wakeup
-
ఇది మేల్కొలుపు: మైక్రోసాఫ్ట్ అంతరాయంపై సెబీ చీఫ్
మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన బగ్‌తో ప్రపంచం మొత్తం అల్లకల్లోలమైంది. చాలా దేశాల్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పనిచేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలు సహా సింగపూర్ ఎక్స్ఛేంజ్ (SGX) వంటి కొన్ని స్టాక్ ఎక్సేంజ్‌లపైనా దీని ప్రభావం పడింది.దీనిపై సెబీ చైర్పర్సన్ మధబి పూరిబుచ్ స్పందించారు. గ్లోబల్ మైక్రోసాఫ్ట్ అంతరాయాన్ని మేల్కొలుపుగా ఆమె అభివర్ణించారు. సైబర్ సెక్యూరిటీని టూ డైమెన్షనల్‌గా చూడాలని మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు సూచించారు. మైక్రోసాఫ్ట్ విండోస్‌కు సెక్యూరిటీ సేవలు అందించే ‘క్రౌడ్‌స్ట్రయిక్’ సైబర్ సెక్యూరిటీ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ అప్డేట్లో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి. -
చనిపోయిన 12 గంటలకు తిరిగి బతికిన చిన్నారి!
వైద్యులను దేవునితో సమానమని అంటారు. అయితే వారు కూడా మనుషులే అయినందున ఒక్కోసారి పొరపాటు పడుతుండవచ్చు. మెక్సికోలోని శాన్ లూయిస్ పొటోసికి చెందిన వైద్యుని పొరపాటుకు సంబంధించిన ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూడేళ్ల బాలిక చనిపోయినట్లు ఒక వైద్యుడు నిర్ధారించాడు. దీంతో ఆ చిన్నారి కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇంతలో ఆ బాలిక మేల్కొంది. మెక్సికోకు చెందిన కైమెలియా రోక్సానా కడుపు నొప్పితో బాధపడుతోంది. కుటుంబసభ్యులు బాలికను చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స అనంతరం ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యుడు నిర్థారించాడు. ఇది జరిగిన 12 గంటల తర్వాత ఒక అద్భుతం జరిగింది. ఆ బాలిక సజీవంగానే ఉందని తెలిసింది. కైమెలియా అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు, ఆమె తల్లికి తన కుమార్తె బతికేవుందని అనిపించింది. దీంతో ఆమె శవపేటికను తెరవమని అక్కడున్నవారిని కోరింది. అయితే వారు అందుకు అంగీకరించలేదు. కాగా కొంతసేపటికి శవపేటికలో నుంచి బాలిక ఏడుపు వినిపించింది. వెంతనే దానిని తెరిచి, బాలికను బయటకు తీశారు. ఈ సంఘటన 2022, ఆగస్టు 17 న జరిగింది. దీంతో ఆ చిన్నారికి మరుజన్మ లభించిందని పలువురు పేర్కొన్నారు. అయితే ఆ బాలిక చనిపోయిందని వైద్యులు ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందనే విషయానికొస్తే.. కడుపు ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆ చిన్నారిని సాలినాస్ డి హిల్డాల్గో కమ్యూనిటీ ఆసుపత్రిలో చేర్చినప్పుడు, చికిత్స సమయంలో ఆమె గుండెచప్పుడు ఆగిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా బాలికలో చలనం రాకపోవడంతో చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. అయితే ఆ బాలిక తల్లి ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. తన కూతురు చనిపోలేదని అంటూ గట్టిగా ఏడవసాగింది. అంత్యక్రియల ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఆ బాలక తల్లి తన కుమార్తె శవపేటికలో వణుకుతున్నదని అక్కడున్నవారికి చెప్పింది. అయితే వారెవరూ నమ్మలేదు. ఆ బాలిక శవపేటికలో నుంచి ఏడుస్తూ, తన తల్లిని పిలవసాగింది. దీంతో శవపేటిక తెరవగా లోపల ఉన్న బాలిక సజీవంగా కనిపించింది. ఇది కూడా చదవండి: ప్రధానితో ముందుగానే వెళ్లిన విమానం.. 31 మంది ప్రయాణికులు విలవిల -
పిల్లాడి టైమ్ టేబుల్.. చదువుకు కేటాయించిన టైమ్ చూస్తే నవ్వాపుకోలేరు!
సోషల్ మీడియాలో చిన్న పిల్లల చిలిపి చేష్టలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతూ, నెటిజన్లను అమితంగా అలరిస్తుంటాయి. వీటిని చూసినప్పుడు మనకు ఉండే ఒత్తిడి క్షణాల్లో మాయం అవుతుంటుంది. సాధారణంగా చిన్నారులకు అంత త్వరగా చదువుపై మనసు లగ్నం కాదు. అయితే కొందరు పిల్లలు అటు టీచర్లు చెప్పారనో లేదా తల్లిదండ్రులు చెప్పారనో సొంత టైమ్ టేబుల్ తయారు చేసుకుంటుంటారు. వీటిలో రోజువారీ దినచర్య రాసుకుంటారు. ఈ కోవలో ఒక కుర్రాడు తయారు చేసుకున్న టైమ్ టేబుల్ ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిని చూసిన వారు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. క్రమశిక్షణ కోసం టైమ్ టేబుల్ ట్విట్టర్ యూజర్ @Laiiiibaaaa ఒక పోస్టు షేర్ చేశారు. దీనిని చూసినవారెవరైనా నవ్వకుండా ఉండలేకపోతున్నారు. ఆరేళ్ల పిల్లాడు తనను తాను క్రమశిక్షణతో ఉంచుకునే ఉద్దేశంతో తన 24 గంటల దినచర్యకు సంబంధించిన టైమ్ టేబుల్ రూపొందించుకున్నాడు. ఈ పిల్లాడు తాను చేయాల్సిన అన్ని పనులకు అధిక సమయం కేటాయిస్తూ, చదువుకునేందుకు కేవలం 15 నిముషాలు మాత్రమే కేటాయించాడు. ఇదే నెటిజన్లను తెగ నవ్విస్తోంది. My 6 year old cousin made this timetable...Bas 15 minutes ka study time, zindgi tu Mohid jee ra hai 😭🤌 pic.twitter.com/LfyJBXHYPI — Laiba (@Laiiiibaaaa) June 22, 2023 ఏమేమి రాశాడంటే.. ఆ పిల్లాడు తన టైమ్ టేబుల్లో నిద్ర నుంచి లేచే సమయం, వాష్‌రూమ్, బ్రేక్‌ఫాస్ట్, టీవీ టైమ్, స్నానం చేసే సమయం, లంచ్, నిద్రించే సమయం. ప్లే విత్ రెడ్ కార్, అత్త ఇంటికి వెళ్లే సమయం.. ఇలా అన్నింటికీ రోజులో కొంత సమయాన్ని కేటాయించాడు. అయితే చదువుకునేందుకు కేవలం 15 నిముషాల సమయం మాత్రమే కేటాయించాడు. ఈ పోస్టుకు ఇప్పటివరకూ 12 మిలియన్లకు పైగా వీక్షణలు దక్కాయి. ఇది కూడా చదవండి: దిమ్మతిరిగే ఆ పట్టణం పేరు చదివితే..జీనియస్! -
మంచి మాట: మెలకువలోనే మేలిమి
మనిషి మెలకువలో ఉండాలి; మనిషి మేలుకుని మసలాలి. మెలకువలో ఉండేందుకు, మేలుకుని మసలేందుకు మనిషి బతకాలి; మనిషి మేలుగా బతకాలి. నిద్రపొకూడదనీ, నిద్రవద్దనీ కాదు నిద్రపొతున్నప్పడు మాత్రమే మనిషికి నిద్ర ఉండాలి. నిద్ర అనేది మనిషికి కొంచెంసేపు వేసుకునే వస్త్రంగా మాత్రమే ఉండాలి. నిద్ర మనిషి పూర్తిగా కప్పుకునే దుప్పటి కాకూడదు; మనిషి తనను తాను నిద్రతో కప్పేసుకోకూడదు. మెలకువతో, మెలకువలో మనిషి తనను తాను చాటుకుంటూ ఉండాలి. ‘మెలకువలో కల నిజం కాదు; కలలో మెలకువ లేదు‘ అని ఆదిశంకరాచార్య చెప్పొరు. ఈ మాటల్ని మనసులోకీ, మెదడులోకీ ఎక్కించుకోవాలి. కలలు కనడానికి నిద్రపొతూ ఉండడంలోనూ, నిద్రలో కలలు కంటూ ఉండడంలోనూ కాలాన్ని వ్యర్థం చేసుకోకూడదు. కలలోనూ, నిద్రలోనూ మెలకువ ఉండదు. మనకు మెలకువ కావాలి ఎందుకంటే మెలకువలో కల నిజం కాదు. మనిషి కల కాకూడదు; మనిషి నిజం కావాలి. భద్రంగా ఉండాలని మనం నిద్రలోనే ఉండిపొకూడదు. నిద్రలో అటూ, ఇటూ ΄పొర్లుతూ ఉండడం జీవితవిధానం కాదు, ఎప్పటికీ కాకూడదు. నిద్రలో కలవరిస్తూ ఉండడంలోనూ, ఆ కలవరింతల్లో జరిగిపొయిన వాటిని వర్ణించుకుంటూ ఉండడంలోనూ మునిగిపొయిన మనిషి బతుకును పొడు చేసుకోవడం అనే నేరం చేస్తున్న నేరస్థుడు. ఎన్నో కలలు వస్తూ ఉంటాయి నిద్రలో. ఆ కలలు అన్నిటిలోనూ కల్లల్ని చూసుకుంటూ ఉండిపొవడం వయసును చిదుముకోవడమే అవుతుంది. కొందరు నిద్రపొతున్నప్ప్డుడు మాత్రమే కాదు మేలుకుని ఉన్నప్పుడు కూడా కలలకంటూ ఉంటారు; కొందరు మెలకువను కూడా కలల్లో గడిపేస్తూ ఉంటారు, కలల్లో కలిపేస్తూ ఉంటారు. ఇది అవాంఛనీయమైన స్థితి; ఇది బాధాకరమైన స్థితి. మెలకువను కూడా కలల్లో గడిపేస్తూ, కలిపేస్తూ ఉండేవాళ్లు కల్లలు అయిపొతారు. మనిషి కల్ల అయిపొకూడదు. అందుకే మనిషి వీలైనంత మెలకువలో ఉండాలి; అందుకే మనిషి వీలైనంత మేలుకుని ఉండాలి. పుట్టిన వ్యక్తికి తప్పకుండా మరణం ఉంటుంది. పుట్టుక, మరణం మధ్యలో ఉండే నిడివి జీవితం అవుతుంది. జీవితంలో మెలకువతో ఉండడమే జీవనం అవుతుంది. జీవి జీవితానికి మెలకువ జవ. ఆ జవ ఉన్న జీవనంలోనే చవి ఉంటుంది. జవ, చవి లేని మనిషి జీవితం చెక్కకో, చెత్తకో సమానం అవడం కాదు చెక్కకన్నా, చెత్తకన్నా హీనం ఆపై హేయం అవుతుంది. మనిషి చెక్కో, చెత్తో అవడం దుస్థితి, దుర్గతి. ‘యా మతిస్సా గతిర్భవేత్‘ అని అష్టావక్రగీతలో చెప్పడం జరిగింది. అంటే మతి ఎటువంటిదో గతి అటువంటిది అని అర్థం. మనిషి మతికి మెలకువ ఉంటే గతికి మెలకువ ఉంటుంది. మతికి, గతికి మెలకువ ఉంటే మనిషి చెక్కో, చెత్తో అయిపొయే దుస్థితి ఉండదు, రాదు. ప్రకృతి మెలకువలోనే ఉంటుంది. ప్రకృతి నిద్రపొతే ఏం అవుతుందో మనం ఒకసారి ఆలోచిద్దాం. ప్రకృతి నిద్రపొతే మన ఆలోచనలకు కూడా అందని పరిణామాలు సంభవిస్తాయి. గాలి మెలకువలో ఉండడం వల్లే మనం ఊపిరి పీల్చుకుంటూ ఉన్నాం. రాత్రుల్లో మొక్కలు మెలకువతో ఉండబట్టే పువ్వులు పూస్తూ ఉన్నాయి. నదులు మెలకువతోపొతూ ఉన్నాయి కాబట్టే మన అవసరాలు తీరుతూ ఉన్నాయి. ‘గచ్ఛ తీతి జగత్‘ అంటారు;పొతూనే ఉంది కాబట్టే జగత్ అయింది అని దానికి అర్థం. జగత్తు మొత్తం మెలకువతో ఉంది; మేలుకుని ఉంది. భూమి మెలకువతో ఉంది కాబట్టే సూర్యోదయం జరుగుతోంది; మనిషి మెలకువ తో ఉంటేనే జీవనోదయం జరుగుతుంది. ‘కంపనాత్‘ అని అంటూ ’కదలడంవల్ల అది బ్రహ్మం’ అని ఒక బ్రహ్మసూత్రం మనకు ఎరుకను ఇస్తోంది. ప్రకతి మాత్రమే కాదు బ్రహ్మం కూడా కదలిక ఉన్నదే. ప్రకృతి, బ్రహ్మం రెండూ మెలకువలో ఉండేవే; మేలుకుని ఉండేవే. ఎంత మెలకువ ఉంటే అంత మేలును ΄పొందుతాం. ఎంత మేలుకుని ఉంటే అంత మేలిమిని ΄పొందుతాం. మెలకువలో బతుకుతూ మనం మేలును ΄పొందుతూ ఉందాం; మేలుకుని బతుకుతూ మనం మేలిమికి మాలిమి అవుదాం. – రోచిష్మాన్ -
అలర్ట్ ఫీచర్.. ‘రైలులో ప్రశాంతంగా నిద్రపోవచ్చు’
Indian Railways Destination Alert Service: రైలు ప్రయాణికులు తాము దిగాల్సిన స్టేషన్ కోసం ఆన్లైన్లో నిత్యం పరిశీలించాల్సి వస్తుంది. అదే రాత్రి వేళల్లో అయితే బోగీలో లైట్లన్నీ ఆర్పి ఉండటం, సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కావడంతో వేగంగా వెళ్లడంతో రైలులో నుంచి రైల్వేస్టేషన్లను గుర్తు పట్టే పరిస్థితి ఉండదు. అర్ధరాత్రి దిగాల్సిన స్టేషన్ కోసం నిద్రపోకుండా ఎదురుచూస్తూ ఉండాలి. కానీ ఇక నుంచి రిజర్వేషన్లో ప్రయాణించే ప్రయాణికులు తమ బెర్త్‌లో ప్రశాంతంగా నిద్రపోయేందుకు భారత రైల్వే అలర్ట్ ఫీచర్ ఆప్షన్ తీసుకువచ్చింది. రైలులో నిద్రపోతున్న ప్రయాణికుడు ఇందులో భాగంగా 139కు కాల్ చేసి, మీ రిజర్వేషన్ టికెట్‌పై ఉన్న పీఎన్ఆర్ నంబర్ చెప్పి, దిగాల్సిన రైల్వేస్టేషన్ పేరు ధ్రువీకరించుకోవాలి. ఈ విధానంతో ప్రయాణికులు దిగాల్సిన స్టేషన్‌కు 20 నిమిషాల ముందు మీ సెల్‌ఫోన్‌కు కాల్ వస్తుంది. ఈ సదుపాయం కేవలం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు మాత్రమే ఉంది. ఏదేమైనా రాత్రి వేళల్లో ప్రయాణికులకు ఇది సౌకర్యంగా ఉంటుంది. చదవండి: వచ్చే నెలలో అమెరికాకు వెళ్లాల్సి ఉంది.. మనవడిని చూడకుండానే.. -
వామ్మో...అలారం
-
వామ్మో...అలారం
స్వీడన్: పొద్దున్నే మర్చిపోకుండా నిద్ర లేవాలంటే ఎవరైనా ఏం చేస్తాం.. అలారం పెట్టుకుంటాం. అయనా ఠంచన్ గా అలారం మోగినా లేవడానికి బద్దకించేవాళ్లు చాలామందే ఉన్నారు. అంతేకాదు దాని నెత్తిమీద ఒకటి మొట్టి మరీ మళ్లీ ముసుగు తన్ని పడుకోవడం కూడా కామనే... అవునా.. కాని ఇపుడు ఓ అలారం ఆ పప్పులేవీ ఉడకవు అంటోంది. పాఠం అప్పచెప్పకపోతే బెత్తం తీసుకుని వాయించే టీచర్ లా.. లేచే దాకా మొఖం మీద ఫెడీ. ఫెడీ వాయిస్తూనే ఉంటానంటోంది. ఎంతటి కుంభకర్ణులకైనా దెబ్బకు దెయ్యం అదేనండి..నిద్ర పారిపోవాల్సిందే అంటోంది. దీనికి సంబంధించి స్వీడిస్ మహిళ విడుదల చేసిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వేకప్ అలారాన్ని చూసిన నెటిజన్లు, ఇదేమీ అలారం రా బాబూ అనుకుంటూనే లైక్ ల మీద కొడుతూ, వేల కొద్దీ షేర్ లు చేస్తున్నారట.