సాక్షి,కర్నూలు: ఎగువ పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. 49,895 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తున్నట్టు అధికారులు తెలిపారు. జురాల ప్రాజెక్టు నుంచి 48,795 క్యూసెక్కులు, హంద్రీనీవా నుంచి 1100 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 815.50 అడుగులుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 37.6570 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. అదేవిధంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల జలాశయానికి 60వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 318.440 మీటర్లకు చేరింది. జూరాల నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ9.500 టీఎంసీలుగా ఉంది. దీంతో జూరాల జలాశయం నుంచి 55 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
చదవండి: శ్రీశైలం చేరిన కృష్ణమ్మ!
Comments
Please login to add a commentAdd a comment