చవక ధరలకే విమానయానాన్ని అందించే ఉద్దేశంతో భారతదేశంలో అడుగుపెట్టిన ఎయిర్ ఏషియా ఇండియా విమానాలు గురువారం నుంచి గగన వీధుల్లో ఎగరబోతున్నాయి. బెంగళూరు నుంచి గోవాలోని పనజికి మొదటి విమానం బయల్దేరుతుంది. మే 7వ తేదీన డీజీసీఏ అనుమతి రావడంతో.. దాదాపు నెల రోజుల తర్వాత ఈ సంస్థ విమానాలు వినువీధిలోకి ప్రవేశిస్తున్నాయి. తమ మొదటి ఎయిర్బస్ ఎ-320 విమానంలో మొత్తం 180 సీట్లు బుకింగ్ ప్రారంభించిన పది నిమిషాల్లోనే అమ్ముడుపోయాయని ఎయిరేషియా అధికార ప్రతినిధి తెలిపారు.
బెంగళూరు -గోవా మార్గంలో ప్రారంభ ఆఫర్గా మొత్తం ఛార్జీని 990 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే చెన్నై-బెంగళూరు, బెంగళూరు-చెన్నై మార్గాల్లో అయితే మరింత తక్కువగా ఛార్జీలున్నాయి. మిగిలిన రోజుల్లో ఈ ఆఫర్ లేనప్పుడు కూడా తమ ఛార్జీలు మార్కెట్ రేటుతో పోలిస్తే 35 శాతం తక్కువగానే ఉంటాయని ఎయిరేషియా ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మిట్టు శాండిల్య తెలిపారు.
రేపట్నుంచే ఎయిర్ ఏషియా విమానాలు
Published Wed, Jun 11 2014 8:48 PM | Last Updated on Sat, Sep 2 2017 8:38 AM
Advertisement