ఉక్రెయిన్‌పై రష్యా నిరంతర దాడులను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ఇంధన మౌలిక సదుపాయాలపై దాడికి దిగింది. తూర్పు డొనెట్స్క్ ప్రావిన్స్‌లోని పలు పవర్ ప్లాంట్లను ధ్వంసం చేసింది. దీంతో ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
రష్యా తాజాగా ఉక్రెయిన్‌లోని పవర్ ప్లాంట్‌లను లక్ష్యంగా చేసుకుని డ్రోన్, క్షిపణి దాడులను చేపట్టంది. దీంతో ఉక్రెయిన్‌లోని మూడు ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో విద్యుత్తు నిలిచిపోయింది. ఈ దాడుల్లో 19 మందికిపైగా జనం మంది గాయపడ్డారు. ఉక్రెయిన్ ప్రభుత్వ విద్యుత్ గ్రిడ్ ఆపరేటర్ ఉక్రెనెర్గో మాట్లాడుతూ రష్యా చేపడుతున్న దాడులతో విద్యుత్ అంతరాయాలు ఏర్పడ్డాయని, ఇవి పారిశ్రామిక, గృహ వినియోగదారులను తీవ్రంగా ప్రభావితం చేశాయన్నారు. ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ పవర్ గ్రిడ్‌పై రష్యా చేస్తున్న దాడులు దేశవ్యాప్తంగా బ్లాక్‌అవుట్‌ను విధించేలా చేశాయన్నారు.
గత ఏప్రిల్‌లో కీవ్‌లోని భారీ థర్మల్ పవర్ ప్లాంట్‌పై రష్యా దాడి చేసింది. మే 8న మరో పవర్ ప్లాంట్‌పై దాడి జరిగింది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. మరోవైపు డొనెట్స్క్ ప్రాంతంలోని ఉమాన్స్కే గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు రష్యా ప్రకటించింది. రష్యా ఇప్పుడు ఉత్తర సుమీ, చెర్నిహివ్ ప్రాంతాలలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని ఉక్రెయిన్ అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సింగపూర్‌లో జరిగిన ఆసియా ప్రధాన భద్రతా శిఖరాగ్ర సమావేశంలో మాట్లాడుతూ ఉక్రెయిన్ యుద్ధంపై త్వరలో జరగబోయే శాంతి సమావేశానికి అడ్డుపడేందుకు రష్యాకు చైనా సహకారం అందిస్తున్నదని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment