హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అన్ని వాహన విభాగాల్లో కలిపి 2023 మే నెలలో 20,19,414 యూనిట్లు రోడ్డెక్కాయి. 2022 మే నెలతో పోలిస్తే ఇది 10 శాతం అధికం. ప్యాసింజర్ వాహనాలు, టూ వీలర్లు, ట్రాక్టర్లకు విపరీత డిమాండ్ ఉండడం ఈ స్థాయి వృద్ధికి కారణమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్‌ఏడీఏ) తెలిపింది.
‘గత నెలలో ద్విచక్ర వాహన విక్రయాలు 9 శాతం పెరిగి 14,93,234 యూనిట్లకు చేరుకున్నాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలు 7 శాతం అధికమై 77,135 యూనిట్లుగా ఉన్నాయి. త్రిచక్ర వాహనాలు 79 శాతం ఎగసి 79,433 యూనిట్లు, ట్రాక్టర్లు 10 శాతం దూసుకెళ్లి 70,739 యూనిట్లను తాకాయి’ అని ఫెడరేషన్ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment