promotional offers
-
ప్రీ డేటా ఓకే, కానీ క్వాలిటీ....
న్యూఢిల్లీ: మార్కెట్లో టెల్కోలను హడలెత్తిస్తున్న రిలయన్స్ జియోను తట్టుకునేందుకు, దిగ్గజ కంపెనీలన్నీ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. జియో తాకిడిని తట్టుకునేందుకు, ఎయిర్ టెల్ ఇటీవలే తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం, పోస్టుపెయిడ్ కస్టమర్ల కోసం ఉచిత డేటా ప్రయోజనాలు ప్రకటించింది. పోస్ట్ పెయిడ్ కస్టమర్లకైతే ఏకంగా 30జీబీ వరకు ఉచిత డేటా అందించనున్నట్టు ప్రకటించింది. ఇలా ఇతర కంపెనీలు కూడా డేటా ప్రయోజనాలను తమ కస్టమర్ల కోసం తీసుకొచ్చాయి. ఉచిత డేటాలనైతే కంపెనీలు ప్రకటిస్తున్నప్పటికీ, ఎక్కడా కూడా ఏ కంపెనీ కూడా సర్వీసుల క్వాలిటీ గురించి ఊసైనా ఎత్తడం లేదు. ప్రమోసనల్ స్కీమ్స్ పై ఏ మేర క్వాలిటీ సర్వీసులు అందిస్తాయో కనీస గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఆపరేటర్లు అందించే స్కీమ్ లకు, వారు అందించే డెలివరీకి చాలా గ్యాప్ ఉంటుందని, వాటిని సమీక్షించడానికి కనీసం ఎలాంటి మెకానిజం లేదని వాలంటరీ ఆర్గనైజేషన్ ఇన్ ఇంటరెస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకుడు ఎస్ఆర్ ఖన్నా ఆందోళన వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ కూడా సీరియస్ గా తీసుకుంటోంది. ప్రమోషనల్ ఆఫర్లో కూడా ఒకే విధమైన క్వాలిటీ సర్వీసులు అందించే విషయంపై ఆపరేటర్లతో చర్చించడానికి ట్రాయ్ ఈ వారంలో వారితో సమావేశమవుతోంది. ప్రమోషనల్ ఆఫర్లలో క్వాలిటీ సర్వీసులు ఆందోళనను కలిగిస్తున్నాయని, ఉచితంగా సర్వీసులు అందించడమంటే నాసిరకంగా అందించడం కాదని ట్రాయ్ అధికారి అన్నారు. త్వరలోనే ఆపరేటర్లతో మీటింగ్ నిర్వహించి దీనిపై చర్చించనున్నామని చెప్పారు. అయితే ప్రమోషనల్ ఆఫర్లలో సర్వీసుల క్వాలిటీ నాసిరకంగా ఉన్నాయనే దాన్ని టెల్కోలు ఖండిస్తున్నాయి. -
రూ. 2,999తో విదేశీ ప్రయాణం!
► రూ. 999కే స్వదేశీ విమాన టికెట్ ► ఎయిర్ ఏషియా ప్రత్యేక ఆఫర్ ► ఇప్పటికే ప్రారంభమైన బుకింగ్ బెంగళూరు చౌక ధరలకే విమాన టికెట్లను అందించే ఎయిర్ ఏషియా సంస్థ మరోసారి అత్యంత చవకైన ఆఫర్ ప్రకటించింది. భారతదేశంలో ఉన్న నగరాలకైతే పన్నులన్నింటితో కలుపుకొని రూ. 999కి, విదేశాలకు అయితే రూ. 2,999కే టికెట్లు ఇస్తామని తెలిపింది. తాము 22 దేశాల్లోని 100 నగరాలకు విమానాలు నడిపిస్తున్నామని, తాము ఇప్పుడు అందిస్తున్న ఈ ప్రమోషనల్ ఆఫర్‌తో దేశ విదేశాలు చుట్టి రావాలనుకునేవారికి మంచి అవకాశం వచ్చినట్లు అవుతుందని ఎయిర్ ఏషియా కమర్షియల్ విభాగం అధిపతి స్పెన్సర్ లీ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఆఫర్ కింద బుకింగ్స్ సోమవారమే ప్రారంభమయ్యాయి. ఈనెల 24 వరకు టికెట్లు బుక్ చేసుకోవ్చు. అయితే ఈ సంవత్సరం అక్టోబర్ 1 నుంచి వచ్చే సంవత్సరం మే 22లోగా ప్రయాణాలు చేయడానికి మాత్రమే ఇప్పుడు టికెట్లు ఇస్తారు. మన దేశంలో విశాఖపట్నం, బెంగళూరు, ఢిల్లీ, కొచ్చిన్, చండీగఢ్, గోవా, గువాహటి, ఇంఫాల్, పుణె, జైపూర్ నగరాలకు రూ. 999 టికెట్‌తో వెళ్లొచ్చు. అలాగే కౌలాలంపూర్, బ్యాంకాక్, బాలి, మెల్బోర్న్, పెర్త్, మనిలా లాంటి 100 నగరాలకు రూ. 2,999 టికెట్‌తో వెళ్లొచ్చని ఎయిర్ ఏషియా ప్రకటించింది. -
మళ్లీ చవక ధరలకు విమానయానం
చవక ధరలకే విమానయానం ఇస్తామంటూ కొత్తగా సేవలు ప్రారంభించిన ఎయిర్ ఏషియా ఇండియా సంస్థ మరోసారి ప్రమోషనల్ ఆఫర్లను ప్రకటించింది. గతంలో 339 రూపాయలకే బెంగళూరు - చెన్నై నగరాల మధ్య విమాన యానాన్ని అందించిన ఈ సంస్థ ఇప్పుడు బెంగళూరు-కొచ్చి, బెంగళూరు-చెన్నై నగరాల మధ్య రూ. 1490 చొప్పున, బెంగళూరు-గోవా మధ్య రూ. 1690 చొప్పున ఛార్జీలు నిర్ణయించింది. ఈ టికెట్లను ఈనెల 29వ తేదీలోపు బుక్ చేసుకోవాలి. అంటే, బుకింగ్‌కు వారం రోజుల సమయం ఇచ్చారు. జూలై 1 నుంచి అక్టోబర్ 25వ తేదీ మధ్య ప్రయాణాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. బెంగళూరు-కొచ్చి, బెంగళూరు-గోవా మార్గాల్లో బుక్ చేసుకునే టికెట్ల మీద ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 25 వరకు ప్రయాణాలు చేయొచ్చు.