విమాన చార్జీ.. కిలోమీటరుకు రూపాయే!! | air asia india introduces rs. 1 a kilometre offer in limited routes | Sakshi
Sakshi News home page

విమాన చార్జీ.. కిలోమీటరుకు రూపాయే!!

Published Tue, Apr 21 2015 3:30 PM | Last Updated on Wed, Oct 17 2018 3:46 PM

విమాన చార్జీ.. కిలోమీటరుకు రూపాయే!! - Sakshi

విమాన చార్జీ.. కిలోమీటరుకు రూపాయే!!

అత్యంత చవక విమానయానానికి శ్రీకారం చుట్టిన ఎయిర్ ఏషియా ఇండియా సంస్థ ఇప్పుడు సరికొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది. ఆటోల కంటే కారు చవగ్గా.. కిలోమీటరుకు కేవలం ఒక్క రూపాయి చార్జీతోనే విమానం ఎక్కొచ్చని చెబుతోంది. తమ నెట్వర్క్లోకి ఢిల్లీని కూడా కొత్తగా చేర్చిన ఎయిర్ ఏషియా.. ఇందుకోసమే ప్రత్యేకంగా పరిమిత కాలానికి ఈ ఆఫర్ పెట్టింది. ప్రస్తుతం ఢిల్లీకి బెంగళూరు, గువాహటి, గోవాలతో కనెక్టివిటీ వచ్చింది.

మే 21 నుంచి ఈ మార్గాల్లో విమానాలు తిరుగుతాయి. ఢిల్లీ-గువాహటి మధ్య అన్ని పన్నులూ కలుపుకొని రూ. 1500, ఢిల్లీ-గోవా, ఢిల్లీ-బెంగళూరు మార్గాలకు రూ. 1700గా టికెట్ ధరలు నిర్ణయించారు. ఇక కిలోమీటరుకు ఒక్క రూపాయి చార్జీ ఆఫర్తో టికెట్లను ఈనెల 26 వరకు బుక్ చేసుకోవచ్చు. మే 21 నుంచి మే 31వ తేదీ వరకు చేసే ప్రయాణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement