‘ముంపు గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం’ | District Collector's Review on Construction of Pollavaram Project Caffer Dam | Sakshi
Sakshi News home page

పోలవరం కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంపై కలెక్టర్‌ సమీక్ష

Published Fri, Jun 14 2019 5:17 PM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM

District Collector's Review on Construction of Pollavaram Project Caffer Dam - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి : పోలవరం ప్రాజెక్ట్ కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తి కావడంతో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లోని నదీ ప్రవాహంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్ ఎగువున మునుపటి కన్నా 15 అడుగుల ఎత్తులో గోదావరి నదీ ప్రవాహం ఉండటంతో.. 15 లక్షల క్యూసెక్కుల నీరు కాఫర్ డ్యామ్ ద్వారా దిగువకు వెళ్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ ఎగువన ఉన్న 33 నిర్వాసిత ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఏజెన్సీ ప్రాంతాలను, ముంపు మండలాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాల​​​​కు తరలించాలని అధికారులను ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement