మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన బగ్‌తో ప్రపంచం మొత్తం అల్లకల్లోలమైంది. చాలా దేశాల్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పనిచేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలు సహా సింగపూర్ ఎక్స్ఛేంజ్ (SGX) వంటి కొన్ని స్టాక్ ఎక్సేంజ్‌లపైనా దీని ప్రభావం పడింది.
దీనిపై సెబీ చైర్‌పర్సన్ మధబి పూరిబుచ్ స్పందించారు. గ్లోబల్ మైక్రోసాఫ్ట్ అంతరాయాన్ని మేల్కొలుపుగా ఆమె అభివర్ణించారు. సైబర్ సెక్యూరిటీని టూ డైమెన్షనల్‌గా చూడాలని మార్కెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు సూచించారు. మైక్రోసాఫ్ట్ విండోస్‌కు సెక్యూరిటీ సేవలు అందించే ‘క్రౌడ్‌స్ట్రయిక్’ సైబర్ సెక్యూరిటీ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment