రూ. 1390కే ఎయిర్ ఏషియా విమాన టికెట్ | air asia india offers all inclusive rs 1390 a ticket | Sakshi
Sakshi News home page

రూ. 1390కే ఎయిర్ ఏషియా విమాన టికెట్

Published Wed, Dec 24 2014 4:47 PM | Last Updated on Sat, Sep 2 2017 6:41 PM

రూ. 1390కే ఎయిర్ ఏషియా విమాన టికెట్

రూ. 1390కే ఎయిర్ ఏషియా విమాన టికెట్

సంక్రాంతికి ఊరెళ్దామనుకుంటున్నారా? బస్సు చార్జీలు మండిపోతున్నాయి కదూ.. అయితే ఇంకెందుకు ఆలస్యం.. ఎంచక్కా విమానం టికెట్ బుక్ చేసేసుకోండి. ఎందుకంటే, ఇప్పుడు విమానాల టికెట్లు కూడా దాదాపుగా బస్ టికెట్ల రేట్లకు వచ్చేస్తున్నాయి. అవును ఇది అతిశయోక్తి కాదు. ఏసీ బస్సు చార్జీ పెట్టుకుంటే విమానం టికెట్లు వచ్చేస్తున్నాయి. బడ్జెట్ విమానయానం అందించే సంస్థ ఎయిర్ ఏషియా ఇండియా మరోసారి తన ఆఫర్లను ప్రకటించింది. అన్ని పన్నులూ కలుపుకొని రూ. 1390కే అందిస్తోంది. హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లేందుకు ఈ ఆఫర్ ఉంది. ఇతర రూట్లలో మాత్రం ధరలు కొంత వేరేగా ఉన్నాయి.

జనవరి 4వ తేదీ వరకు ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. జనవరి 5వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు చేసే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. వాడియా గ్రూపునకు చెందిన గో ఎయిర్ సంస్థ రూ. 1469కే టికెట్లు ఇస్తుండటంతో దానికి పోటీగా ఎయిర్ ఏషియా ఇండియా ఈ ఆఫర్ ప్రకటించింది. గో ఎయిర్ సంస్థ జనవరి 1 నుంచి మార్చి 31 వరకు చేసే ప్రయాణాలకు ఆఫర్ ప్రకటించింది. అయితే, టికెట్లను మాత్రం డిసెంబర్ 25 వరకే బుక్ చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement