బెంగళూరు - విశాఖ విమాన టికెట్ రూ. 999! | air asia india comes with another cheap offer, fares starts from 799 only | Sakshi
Sakshi News home page

బెంగళూరు - విశాఖ విమాన టికెట్ రూ. 999!

Published Mon, Jun 22 2015 3:40 PM | Last Updated on Sun, Sep 3 2017 4:11 AM

బెంగళూరు - విశాఖ విమాన టికెట్ రూ. 999!

బెంగళూరు - విశాఖ విమాన టికెట్ రూ. 999!

చవక ధరలకే విమానయానాన్ని అందించే ఎయిర్ ఏషియా ఇండియా మరో సంచలన ఆఫర్తో ముందుకొచ్చింది. బెంగళూరు- విశాఖపట్నం మధ్య ప్రయాణాన్ని కేవలం 999 రూపాయలకే అందిస్తోంది. ఇంకా మాట్లాడితే.. బెంగళూరు - కొచ్చి మధ్య ప్రయాణాన్ని అన్ని పన్నులతో కలుపుకొని కేవలం 799 రూపాయలకే ఇచ్చేస్తోంది. అయితే, ఇది పరిమిత కాల ఆఫర్ మాత్రమే. ఈనెల 28వ తేదీలోగా టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంది. 2016 ఫిబ్రవరి 15 నుంచి 2016 ఆగస్టు 31వ తేదీ వరకు చేసే ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది.

బెంగళూరు-పుణె, బెంగళూరు-గోవా, బెంగళూరు-విశాఖ ఈ మూడు మార్గాల్లోనూ టికెట్ ధరను 999 రూపాయాలుగానే ఎయిర్ ఏషియా ఇండియా నిర్ణయించింది. ఇక ఇదే ఆఫర్లో బెంగళూరు-జైపూర్ మార్గంలో రూ. 1599కి, బెంగళూరు-చండీగఢ్ మార్గంలోరూ. 1799, బెంగళూరు-న్యూఢిల్లీ మార్గంలో రూ. 1999కి టికెట్లు ఇస్తోంది. ఇటీవలి కాలంలో చాలా వరకు విమానయాన సంస్థలు ఇలాంటి చౌక ఆఫర్లను ప్రవేశపెట్టాయి. స్వదేశీ ప్రయాణాల విభాగంలో ఇటీవల ఎయిర్ ఇండియా రూ. 1777కే టికెట్ ఇస్తామంటూ ఓ ప్రకటనతో ముందుకొచ్చింది.  జెట్ ఎయిర్వేస్, స్పైస్ జెట్, గో ఎయిర్, ఇండిగో లాంటి సంస్థలు కూడా ఆఫర్లను ప్రకటించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement