
బ్యాంకాక్, కౌలాలంపూర్‌లకు టికెట్ ధరల తగ్గింపు
రూ.5వేల లోపు ఒక్కో టికెట్
ఈ నెల 23లోపు టికెట్ బుక్ చేసుకోవాలి
జూలై 1 నుంచి వచ్చే ఏడాది జూన్ 15లోపు ప్రయాణించవచ్చు
ఎయిర్ ఏసియా ప్రత్యేక ఆఫర్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నుంచి విదేశాలకు చౌకగా విమానాల్లో ప్రయాణించేలా ఎయిర్ ఏసియా విమానయాన సంస్థ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. జీరో బేస్ ఫేర్ పేరుతో విశాఖపట్నం నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్‌లకు ప్రయాణం చేయవచ్చని వెల్లడించింది. ఈ ఏడాది జూలై 1 నుంచి 2026 జూన్ 15 వరకూ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.
అయితే, ఇందుకోసం ఈ నెల 23వ తేదీలోపు టికెట్ బుక్ చేసుకోవాలని ఎయిర్ ఏసియా సూచించింది. సాధారణంగా వైజాగ్ నుంచి బ్యాంకాక్ లేదా కౌలాలంపూర్‌కు రూ.7,500 నుంచి రూ.12 వేల వరకు టికెట్ ధర ఉంటుంది.
ఈ ఆఫర్ ద్వారా రూ.4,400 నుంచి రూ.5వేల లోపే టికెట్ ధర ఉంటుందని ఎయిర్ ఏసియా తెలిపింది. అన్ని వర్గాల ప్రయాణికులకు విమానయాన అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ ఆఫర్ ప్రకటించినట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment