‘మంజీర’ మురిసింది
బోధన్ రూరల్ : రెండుమూడేళ్లుగా వర్షాలు లేక బోసిపోయిన మంజీర నది గురువారం ఉదయం బోధన్ మండలంలోని సాలూర గ్రామ శివార్లో నీటి ప్రవాహంతో కళకళలాడింది. ఉదయం నుంచి నదిలో నీటి ప్రవాహం పెరుగుతూ వస్తోందని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటి వరకు నీటి ప్రవాహం లేకపోవడంతో మంజీర నది ఇసుక, బండరాళ్లతో దర్శనమిచ్చిందని, నాలుగు రోజులుగా స్థానికంగా, ఎగువన కర్ణాటకలో కురుస్తున్న వర్షంతో నదిలో నీరు చేరిందని గ్రామస్తులు పేర్కొన్నారు. నీటి ప్రవాహాన్ని చూసేందుకు నదిపైన గల పాత,కొత్త వంతెనలపై జనాల సందడి నెలకొంది.