న్యూఢిల్లీ: ఎయిర్ ఏషియా బిగ్‌సేల్ ఆఫర్‌లో భాగంగా సంస్థ అనుబంధ సంస్థలు, ఎయిర్‌ఏషియా బెర్హాద్, థాయ్ ఎయిర్‌ఏషియా, ఎయిర్‌ఏషియా ఇండియాలు డిస్కౌంట్లను ప్రకటించాయి. ఎయిర్‌ఏషియా బెర్హాద్ నిర్వహించే హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ సర్వీసుకు రూ.2,599కే విమాన టికెట్లను పొందవచ్చని ఎయిర్ ఏషియా ఇండియా సీఈఓ మిట్టు చాండిల్య చెప్పారు.
అలాగే చెన్నై, కోచి, కోల్‌కత, బెంగళూరు, తిరుచిరాపల్లి, తదితర నగరాల నుంచి కౌలాలంపూర్ సర్వీసులకు కూడా ఇదే ధరకు విమాన టికెట్లను ఆఫర్ చేస్తున్నామ న్నారు. బుకింగ్స్ ఆదివారం రాత్రి నుంచే ప్రారంభమయ్యాయయని, ఈ నెల 16 వరకూ తమ వెబ్‌సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చని చెప్పారు.
ఎయిర్ ఏషియా డిస్కౌంట్ ఆఫర్లు...
Published Sun, Nov 9 2014 11:52 PM | Last Updated on Sat, Sep 2 2017 4:09 PM
Advertisement
Advertisement