పెరిగిన వేతనాలను వెంటనే చెల్లించాలి
నల్లగొండ టౌన్: ఆదర్శపాఠశాలల్లో పనిచేస్తున్న పొరుగుసేవల సిబ్బందికి పెంచిన వేతనాలను వెంటనే చెల్లించాలని ఆదర్శ పాఠశాలల పొరుగుసేవల సిబ్బంది సంఘం అధ్యక్షుడు ఎ.రాములు డిమాండ్ చేశారు. సోమవారం స్థానికంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విడుదల చేసిన జీఓ 19 ప్రకారం వేతనాలను ప్రతి నెల చెల్లించాలన్నారు. ఆదర్శ పాఠశాలలో ఆట స్థలం, పరికరాలు లేకపోవడం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి అనురాధ, కోశాధికారి రవీందర్‌రెడ్డి, ఉపాధ్యక్షురాలు కె.రమాదేవి, నగేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.