కబాలి విమాన ప్రయాణికులకు నిరాశ | kabali flight passengers disappointed | Sakshi
Sakshi News home page

కబాలి విమాన ప్రయాణికులకు నిరాశ

Jul 22 2016 2:26 PM | Updated on Apr 7 2019 3:24 PM

కబాలి విమాన ప్రయాణికులకు నిరాశ - Sakshi

కబాలి విమాన ప్రయాణికులకు నిరాశ

కబాలి ప్రత్యేక విమానంలో వెళ్లి మొదటి రోజే సినిమా చూడాలనుకున్న అభిమానులకు కొంత నిరాశ తప్పలేదు.

కబాలి ఫీవర్ను సొమ్ము చేసుకోడానికి కార్పొరేట్ కంపెనీలు చాలా ప్రయత్నాలే చేశాయి. ఎయిర్ ఏషియా అయితే తమ విమానం ఒకదాన్ని మొత్తం కబాలి పోస్టర్తో నింపేసింది. రజనీ స్టైల్‌లో స్పెషల్ ‘కబాలి’ లుక్ తో ముస్తాబైన ఈ విమానం బెంగళూరు, న్యూఢిల్లీ, గోవా, పుణె, చండీగఢ్, జైపూర్, గువాహటి, ఇంఫాల్, వైజాగ్, కొచ్చి మీదుగా ప్రయాణించనుందని ప్రకటించారు. అందులో టికెట్లు బుక్ చేసుకున్న వారికి రకరకాల సదుపాయాలతో పాటు చెన్నైలో కబాలి సినిమాను చూపిస్తామని చెప్పారు.

అయితే.. మొదటి రోజే ఆ విమానంలో వెళ్లి సినిమా చూడాలనుకున్న అభిమానులకు కొంత నిరాశ తప్పలేదు. ఎయిర్ ఏషియా కంపెనీ సినిమా చూపించే ప్రదేశంతో పాటు సమయాన్ని కూడా రీషెడ్యూల్ చేసింది. అయితే ప్రయాణికులు మాత్రం ఎక్కడో వేరేచోట కాకుండా చెన్నైలోనే అభిమానుల మధ్య కూర్చుని థియేటర్లో సినిమా చూడాలని పట్టుబట్టారు. కానీ.. ప్రస్తుతానికి అది సాధ్యం కాదని, సినిమా ప్రదర్శన ప్రాంతం, సమయం మారిన విషయాన్ని ప్రయాణికులకు తెలియజేయడంలో తాము చిన్న పొరపాటు చేశామని కంపెనీ అంగీకరించింది. దానికి గాను అభిమానులకు నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement