు గురవుతాయని, బచావత్ ట్రైబ్యూనల్ ఆదేశాలు ఉల్లంఘిస్తూ నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఒడిశా ఆరోపిస్తోంది. ఒడిశా చేస్తున్న ఆరోపణలన్నీ చంద్రబాబు నిర్వాకాలను తేటతెల్లం చేస్తున్నాయి. ఇక ఏపీకి మరో వైపు ఉండే ఛత్తీస్‌గఢ్, తెలంగాణ కూడా పోలవరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు గడప తొక్కాయి. రేలా అనే స్వచ్ఛంద సంస్థ కూడా అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. నియమావళికి నీళ్లు భారీ ప్రాజెక్టుల నిర్మించేటప్పుడు రాజకీయాలకు తావులేకుండా ఇంజినీరింగ్ ప్రమాణాలు అనుసరించాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. కాని రాష్ట్ర ప్రయోజనాలకంటే సొంత ప్రయోజనాలకు చంద్రబాబు పెద్ద పీట వేసుకుంటూ సాగించిన వ్యవహారశైలి ఇప్పుడు పోలవరానికి ఇబ్బందికరంగా మారింది. ప్రాజెక్టులో కీలకమైన స్పిల్‌వేను పక్కన పెట్టి కాఫర్ డ్యామ్ నిర్మించడమన్నది చంద్రబాబు చేసిన ఘోర తప్పిదం. అంతే కాకుండా ప్రచారమే తప్ప ముంపు బాధితుల పునరావాసంపై దృష్టి సారించకపోవడంతో ఇప్పుడది అత్యున్నత న్యాయస్థానం వరకు వెళ్లింది. పోలవరంపై చేసిన ప్రచార ఆర్భాటంలో కనీసం కొంతైనా పునరావాసంపై దృష్టి సారించి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు ఇప్పుడు పోలవరం పనులు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నాయి. ఆయన సృష్టించిన సమస్యలు, న్యాయపరమైన వివాదాల నుంచి గట్టెక్కేందుకు అధికారులు తీవ్రస్థాయిలో శ్రమిస్తున్నారు. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒడిశా అభ్యంతరాలపై జవాబు ఇచ్చేందుకు కేంద్రం, ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నాయి. గత ప్రభుత్వం ప్రాజెక్టు విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడం, పునరావాసం, పునర్నిర్మాణ పనులను పట్టించుకోకపోవడంతో కొత్త చిక్కులు వచ్చే ప్రమాదం కనిపిస్తోందని ఇంజినీరింగ్నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ, తూర్పు, పశ్ఛిమ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాల్లో 540 గ్రామాలకు తాగునీరు అందిస్తుంది పోలవరం ప్రాజెక్టు. దాదాపు 3 లక్షల హెక్టార్లకు సాగు నీరు సమకూర్చడంతో పాటు 960 మెగావాట్ల స్థాపిత సామర్ధ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసే జలవిద్యుత్కేంద్రం కూడా ఏర్పాటు కానుంది. వీటి ద్వారా ఆంధ్రపదేశ్ముఖచిత్రం పూర్తిగా మారిపోవడం తథ్యం. పచ్చ ప్రచారం వాస్తవాలు జనాలకు తెలిస్తే ఎక్కడా తమను మరింత ఛీత్కరించుకుంటారనే భయంతో చంద్రబాబు తన అనుకూల మీడియాలో విపరీతంగా దుష్ప్రచారం చేయిస్తున్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలవరం పనులు నిలిచిపోయాయంటూ టీడీపీ, దానికి అండగా ఉండే మీడియా గోబెల్స్ తరహాలో ప్రచారం చేస్తోంది. నిజానికి కోర్టు ఆదేశాల కారణంగా హైడల్ పవర్‌స్టేషన్ పనులు నిలిచిపోయినా ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన పనులన్నీ జోరుగా సాగుతున్నాయి. కాని పునరావాసం, పునర్నిర్మాణం పనులు నిదానించడం సమస్యగా మారింది. పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.51,424 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో ఆర్అండ్ ఆర్, భూ సేకరణకే రూ.32,509 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అంటే నిర్మాణ పనుల కన్నా వీటికే భారీ మొత్తం కేటాయించాల్సి వస్తుంది. 2013లో తీసుకొచ్చిన పటిష్టమైన భూసేకరణ చట్టం ప్రాజెక్టుల నిర్మాణం కారణంగా నష్టపోయేవారికి, ముంపు బాధితులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తోంది. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి 13 అనుమతులకు గాను 11 అనుమతులు అప్పటి ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి సమయంలోనే లభించాయి. భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణ పనులకు సంబంధించి కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ, ప్రణాళిక సంఘం, కేంద్ర జలసంఘం నుంచి అప్పటి సీఎం వైఎస్సార్ అనుమతులు సాధించారు. ఆ తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన కిరణ్కుమార్ప్రభుత్వం ప్రాజెక్టు పనులకు టెండర్ పిలిచింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగి, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. కాని ప్రాజెక్టు పనులు చేయలేని స్థితిలో ఉన్న కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించి తమ వారికి సబ్‌కాంట్రాక్టులు దన్నుకున్నారు. అపార నష్టం చంద్రబాబు చర్యలతో పోలవరం ప్రాజెక్టుకు జరిగిన నష్టం మాటల్లో చెప్పలేనిది. ప్రాజెక్టు పనులతో పాటు భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణ పనులు సమాంతరంగా సాగాలి. కాని చంద్రబాబు ఏలుబడిలో నిర్మాణ పనులు ఇంజినీరింగ్ నియమ నిబంధనలకు విరుద్ధంగా సాగాయి. ప్రాజెక్టులో ముందు స్పిల్‌వే పనులు జరగాల్సి ఉండగా దాన్ని పట్టించుకోకుండా కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టారు. ఈ కారణంగా అసలు పనులు నిలిచిపోయాయి. అదే సమయంలో గోదావరికి వచ్చిన వరదలతో స్పిల్‌వే నుంచి నీరు పోవడంతో ముంపు పెరిగింది. గతేడాది గోదావరికి వచ్చిన భారీ వరదతో అప్పుడు పనులు నిలిచిపోవడమే కాదు ఎగువ భాగంలో ముంపు సమస్య తీవ్రమైంది. ఈ కారణంగా ఈ ఏడాది జనవరి వరకు కూడా పనులు చేపట్టేందుకు స్థలం లేకుండా పోయింది. భారీ వరదల కారణంగా రోడ్లు పూర్తిగా కొట్టుకుపోవడంతో వాటిని మళ్లీ నిర్మించాల్సి వచ్చింది. అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూరుతుండటంతో ఇప్పుడిప్పుడే పనుల్లో వేగం పెరిగింది. దిద్దుబాటు చర్యలు గత ప్రభుత్వ వైఖరి కారణంగా చోటుచేసుకున్న ఇంజినీరింగ్లోపాలు సరిదిద్దుతూ, రాజకీయాలు, కాంట్రాక్టర్ప్రయోజనాలకు అతీతంగా ఇంజినీరింగ్ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వం ఇప్పుడు పనులు చేయిస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమైన పనులన్నీ వచ్చే ఏడాది ఏప్రిల్‌నాటికి పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించిన ప్రభుత్వం వచ్చే ఏడాది జూన్‌నాటికి మొత్తం పనులన్నీ ముగిసేలా సమాయత్తమవుతోంది. కాఫర్ డ్యామ్పేరుతో కపట నాటకం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ముంపు తలెత్తి పనులు అధిక కాలం ఆగిపోవడానికి ముఖ్య కారణం కాఫర్‌డ్యామ్. తన హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తికాదని గ్రహించిన చంద్రబాబు అప్పట్లో కాఫర్డ్యామ్పేరుతో కొత్త నాటకానికి శ్రీకారం చుట్టారు. రూ. 50 వేల కోట్లకు పైగా ఖర్చుతో చేపట్టిన ప్రాజెక్టు కోసం రాష్ట్రంలో నిధులు లేకపోవడం, అటు కేంద్రం కూడా రిక్తహస్తం చూపడంతో కాఫర్ డ్యామ్ కట్టేసి దాన్నే పోలవరం ప్రాజెక్టుగా చూపేందుకు చంద్రబాబు కుటిల పన్నాగాలు పన్నారు. 42.5 మీటర్ల ఎత్తులో కాఫర్ డ్యామ్ నిర్మించాలని బాబు ప్రభుత్వం అప్పట్లో ప్రతిపాదన తీసుకురాగా ఎత్తు తగ్గించాలని సూచిస్తూ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా కేంద్రం అనుమతి మంజూరు చేసింది. జలాశయాల నిర్మాణంలో ఎక్కడా, ఎప్పుడూ లేనిరీతిలో కాఫర్‌డ్యామ్ నిర్మించి పోలవరం తొలి దశ పూర్తి చేసినట్టు చెప్పుకునేందుకు చంద్రబాబు ప్రచారం రూపొందించుకున్నారు. పోలవరం కాఫర్ డ్యామ్పేరుతో ఆంధ్రప్రదేశ్‌కు తీరని ద్రోహం చేశారు. అసలు కాఫర్ డ్యామ్ అంటే ఏంటి? జలాశయాలు నిర్మించేటప్పుడు ఆ పనులకు నీరు అడ్డు రాకుండా నదీ ప్రవాహం మళ్లించేందుకు నిర్మించే తాత్కాలిక కట్టడం కాఫర్ డ్యామ్. ప్రధాన పనులు పూర్తైన తర్వాత దీన్ని తొలగిస్తారు. ఇది ఏ మాత్రం పటిష్టంగా, స్థిరంగా ఉండదు. శాశ్వతంగా అసలు ఉపయోగపడదు. అలాంటి నిర్మాణం పూర్తి చేసి దాంతో పోలవరం మొదటి దశ పూర్తి చేసినట్టు చెప్పుకునేందుకు అప్పట్లో చంద్రబాబు సర్కారు విపరీతంగా ప్రయత్నించింది. దీని వలన ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లగా కాంట్రాక్టరుకు మాత్రం భారీ లబ్ధి చేకూరింది. -
కాఫర్ డ్యామే మా కొంప ముంచింది..
దేవీపట్నం(రంపచోడవరం): ‘‘నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, పునరావాసం కల్పించకుండా మీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టులో కాఫర్ డ్యామ్ నిర్మించారు, మీరంతా బాగానే ఉన్నారు, వరదల్లో మేము నానా కష్టాలు పడుతున్నాం’’ అని వరద బాధితులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేష్‌ను నిలదీశారు. అప్పుడే తమకు పునరావాస ప్యాకేజీ ఇస్తే ఊరు వదిలిపెట్టి వెళ్లిపోయేవారమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ గురువారం టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, అప్పారావుతో కలిసి తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించారు. పోశమ్మ గండి వద్ద నుంచి బోట్లో దేవీపట్నంలోని శివాలయం వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. వరద బాధితులతో లోకేష్ మాట్లాడుతుండగా.. ‘‘కాఫర్ డ్యామ్ నిర్మాణమే మా కొంప ముంచింది’’ అంటూ మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం ముందుచూపు లేకుండా చేసిన పనికి తమ గ్రామాలు నీట మునిగాయన్నారు. లోకేష్ స్పందిస్తూ.. కాఫర్ డ్యామ్ వద్ద ఖాళీ వదిలిపెట్టామని చెప్పారు. ఆయన సమాధానంపై వరద బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు కల్పించుకుని కాఫర్ డ్యామ్ వల్ల వచ్చిన వరద కాదంటూ సముదాయించే ప్రయత్నం చేశారు. దీంతో మహిళలు కాఫర్ డ్యామ్‌తో ముప్పుందని గత ప్రభుత్వ హయాంలో అనేకమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వం పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండానే కాఫర్ డ్యామ్ నిర్మించిందని స్ధానికులు ఆరోపించారు. దేవీపట్నం గ్రామంలో నేటికీ ఇంటి పరిహారం గానీ, భూమికి నష్ట పరిహారం గానీ ఇవ్వలేదని బాధితులు వాపోయారు. -
గిరిజనులను ముంచిన కాఫర్ డ్యామ్
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: నిపుణుల మాటలను పెడచెవిన పెట్టి చంద్రబాబు సర్కార్ నిర్మించిన కాఫర్ డ్యామ్ గిరిజనుల ‘కొంప’ ముంచింది. అదే ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో మన్యం వాసులు నిద్రలేని రాత్రులు గడిపే స్థితికి కారణమైంది. కాఫర్ డ్యామ్ నిర్మాణంతో సమీప గ్రామాల్లో ప్రజలు వరద ముంపులో చిక్కుకుంటారని తెలిసినా నాటి ప్రభుత్వం కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ప్రస్తుతం డ్యామ్‌కు సమీపాన ఉన్న దేవీపట్నం నుంచి కూనవరం మండలం వరకూ ఉన్న సుమారు ఐదు వేల కుటుంబాలు గోదావరి వరద ముంపునకు గురయ్యాయి. కాఫర్ డ్యామ్‌ను ఒక క్రమ పద్ధతిలో నిర్మించి ఉంటే ఇంతటి వరదను ఎదుర్కోవాల్సిన అగత్యం ఏర్పడేదే కాదు. అటు పశ్చిమ గోదావరి జిల్లా పైడిపాక నుంచి ఇటు తూర్పుగోదావరి జిల్లా పోసమ్మగండి వరకూ 1800 మీటర్ల పొడవు, 2400 మీటర్ల వెడల్పుతో కాఫర్ డ్యామ్‌ను నిర్మించారు. ఈ డ్యామ్‌కు రెండు వైపులా 300 మీటర్లు వంతున ఖాళీగా వదిలేశారు. ఏటా గోదావరికి ఆగస్టు వచ్చేసరికి వరదలు వస్తాయని తెలిసి కూడా ముందస్తు అంచనాలు లేకుండా చంద్రబాబు సర్కార్ డ్యామ్ నిర్మాణం చేపట్టింది. కాఫర్ డ్యామ్ నిర్మించే ముందు కనీసం నిర్వాసితులకు రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ (ఆర్అండ్ఆర్) ప్యాకేజీ అందజేసి కాలనీలు నిర్మించి ఉంటే ఇప్పుడు ఇంతటి విపత్కర పరిస్థితి ఎదురయ్యేది కాదు. వాస్తవానికి భద్రాచలం వద్ద గోదావరి 53 అడుగులకు చేరుకుని మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినప్పుడు మాత్రమే ఈ గిరిజన గ్రామాలు వరద ముంపునకు గురవుతాయి. కానీ ప్రస్తుతం భద్రాచలం వద్ద 46 అడుగులతో మొదటి ప్రమాద హెచ్చరిక మాత్రమే జారీ చేశారు. అంటే.. వరద ముంపు ఈ గిరిజన గ్రామాలకు ఉండకూడదు. 48 అడుగులతో ఉన్నప్పుడు రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే 30 గ్రామాలు, 53 అడుగులతో ఉన్నప్పుడు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే గిరిజన గ్రామాలన్నీ వరద నీటిలో మునిగిపోతాయి. గోదావరికి భారీగా వరదలు వచ్చి భద్రాచలం వద్ద మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన 1953, 1986, 2006, 2013లలో మాత్రమే ఈ గిరిజన గ్రామాలు నీట మునిగాయి. కానీ ఇప్పుడు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసే సరికే గిరిజన గ్రామాలన్నీ జలదిగ్బంధానికి గురయ్యాయి. ఇదంతా కాఫర్ డ్యామ్ నిర్మాణంతో ఎదురైన వరద ఉధృతేనని అధికారులే చెబుతున్నారు. -
పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉధృతి
-
పోలవరం వద్ద పెరుగుతున్న గోదావరి ఉధృతి
సాక్షి, పశ్చిమ గోదావరి : పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉధృతి పెరుగుతుంది. ఎగువ నుంచి వరదనీరు ఎక్కువగా ఉండటంతో కాఫర్ డ్యామ్‌కు వెళ్లే అప్రోచ్ రోడ్డు మునిగిపోయింది. అప్రోచ్ రోడ్డుపై నుంచి గోదావరి వరద నీరు ప్రవహిస్తుంది. ప్రాజెక్టు వద్ద 600 మీటర్ల వెడల్పు మేర గోదావరి నీరు ప్రవహిస్తుంది. అక్కడ మొత్తం గోదావరి వెడల్పు 2400 మీటర్లు కాగా, ఇప్పటికే 2200 మీటర్ల మేర నదిని కాఫర్ డ్యామ్ నిర్మాణంతో అధికారులు మూసివేశారు. దీంతో ఖాళీగా కొద్ది భాగం నుంచే వరద నీరు కిందకి వెళుతుంది. -
వరద రాకముందే పనులు పూర్తవ్వాలి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ రక్షణ పనులను ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాల్సిందిగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పనుల ఏజెన్సీని ఆదేశించింది. ప్రస్తుతం కాఫర్ డ్యామ్ రక్షణ పనులు 70 శాతం పూర్తి కాగా, ఇంకా 30 శాతం చేయాల్సి ఉంది. గోదావరికి వరద వచ్చేలోగా నూరు శాతం రక్షణ పనులు చేయగలరా లేదా అంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ రాష్ట్ర జలవనరుల శాఖను అడిగింది. మిగిలిన 30 శాతం పనులను ఈ నెల 15వ తేదీలోగా ఎట్టిపరిస్థితుల్లోనైనా పూర్తి చేయాల్సిందేనని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, పనులు చేస్తున్న ఏజెన్సీ నుంచి స్పష్టమైన హామీ కావాలని కోరింది. ఈ నెల 15వ తేదీలోగా కచ్చితంగా పూర్తి చేస్తామని, రెండు షిఫ్టుల్లో పనులు చేయిస్తామని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్ స్పష్టం చేశారు. పోలవరం హెడ్ వర్క్స్ జలాశయంలో ఇప్పటి వరకు చేసిన పనులను గోదావరి వరద నుంచి రక్షించడం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, భూ సేకరణ, సహాయ పునరావాసం (ఆర్ అండ్ ఆర్) తదితర అంశాలపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) గురువారం విజయవాడలో సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశంలో పీపీఏ సీఈవో ఆర్కే జైన్, సభ్య కార్యదర్శి బీపీ పాండే కాఫర్ డ్యామ్ రక్షణ పనుల పురోగతితో పాటు కాఫర్ డ్యామ్ 41.15 మీటర్ల లెవల్‌కు ఆర్ ఆండ్ ఆర్ పనులు పూర్తి చేయడంపై లోతుగా సమీక్షించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే మార్చి ఆఖరుకల్లా సహాయ, పునరావాస పనులను పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఏది ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పండి వచ్చే ఏడాది కాలంలో పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఏది ఎçప్పటిలోగా పూర్తి చేస్తారో సవివరమైన ప్రణాళికను వారంలోగా అందజేయాల్సిందిగా పీపీఏ కోరింది. ఈ పనుల్లో ఏది ముందు, ఏది తర్వాత అనేది సీక్వెన్సీగా ఉండాలని, ఇందుకు అనుగుణంగా ప్రణాళికను రూపొందించి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో ఉంచాలని, దీని ప్రకారం పురోగతిని పర్యవేక్షిస్తామని చెప్పింది. ఈ ప్రక్రియను ఆగస్టు 1వ తేదీలోగా పూర్తి చేస్తామని, వచ్చే ఏడాదిలో చేపట్టే పనుల గురించి సమగ్ర ప్రణాళికను వచ్చే శుక్రవారానికి సమర్పిస్తామని ఈఎస్సీ వెంకటేశ్వరరావు తెలిపారు. పోలవరం ఎడమ కాలువ మిగతా పనులతో పాటు, డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌కు చెందిన పనులకు వెంటనే టెండర్లను పిలిచి త్వరగా పనులు పూర్తి చేయాల్సిందిగా పీపీఏ సూచించింది. డిజైన్ల అంశంపై కూడా సమీక్షించింది. రూ.5,000 కోట్ల మేర చేసిన పనులకు గాను రూ.3,000 కోట్లను విడుదల చేసేందుకు ఇటీవల కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ అంగీకారం తెలిపిందని, ఈ డబ్బు ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి త్వరగా రాష్ట్రానికి వచ్చేలా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర జలవనరుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కోరారు. కేంద్రం నుంచి నిధులు త్వరగా ఇప్పిస్తే రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇందుకు పీపీఏ సానుకూలంగా స్పందిస్తూ నిధులు విడుదలయ్యేందుకు కృషి చేస్తామని పేర్కొంది. భూ సేకరణ, సహాయ పునరావాసానికి సంబంధించి రూ.1,400 కోట్ల బిల్లులో రూ.1100 కోట్ల మేరకు బిల్లులను కేంద్రానికి సమర్పించారని, మిగతా రూ.300 కోట్ల బిల్లులను త్వరగా సమర్పిస్తే ఆడిట్ చేసి నిర్ణయం తీసుకుంటామని పీపీఏ సూచించింది. మిగతా బిల్లులను 15 రోజుల్లో సమర్పిస్తామని ఈఎన్సీ వెంకటేశ్వరరావు తెలిపారు. తెలంగాణ సీఈ మాట్లాడుతూ 50 లక్షల క్యూసెక్కుల వరదపై అధ్యయనం చేయాలని పీపీఏకు లేఖ రాశామని, దీనిపై ఏం చేశారో తెలపాలని కోరారు. దీనిపై ఏపీ అధికారులు స్పందిస్తూ సాధారణంగా 22 లక్షల క్యూసెక్కులకే అధ్యయనం చేయాల్సి ఉండగా, 36 లక్షల క్యూసెక్కులకు అధ్యయనం చేశామని పేర్కొన్నారు. పోలవరం పూర్తవ్వడానికి మరో మూడేళ్లు : ఆర్కే జైన్ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో మూడేళ్లు సమయం పట్టే అవకాశం ఉందని పీపీఏ సీఈవో ఆర్కే జైన్ అభిప్రాయపడ్డారు. పీపీఏ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2022 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. కాఫర్ డ్యామ్ రక్షణ పనులు, వరద అంచనా వ్యవస్తలపై ఈ సమావేశంలో చర్చించామని తెలిపారు. ప్రస్తుతం కాఫర్ డ్యామ్ పనులు పాక్షికంగా పూర్తయ్యాయని, వరదలు రాక ముందే పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. పోలవరం డ్యామ్‌కు వచ్చే వరద వల్ల కాఫర్ డ్యామ్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం ఇప్పటి వరకు రూ.6,700 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. శుక్రవారం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంచనాలను పెంచే విషయం ఎస్టిమేషన్ కమిటీ పరిశీలిస్తోందన్నారు. -
గోదారి చెంత తాగునీటికి చింత
సాక్షి, దేవీపట్నం (తూర్పు గోదావరి): చెంతనే జీవనది గోదావరి ప్రవహిస్తున్నప్పటికీ తాగేందుకు పరిశుభ్రమైన నీరు లేక మండలంలోని పూడిపల్లి వాసులు దాహంతో అల్లాడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతున్న పూడిపల్లి గ్రామం గోదావరి ఒడ్డునే ఉంది. ఆ దిగువనే గల పోశమ్మ గండి వద్ద నిర్మిస్తున్న కాఫర్ డ్యాం వల్ల గోదావరి నీరు దిగువకు పోయే అవకాశం లేకుండా పోయింది. వేసవిలో గోదావరి నదిలోని పాయ పూడిపల్లి, పోశమ్మ గండి వైపు నుంచే దిగువకు ప్రవహించేది. కానీ కాఫర్ డ్యామ్ నిర్మాణంతో వీరవరం లంకకు ఆవల పశ్చిమ గోదావరి జిల్లా ఒడ్డు నుంచి నదీ పాయ ప్రవాహాన్ని మళ్లించారు. పూడిపల్లి వైపు నదిలో నిలిచిపోయిన నీరు ఆకుపచ్చగా మారి కలుషితమై, గ్రామస్తులు తాగేందుకు పనికిరాకుండా పోయింది. నెరవేరని జేసీ హామీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భాగంగా నిర్వహించిన బ్లాస్టింగ్ వల్ల పూడిపల్లి గ్రామంలోని ఇళ్లు బీటలు వారి, శ్లాబులు పెచ్చులూడుతున్నాయిని గ్రామస్తులు పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఏడాది క్రితం జాయింట్ కలెక్టర్ మల్లికార్జున పూడిపల్లి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఆ సమయంలో ప్రజల విజ్ఞప్తి మేరకు తాగునీటి కోసం గ్రామంలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేస్తామని జేసీ హామీ ఇచ్చారు. ఇంతవరకూ ఆయన హామీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం తాము ఏడు కిలోమీటర్ల దూరంలోని పురుషోత్తపట్నం వెళ్లి సత్యసాయి మంచినీటి పథకం నుంచి నీటిని తెచ్చుకుంటున్నామని గ్రామస్తులు తెలిపారు. అంతదూరం వెళ్లలేని వారు గత్యంతరం లేక చెంతనే ఉన్న గోదావరి నదిలోని కలుషిత నీటినే తాగుతూ రోగాల బారిన పడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సమీపంలో పూడిపల్లి ఉన్నప్పటికీ, ఈ గ్రామం ఫేజ్– 3లో ఉండడంతో ఇప్పట్లో గ్రామాన్ని ఖాళీ చేసే పరిస్థితి లేదు. కానీ కాఫర్‌డ్యామ్ నిర్మాణం వల్ల గోదావరి నదికి వరదలు వస్తే ముప్పు తప్పదని పూడిపల్లి వాసులు ఆందోళన చెందుతున్నారు. కనీసం తాము ఇక్కడ నుంచి విడిచిపోయేంత వరకైనా తాగునీటి సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు. -
‘ముంపు గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం’
సాక్షి, తూర్పు గోదావరి : పోలవరం ప్రాజెక్ట్ కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తి కావడంతో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లోని నదీ ప్రవాహంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్ ఎగువున మునుపటి కన్నా 15 అడుగుల ఎత్తులో గోదావరి నదీ ప్రవాహం ఉండటంతో.. 15 లక్షల క్యూసెక్కుల నీరు కాఫర్ డ్యామ్ ద్వారా దిగువకు వెళ్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ ఎగువన ఉన్న 33 నిర్వాసిత ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఏజెన్సీ ప్రాంతాలను, ముంపు మండలాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. -
‘లోకేశ్‌ను పప్పు అనడం కరెక్టే’
రాజమహేంద్రవరం: మంత్రి నారా లోకేశ్‌ను పప్పు అనడంలో తప్పేంలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంపై చంద్రబాబు సర్కారు అతిగా స్పందించిందని విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అనేక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన రాలేదని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2018 నాటికి గ్రావిటీ ద్వారా తాగునీరు వస్తుందని చెబుతున్నారని, అలా చేయగలిగితే ఓట్లన్నీ మీకే పడతాయని చెప్పారు. కాఫర్ డ్యామ్ ద్వారా నీళ్లు ఇస్తామంటున్నారని, అసలు కాఫర్ డ్యామ్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు సాధ్యం కాదని ఉండవల్లి అభిప్రాయం వ్యక్తం చేశారు. -
మట్టికట్టతో కనికట్టు
-
మట్టికట్టతో కనికట్టు
పోలవరం నిర్మాణంలో బాబుగారి కుట్రలెన్నో.. కాఫర్ డ్యామ్‌ను ప్రధాన డ్యామ్‌గా నమ్మించే ఎత్తుగడ సాక్షి, హైదరాబాద్: ‘‘కాఫర్ డ్యామ్ నిర్మించి పోలవరం కాలువలకు నీళ్లిచ్చేద్దాం.. ఇదే పోలవరం తొలిదశ.’’ - మంగళవారంనాడు పోలవరం ప్రాజెక్టు వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన ఇది. ఈ ప్రకటన చూడగానే ఇంజనీర్లకయితే మూర్ఛవచ్చినంత పనైంది. సాగునీటి శాఖ అధికారులూ సీఎం ప్రకటన చూసి విస్తుపోయారు. అసలు కాఫర్ డ్యామ్ అంటే ఏమిటి? జలాశయం నిర్మించడానికి ముందు ఇది ఎందుకు కడతారు? ప్రధాన డ్యామ్‌కు కాఫర్ డ్యామ్‌కు ఉన్న తేడా ఏమిటి? నిజంగా సీఎం చెబుతున్నట్లు కాఫర్ డ్యామ్ కట్టడం పూర్తయితే పోలవరం తొలిదశ పూర్తయినట్లేనా? అసలు ఈ కాఫర్ డ్యామ్ సీఎం చెబుతున్నట్లు 60 టీఎంసీల నీటి నిల్వకు పనికి వస్తుందా? ఇవన్నీ ప్రజల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు. అసలు కేంద్రం నిర్మించాల్సిన జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టును మేమే నిర్మిస్తామంటూ చంద్రబాబు ఎందుకు ఆతృతపడుతున్నారు? కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎందుకు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు? అందులోని మర్మమేమిటి? వంటివి అర్ధం చేసుకోవాలంటే ఇది చదవండి. పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం. 2018 నాటికి డయాఫ్రం వాల్ నిర్మించి పోలవరం తొలి దశ పూర్తి చేస్తామని చంద్రబాబు ఇన్నాళ్లూ చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇపుడు కాఫర్ డ్యామ్‌నే పోలవరం తొలిదశగా ప్రకటించేశారు. అంతేకాదు 60 టీఎంసీల నిల్వకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. తొలిదశను పూర్తి చేశామని ప్రచారం చేసుకోవడం ద్వారా రాజకీయ లబ్ది పొందడం, మరోపక్క తన అనుయాయుడైన సొంత పార్టీ కాంట్రాక్టరుకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం, ఆ పైన కమీషన్లు కైంకర్యం చేయడం ప్రభుత్వ పెద్దల లక్ష్యాలుగా కనిపిస్తున్నాయని జలవనరుల శాఖ అధికార యంత్రాంగం వ్యాఖ్యానిస్తోంది. కాఫర్‌డ్యామ్ తాత్కాలిక నిర్మాణం మాత్రమే సాధారణంగా ఏదైనా ఆనకట్ట నిర్మించాలంటే తాత్కాలిక మట్టి అడ్డుకట్టతో నీటిని దారి మళ్లించడం తప్పనిసరి. దాన్నే కాఫర్ డ్యామ్ అంటారు. అంటే ప్రధాన డ్యామ్ నిర్మాణానికి ముందు మట్టితో నిర్మించే తాత్కాలిక డ్యామ్ అన్నమాట. జలాశయ నిర్మాణ పనులకు నీళ్లు అడ్డురాకుండా.. ప్రవాహాన్ని మళ్లించడానికి ఏర్పాటు చేసే తాత్కాలిక నిర్మాణమే కాఫర్ డ్యామ్. ఈ డ్యామ్ ఏ మాత్రం పటిష్ఠంగా ఉండదు. శాశ్వతంగా అసలు పనికి రాదు. కానీ పోలవరం ప్రాజెక్టుకు కొత్తగా కాఫర్ డ్యామ్ నిర్మిస్తున్నట్లు చంద్రబాబు గొప్పగా చెప్పడం పట్ల నీటిపారుదల రంగంపై అవగాహన ఉన్న వారందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాఫర్ డ్యామ్ ద్వారా 60 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు కేంద్ర జలసంఘం ఆమోదం తెలిపిందని చంద్రబాబు కొత్త వాదన తీసుకురావడం చూసి ఇంజనీరింగ్ అధికారులు నివ్వెరపోతున్నారు. గోదావరికి గరిష్టం గా 30 లక్షల క్యూ సెక్కులు వరద వస్తుంది. కనీసం నాలుగు లక్షల క్యూసెక్కుల వరదని కూడా తట్టుకుని నిలబడే సామర్థ్యం కాఫర్‌డ్యామ్‌కు ఉండదని జలవనరుల శాఖలో పనిచేస్తున్న ఇం జనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. నీటి ప్రవాహాన్ని మళ్లించడానికే తప్ప నీరు నిల్వ చేయడానికి కాఫర్ డ్యామ్ పనికిరాదని ఇంజనీర్లు చెబుతున్నారు. అలాంటి తాత్కాలిక నిర్మాణాన్ని పూర్తిచేసి పోలవరం తొలి దశ పూర్తయిందని చెప్పుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని అధికార యంత్రాంగం అభిప్రాయపడుతోంది. భారీ ఎత్తున వరద వస్తే తట్టుకునే శక్తి ఈ కాఫర్ డ్యామ్‌కు ఉండదని, దా నికి గండి పడితే దిగువ ప్రాంతంలో పెద్దఎత్తున ప్రాణ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు. కాఫర్ డ్యామ్‌తో అంత నీటి నిల్వ సాధ్యమైతే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, కాటన్ బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీ వంటి వాటికి బదులు కాఫర్ డ్యామ్‌లే నిర్మించి.. ఎక్కువ నీటిని నిల్వ చేసి ఉండేవారు కదా అని ఇంజనీర్లు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై రూ.20వేల కోట్ల భారం పోలవరం నిర్మాణం బాధ్యత కేంద్రానిదే అయినా కేవలం కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేలా కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. ఇందుకు అంగీకరించిన కేంద్రం 2010-11 ఎస్ఎస్ఆర్ ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించేందుకు అంగీకరించింది. 2010-11 అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.16,010.45 కోట్లు. మార్చి 31, 2014 వరకూ రూ.5135.87 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో రూ.562.46 కోట్లను ఏఐబీపీ కింద కేంద్రం విడుదల చేసింది. ఇప్పటివరకూ ఖర్చు చేసిన నిధులు పోను మిగతా సొమ్మును మాత్రమే కేంద్రం ఇచ్చేందుకు అంగీకరించింది. అదీ ప్రాజెక్టు నిర్మాణం, కాలువలు, డిస్ట్రిబ్యూటరీలకు అయ్యే వ్యయం మాత్రమే. భూసేకరణ, నిర్వాసితుల పునరాసానికి అయ్యే వ్యయాన్ని ఇస్తామని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. ఏప్రిల్ 1, 2014 నుంచి ప్రాజెక్టుకు చేసిన ఖర్చును మాత్రమే చెల్లించేందుకు అంగీకరించింది. తాజా ఎస్ఎస్ఆర్ మేరకు పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.36 వేల కోట్లకుపైగా పెరిగినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వంపై కనీసం రూ.20 వేల కోట్ల భారం పడనుంది. కాంట్రాక్టరును కాపాడడం.. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితమే పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ని ఏర్పాటు చేసింది. ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు వీలుగా ఒప్పందం చేసుకోవాలంటూ రెండేళ్ల క్రితమే ముసాయిదా(డ్రాఫ్ట్)ను పీపీఏ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. పీపీఏకి అప్పగిస్తే.. ప్రాజెక్టు నిధుల వ్యయంపై కేంద్రం పర్యవేక్షణ ఉంటుంది. నిధులు కొట్టేసేందుకు వీలుండదు. ప్రాజెక్టు హెడ్ వర్క్స్ పనులు సక్రమంగా చేయడం లేదంటూ టీడీపీ ఎంపీ రాయపాటి కి చెందిన ట్రాన్స్ట్రాయ్పై అనేక సందర్భాల్లో పీపీఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈపీసీలో 60సీ నిబంధన కింద కాంట్రాక్టర్‌పై వేటు వేసి.. సమర్థుడైన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాలని సూచించింది. కానీ.. ఇవేవీ చంద్రబాబు పట్టించుకోలేదు. రాయపాటిని రక్షించడం.. అంచనాలు పెంచేసి కమీషన్లు కొట్టేసేందుకు పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలంటూ కేంద్రానికి విన్నవిస్తూ వచ్చారు. ఫలితంగా జూన్ 2, 2014 నుంచి ఇప్పటివరకూ 232 కోట్ల విలువైన పనులను మాత్రమే కాంట్రాక్టర్ పూర్తి చేశారు. పీపీఏ సిఫారసు మేరకు కాంట్రాక్టర్‌పై వేటు వేసి మళ్లీ టెండర్లు పిలిచి ఉంటే సమర్థుడైన కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసే సౌలభ్యం ఉండేది. ఇనుము, డీజిల్, సిమెంటు వంటి ధరలు తగ్గిన నేపథ్యంలో పోలవరం అంచనా వ్యయమూ తగ్గి ఉండేది. ఆ మేరకు ప్రభుత్వంపై భారం తగ్గేది. ప్రాజెక్టు ఈ పాటికే ఓ కొలిక్కి వచ్చేది. రాష్ట్ర ప్రభుత్వం చేతికి దక్కగానే పోలవరం హెడ్ వర్క్స్ పనులను నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు అప్పగించేసి.. కమీషన్లు దండుకుంటున్నారు. పోలవరం కాంట్రాక్టు కోసం.. ‘హోదా’ తాకట్టు ప్రాజెక్టు అంచనాలు పెంచేసి కమీషన్లు దండుకోవడం కోసం ఆ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలంటూ కేంద్రంతో రాయభేరాలు సాగించడానికి కాంట్రాక్టర్లయిన కేంద్ర మంత్రి సుజనా, ఎంపీ సీఎం రమేష్‌లను చంద్రబాబు పంపారు. రాష్ట్ర వినతి మేరకు ఆ ప్రాజెక్టును కేంద్రం రాష్ట్రానికే అప్పగించింది. దాంతో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రం చేతికి చిక్కిన 24 గంటల్లోనే హెడ్ వర్క్స్ అంచనా వ్యయాన్ని ఏకంగా రూ.1,482 కోట్లు పెంచేశారు. ఆ మేరకు కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చి కమీషన్లు కొట్టేశారు. 2018 నాటికి పోలవరం పూర్తయ్యేనా? 2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ీ చంద్రబాబు చెబుతుంటే.. ఆయన కేబినెట్లోని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి ఇటీవల శాసనమండలిలో మాట్లాడుతూ నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. వీటిని బట్టి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి వెల్లడవుతోంది. క్షేత్ర స్థాయి పరిస్థితులను విశ్లేషించినా.. పీపీఏ భేటీ మినిట్స్‌ను పరిశీలించినా 2018 నాటికి పోలవరం పూర్తవడం అసాధ్యం. దీనికితోడు పీపీఏ సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా మే 13న భేటీలోనూ ఈ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని చెప్పడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకే కేంద్రమే పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అప్పగించిందని చంద్రబాబునాయుడు చెబుతోన్న మాటల్లో వీసమెత్తు కూడా వాస్తవం లేదు. ఈనెల 7న అర్ధరాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకే పోలవరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌కు అప్పగిస్తున్నామని చాలా స్పష్టంగా ప్రకటించారు. ఈనెల 8న కేంద్ర ఆర్థిక శాఖ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్సైట్లో పెట్టిన ప్రకటనలోనూ ఇదే అంశాన్ని తేటతెల్లం చేశారు. చత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు ఉన్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయలేదని.. కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. కానీ చంద్రబాబు మాత్రం నీతి ఆయోగ్ సిఫారసు మేరకే పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినట్లు పదే పదే చెబుతోండటం గమనార్హం. విభజన చట్టం ప్రకారం పోలవరం బాధ్యత కేంద్రానిదే ♦ ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 90(1) ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ♦ 90(2) ప్రకారం.. ప్రజాభ్యుదయం దృష్ట్యా పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ♦ 90(3) ప్రకారం.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ రాష్ట్రం పూర్తిగా సమ్మతించింది. ♦ 90(4) ప్రకారం.. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి అయ్యే వ్యయం, భూసేకరణ, నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీకి అయ్యే వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తుంది. పర్యావరణ, అటవీ తదితర అనుమతులను కేంద్రం తీసుకొస్తుంది. పోలవరం ప్రాజెక్టును కేంద్రప్రభుత్వమే నిర్మిస్తుంది. అందులో ఎలాంటి సందేహమూ లేదు. పోలవరం ప్రాజెక్టుకుర్తిస్థాయి పునరావాస పథకాన్ని అమలు చేయడానికి అవసరమైన అన్ని సవరణలను సాధ్యమైనంత త్వరగా చేపడతామని గౌరవసభ్యులకు హామీ ఇస్తున్నాను. - విభజన బిల్లుపై చర్చ సందర్భంగా 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన మహానేత మూడున్నర దశాబ్దాలుగా మూలన పడిపోయిన పోలవరం ప్రాజెక్టును తామే దుమ్ము దులిపి చేపట్టామని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదే పదే చెబుతున్నారు. కానీ.. ఈ ప్రకటనల్లో ఏమాత్రం వాస్తవం లేదు. రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టును సాకారం చేసేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నడుంబిగించారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన కేంద్ర ప్రణాళిక సంఘం, కేంద్ర జల సంఘం, అటవీ, పర్యావరణ తదితర అనుమతులన్నీ ఆయనే తెచ్చారు. పోలవరం కుడి కాలువను 145 కిమీల మేర తవ్వి.. పూర్తి స్థాయిలో లైనింగ్ పనులు పూర్తి చేయించారు. ఎడమ కాలువ 134 కిమీల మేర లైనింగ్‌తో సహా పూర్తి చేశారు. పోలవరం హెడ్ వర్క్స్ పనులను శరవేగంగా పూర్తి చేసే దశలో ఆయన హఠన్మరణం చెందారు. వైఎస్ అకాల మరణం పోలవరానికి శాపంగా మారింది. మహానేత వైఎస్ పోలవరం ప్రాజెక్టు పనులను చేపట్టినప్పుడు అప్పటి విపక్ష నేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. డ్యామ్ కట్టకుండా కాలువలు తవ్వడం ప్రపంచంలో వింతంటూ అపహాస్యం చేశారు. కానీ.. ఆ మహానేత తవ్విన పోలవరం కుడి కాలువ మీదుగానే పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను తరలిస్తూ.. అదీ తన ఘనతగా చంద్రబాబు చెప్పుకుంటోండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం చేపడితే జరిగే మేళ్లివీ.. ♦ పోలవరం జాతీయ ప్రాజెక్టు. తాజా ఎస్ఎస్ఆర్ ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.36 వేల కోట్లు. కేంద్రం చేపడితే ఆ ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని మొత్తం కేంద్రమే భరిస్తుంది. ♦ ప్రస్తుతం ఒడిశా రాష్ట్రం పోలవరాన్ని వ్యతిరేకిస్తోంది. కేంద్రం చేపడితే సరిహద్దు రాష్ట్రాలైన ఒడిశా, చత్తీస్‌గఢ్, తెలంగాణల్లో ప్రజాభిప్రాయ సేకరణ సభలు సులభంగా నిర్వహించి.. వివాదం లేకుండా చూస్తుంది. ♦ గోదావరి ట్రిబ్యునల్ తీర్పు మేరకు పోలవరం డిజైన్లు కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఆమోదం తప్పనిసరి. కేంద్రమే ఆ ప్రాజెక్టును నిర్మించడం వల్ల సీడబ్ల్యూసీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. దీని వల్ల ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ♦ సీడబ్ల్యూసీ, ఎన్‌హెచ్‌ఆర్‌ఐ(నేషనల్ హైడ్రాలజీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్), జీఎస్ఐ(జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) వంటి సంస్థల్లో పనిచేసే నిపుణుల పర్యవేక్షణ ఉండటం వల్ల ప్రాజెక్టు పనులు నాణ్యతతో చేస్తారు. ♦ కేంద్ర ప్రభ్వు బడ్జెట్ రూ.20 లక్షల కోట్లు. 2014లోనే కేంద్రానికి ప్రాజెక్టును అప్పగించి ఉంటే ఇప్పటికే ప్రాజెక్టు ఓ కొలిక్కి వచ్చేది. మార్చి, 2018 నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం వల్ల జరిగే నష్టాలివీ.. ♦ 2010-11 ఎస్ఎస్ఆర్ ప్రకారం రూపొందించిన పోలవరం అంచనా వ్యయంలో కేవలం హెడ్ వర్క్స్, కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు(ఇరిగేషన్ కాంపొనెంట్)కు మాత్రమే కేంద్రం నిధులు ఇస్తుంది. భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ అమలుకు అవసరమైన నిధులతోపాటూ ప్రాజెక్టు నిర్మాణ పనుల పెరిగిన అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. ♦ పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఒడిశా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో కేసు వేసింది. దీని వల్లే ప్రాజెక్టు పనులపై కేంద్రం పర్యావరణ నిషేధం విధించి.. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు సడలిస్తూ వస్తోంది. ఒకవేళ కేంద్రమే ఈ ప్రాజెక్టును చేపట్టి ఉంటే.. ఈ వివాదం పరిష్కారమయ్యేది. ♦ పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌కు సంబంధించి వర్కింగ్ డిజైన్లు మినహా.. ఎలాంటి డిజైన్లను సీడబ్ల్యూసీకి పంపలేదు. ఇటీవల కేంద్ర బృందం ఇదే అంశాన్ని లేవనెత్తింది. ♦ భూకంప ప్రభావిత ప్రాంతం(సెస్మిక్ జోన్)లో నిర్మిస్తుండటం వల్ల నిపుణులు అవసరం. కానీ.. రాష్ట్ర ప్రభుత్వానికి నిపుణులు అందుబాటులో లేరు. ఇటీవల జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు కోసం నర్మద కార్పొరేషన్లో పనిచేసిన డీపీ భార్గవను కన్సల్టెంట్‌గా నియమించింది. ♦ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రస్తుతం జరుగుతున్న రీతిలోనే పనులు సాగితే 2018 నాటికి పూర్తవడం అసాధ్యం. ప్రాజెక్టు పూర్తవడానికి కనీసం 20 నుంచి 30 ఏళ్లు పట్టే అవకాశం ఉంది.