‘మిషన్’తో పెరిగిన భూగర్భ జలాలు
Published Tue, Aug 30 2016 12:20 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
రఘునాథపల్లి : మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చేపట్టిన చెరువుల పూడికతీత ద్వారా భూగర్భ జలాలు కొంత మేర పెరిగాయని భూగర్భ జలవనరుల శాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ కె.ధనుంజయ అన్నారు. భూగ ర్భ జలాలపై అధ్యయనం చేసేందుకు రఘునాథపల్లి, నర్మెట మండలాలను శాఖ అధికారులు ఐదేళ్ల పాటు బేసిన్‌గా ఎంపిక చేశారు.
ఈ మేరకు రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ ధనుంజయ్, డిప్యూటీ డైరెక్టర్ కె.కుమారస్వామి సో మవారం మేకలగట్టు, కన్నాయపల్లి చెరువుల కింది భా గం, పైభాగాన భూగర్భ జలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ధనుంజయ్ మాట్లాడుతూ కన్నాయపల్లి చెరువు వర్షపు నీటితో నిండి ఉండగా గత ఏడాది కన్నా 4 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయన్నారు. మేకలగట్టు చెరువులో నీరు లేకపోవడంతో మూడు మీటర్లు మాత్రమే పెరిగాయన్నారు. జూన్, జూలై నెలలో సాధారణ వర్షపాతం కన్నా 33 శాతం అధికంగా వర్షాలు కురవగా, ఆగస్టు నెలలో మాత్రం 66 శాతం తక్కువగా నమోదైందని చెప్పారు. ఇక మిషన్ కాకతీయ పనులు జరిగిన ప్రదేశంలో గత ఏడాది కన్నా భూగర్భ జలాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. ఆయన వెంట డిప్యూటీ డైరెక్టర్ ఆనంద్‌కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ శైలజశ్రీ, శ్యాం ప్రసాద్, చేరాలు, బిక్షపతి ఉన్నారు.
Advertisement
Advertisement