international flight tickets
-
IndiGo Special offer: రూ.2వేలకే విమాన టికెట్!!
గురుగ్రామ్: ఇండిగో ఎయిర్‌లైన్స్.. మూడురోజుల వింటర్ సేల్ పేరుతో ప్రత్యేక ఆఫర్‌ను ప్రయాణికులకు అందించబోతోంది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తగ్గింపు ధరకు టికెట్లు అందించనున్నట్లు ప్రకటించింది. దేశీయ ప్రయాణానికి రూ.2,023, అంతర్జాతీయ ప్రయాణాలకు రూ.4,999 నుంచి ప్రారంభ టికెట్ల ధరగా నిర్ణయించింది. 2023 జనవరి 15 నుంచి ఏప్రిల్ 14 మధ్య ప్రయాణానికి సంబంధించిన టికెట్లకు, అదీ టికెట్లు అందుబాటులో ఉన్నంతవరకు మాత్రమే ఈ వింటర్ సేల్ ఆఫర్ వర్తిస్తుందని ఇండిగో స్పష్టం చేసింది. టికెట్లు నాన్ స్టాప్ విమానాల మీదే మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని తెలిపింది. ఏ ఆఫర్లు, ప్రమోషన్స్, స్కీమ్స్.. వీటికి వర్తించవు. భారతీయులు హెచ్ఎస్బీసీ కస్టమర్లైతే.. అదనంగా క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఇండిగోకు మొత్తం 290 విమానాలు ఉండగా.. రోజుకు 1600 విమాన సర్వీసులను నడుపుతుండగా.. ఇందులో 76 దేశీయ, 26 అంతర్జాతీయ గమ్యస్థానాలు ఉన్నాయి. విమానయాన రంగం మునుపటి కంటే పుంజుకుందని, దీన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా ఈ ఆఫర్‌ను తీసుకొచ్చినట్లు ఇండిగో గ్లోబల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా తెలిపారు. -
రూ. 2,999తో విదేశీ ప్రయాణం!
► రూ. 999కే స్వదేశీ విమాన టికెట్ ► ఎయిర్ ఏషియా ప్రత్యేక ఆఫర్ ► ఇప్పటికే ప్రారంభమైన బుకింగ్ బెంగళూరు చౌక ధరలకే విమాన టికెట్లను అందించే ఎయిర్ ఏషియా సంస్థ మరోసారి అత్యంత చవకైన ఆఫర్ ప్రకటించింది. భారతదేశంలో ఉన్న నగరాలకైతే పన్నులన్నింటితో కలుపుకొని రూ. 999కి, విదేశాలకు అయితే రూ. 2,999కే టికెట్లు ఇస్తామని తెలిపింది. తాము 22 దేశాల్లోని 100 నగరాలకు విమానాలు నడిపిస్తున్నామని, తాము ఇప్పుడు అందిస్తున్న ఈ ప్రమోషనల్ ఆఫర్‌తో దేశ విదేశాలు చుట్టి రావాలనుకునేవారికి మంచి అవకాశం వచ్చినట్లు అవుతుందని ఎయిర్ ఏషియా కమర్షియల్ విభాగం అధిపతి స్పెన్సర్ లీ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఆఫర్ కింద బుకింగ్స్ సోమవారమే ప్రారంభమయ్యాయి. ఈనెల 24 వరకు టికెట్లు బుక్ చేసుకోవ్చు. అయితే ఈ సంవత్సరం అక్టోబర్ 1 నుంచి వచ్చే సంవత్సరం మే 22లోగా ప్రయాణాలు చేయడానికి మాత్రమే ఇప్పుడు టికెట్లు ఇస్తారు. మన దేశంలో విశాఖపట్నం, బెంగళూరు, ఢిల్లీ, కొచ్చిన్, చండీగఢ్, గోవా, గువాహటి, ఇంఫాల్, పుణె, జైపూర్ నగరాలకు రూ. 999 టికెట్‌తో వెళ్లొచ్చు. అలాగే కౌలాలంపూర్, బ్యాంకాక్, బాలి, మెల్బోర్న్, పెర్త్, మనిలా లాంటి 100 నగరాలకు రూ. 2,999 టికెట్‌తో వెళ్లొచ్చని ఎయిర్ ఏషియా ప్రకటించింది.