vedavathi
-
వేదన తీర్చిన వేదావతి
రాయదుర్గం(అనంతపురం): జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టుల్లో ఒకటైన బైరవానితిప్ప (బీటీపీ) ప్రాజెక్టుకు చరిత్రలో ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయిలో వరదనీరు కొనసాగుతోంది. ఈ క్రమంలో వేదావతి ఉగ్రరూపం దాల్చింది. గుమ్మఘట్ట మండలంలోని బైరవానితిప్ప గ్రామం వద్ద 1954లో వేదావతి నదిపై రూ.1.5 కోట్లతో 2.5 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టి 1961లో పూర్తిచేశారు. 1981–82 మధ్య కాలంలో 8 గేట్లు తెరిచి 12 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసిన రికార్డు మాత్రమే ఇప్పటిదాకా ఉంది. రికార్డు బద్దలు.. క్యాచ్మెంట్ ఏరియా కర్ణాటకలో ఉండడం, అక్కడ విస్తారంగా వానలు కురవడం వెరసి ఈ ఏడాది జూలై చివర్లోనే రిజర్వాయర్ వరద నీటితో తొణకిసలాడింది. క్రమేణ నీటి ప్రవాహం పెరగడంతో పాటు వేదావతి నదిపై నిర్మించిన వాణివిలాస్ ప్రాజెక్ట్ కూడా 88 ఏళ్ల తర్వాత మరువ పారింది. వీటి మధ్య చిన్న కుంటలు, చెక్‌డ్యామ్‌లు, చెరువులు తెగి ఉగ్రరూపం దాల్చి ప్రమాదకరంగా దిగువకు నది పరవళ్లు తొక్కింది. ఈ కారణంగా ఆగస్టు 5న నీటి విడుదలకు శ్రీకారం చుట్టారు. 45 రోజుల పాటు ఏకంగా 28 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేయడం ఓ రికార్డయితే సెప్టెంబర్ 7న 10 గేట్లు తెరిచి 65 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయడం విశేషం. వర్షాలు తగ్గుముఖం పట్టినా 4,500 క్యూసెక్కుల ఇన్‌ప్లో కొనసాగుతుండగా 2 క్రస్టు గేట్లు తెరిచి 4,500 క్యూసెక్కుల మేర నీటిని వదులుతున్నారు. స్తంభించిన జనజీవనం.. రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు తదితర ప్రాంతాలను అనుసంధానం చేస్తూ వేదావతి హగరి ప్రవహిస్తోంది. ఈ కారణంగా గత 45 రోజుల నుంచి హగరి పరివాహ గ్రామాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. గుమ్మఘట్ట, బ్రహ్మసముద్రం మండలాలను కలిపే వేపులపర్తి కాజ్వే దెబ్బతినడంతో పాటు నీటి ఉధృతి తగ్గలేదు. దీంతో రాకపోకలు ఆగిపోయాయి. ఈ క్రమంలో కళ్లెదుటే కనిపించే గ్రామాలకు సైతం 20 కిలోమీటర్లు చుట్టుకుని వెళ్లే పరిస్థితి ఏర్పడింది. -
‘వేదావతి’లో బయల్పడిన పురాతన శివలింగం
గుమ్మఘట్ట (రాయదుర్గం) : బ్రహ్మసముద్రం, గుమ్మఘట్ట మండలాల పరిధిలోని రంగచేడు, బుడిమేపల్లి గ్రామాల మ«ధ్య వేదావతి హగరి నదీలో ఇసుక తవ్వుతుండగా శుక్రవారం పురాతన శివలింగం బయటపడింది. విషయం తెలుసుకున్న కలుగోడు, రంగచేడు, బుడిమేపల్లి, గుడిపల్లి, అజ్జయ్యదొడ్డి తదితర గ్రామాలవారు తరలివచ్చి శివలింగానికి పూజలు చేశారు. సుమారు 20 నుంచి 25 అడుగుల లోతు తవ్వగానే శివలింగం కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. శివలింగం చుట్టూ రాతికట్టడం, అందుకు దిగువన మెట్లు ఉన్నాయి. ఇక్కడ రాగి కడవలు, చెంబులు ఇతర వస్తువులు కూడా బయల్పడినట్లు వదంతులు వ్యాపించాయి. -
ఉప్పొంగుతున్న వేదావతి.. రాకపోకలు బంద్
దేవనకొండ: వేదావతి నది పొంగిపొర్లుతుండటంతో ఆంధ్రపద్రేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని గుండ్లకొండ సమీపంలోని వేదావతి నంది ఉప్పొంగుతోంది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో రెండు వైపుల వాహనాలు భారీగా స్తంభించిపోయాయి. -
ఏడాది తర్వాత సొంత గూటికి..
కోలారు (కర్ణాటక): ఏడాది క్రితం మతిస్థిమితం కోల్పోయిన ఓ మహిళ దేశంలోని పలు రాష్ట్రాలను చుట్టి సినిమా ఫక్కీలో సొంత ఇంటికి చేరింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా పెమ్మశెట్టిహళ్లి గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. వివరాలు.. పెమ్మశెట్టి గ్రామానికి చెందిన సురేష్ భార్య వేదవతి మానసిక రుగ్మతతో బాధపడుతుండగా భర్త సురేష్, సోదరుడు ముళబాగిలోని ఓ దర్గాలో చికిత్స చేయించడానికి తీసుకు వెళ్లారు. అదే రోజు రాత్రి వేదవతి తప్పించుకుపోయింది. నాటి నుంచి భర్త సురేష్ , సోదరుడు వేదవతి కోసం వెదకడం ప్రారంభించారు. మతిస్థిమితం కోల్పోయిన ఆమె పలు రాష్ట్రాల్లో తిరిగి ఎలాగో సమీపంలోని సిర్సా వెళ్లే మార్గాన ఉన్న ఓ మోరి వద్ద ఏడుస్తూ కూర్చుంది. ఆ సమయంలో ఆమె ధీన పరిస్థితిని గమనించిన సిర్సాలోని బాయికణ్ణయ్య ఆశ్రమ నిర్వాహకుడు గురు దేవేందర్ అశ్రయమిచ్చాడు. దాదాపు నాలుగు నెలలు చికిత్స చేయించి మామూలు మనిషిని చేశారు. కోలుకున్న వేదవతి తన చిరునామాను వారికి తెలియజేసింది. సిర్సా జిల్లా ఎస్పీ అశ్విన్ శన్వి కన్నడిగుడే కావడంతో కోలారు రూరల్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. దాంతో రూరల్ పోలీసులు వేదవతి సోదరుడికి ఫోన్‌చేసి సిర్సాలోని ఆశ్రమంలో ఉన్నట్లు సమాచారం అందించారు. పోలీసుల సహకారంతో వెంటనే హర్యానాలోని సిర్సా జిల్లాకు చేరుకున్న వేదవతి సోదరుడు అక్కడి ఎస్పీ సహకారంతో తన వెంట తీసుకువచ్చారు.