2599కే విదేశీ విమానయానం!! | fly foreign country with 2599 only | Sakshi
Sakshi News home page

2599కే విదేశీ విమానయానం!!

Published Tue, Sep 2 2014 11:23 AM | Last Updated on Thu, Oct 4 2018 6:57 PM

2599కే విదేశీ విమానయానం!! - Sakshi

2599కే విదేశీ విమానయానం!!

ఇన్నాళ్లూ విమానయాన సంస్థలు రకరకాల ఆఫర్లతో ప్రయాణికులను హోరెత్తించాయి. అయితే అవన్నీ కూడా కేవలం మన దేశంలో ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లడానికే. తొలిసారిగా విదేశీ యానానికి కూడా ఆఫర్లు ప్రవేశపెట్టి అత్యంత చవకగా విదేశీ యానాన్ని అందిస్తోంది ఎయిర్ ఏషియా ఇండియా. 'ఫెస్టివ్ హాలిడే సేల్' పేరిట కేవలం 2599 రూపాయల నుంచే విదేశీ యానానికి విమాన టికెట్లు అందించడం మొదలుపెట్టింది. ఈ డిస్కౌంట్ టికెట్ల అమ్మకాలు ఈనెల ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు కొనసాగుతాయి. సెప్టెంబర్ రెండో తేదీ నుంచి జనవరి 31 తేదీల మధ్య విదేశీ ప్రయాణాలు ఈ టికెట్లతో చేయొచ్చు.

ధరలు ఇలా...
కొచ్చిన్ నుంచి కౌలాలంపూర్ వెళ్లడానికి పన్నులన్నింటితో కలిపి కేవలం 2599 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అదే చెన్నై నుంచి కౌలాలంపూర్ వెళ్లాలంటే 5699 చెల్లించాలి. బెంగళూరు నుంచి వెళ్లాలంటే మాత్రం గరిష్ఠంగా 6699 ధర పెట్టారు. కోల్కతా నుంచి కౌలాలంపూర్ వెళ్లడానికి 6299గా టికెట్ ధర నిర్ణయించారు.

మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియా బెర్హాద్, టాటా గ్రూప్, ఢిల్లీకి చెందిన పెట్టుబడి సంస్థ టెలెస్ట్రా ట్రేడ్ప్లేస్ సంస్థలు మూడు కలిసి ఎయిర్ ఏషియా ఇండియాను ప్రారంభించాయి. జూన్ 12వ తేదీన ఈ సంస్థకు చెందిన తొలి విమానం బెంగళూరు నుంచి గోవాకు వెళ్లింది. అప్పటినుంచి వివిధ సీజన్లలో చకవ విమానయాన టికెట్లు అందిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement