హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇండిగో ఎయిర్లైన్స్ ఛైర్మన్ రాహుల్ భాటియా గురువారం భేటీ అయ్యారు. ఏపీ నుంచి ఇండిగో సర్వీసుల పెంపుపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. కాగా దేశ ఏవియేషన్ రంగంలో ఏకైక లాభదాయక సంస్థగా ఉన్న ఇండిగో విశాఖను తన హబ్ గా చేసుకోవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
విమానాల్లో ఇంథనంగా ఉపయోగించే ఏవియేషన్ టర్భైన్ ఫ్యూయల్ (ఎటీఎఫ్) పై వ్యాట్ ను చంద్రబాబు ఒక శాతానికి తగ్గించటంతో ఇండిగో విశాఖపట్నం వైపు కన్నేసింది. దీని వల్ల కంపెనీకి ఆర్థికంగా ఎంతో ప్రయోజనం కలగనుంది. ఇదే కారణంతో కంపెనీ విశాఖపట్నం నుంచి అంతర్జాతీయ కేంద్రాలకు సర్వీసులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది.
చంద్రబాబుతో ఇండిగో ఎయిర్లైన్స్ ఛైర్మన్ భేటీ
Published Thu, Dec 25 2014 11:28 AM | Last Updated on Sat, Sep 2 2017 6:44 PM
Advertisement