దేవనకొండ: వేదావతి నది పొంగిపొర్లుతుండటంతో ఆంధ్రపద్రేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని గుండ్లకొండ సమీపంలోని వేదావతి నంది ఉప్పొంగుతోంది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో రెండు వైపుల వాహనాలు భారీగా స్తంభించిపోయాయి.