సోషల్ మీడియాలో చిన్న పిల్లల చిలిపి చేష్టలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతూ, నెటిజన్లను అమితంగా అలరిస్తుంటాయి. వీటిని చూసినప్పుడు మనకు ఉండే ఒత్తిడి క్షణాల్లో మాయం అవుతుంటుంది. సాధారణంగా చిన్నారులకు అంత త్వరగా చదువుపై మనసు లగ్నం కాదు. అయితే కొందరు పిల్లలు అటు టీచర్లు చెప్పారనో లేదా తల్లిదండ్రులు చెప్పారనో సొంత టైమ్ టేబుల్ తయారు చేసుకుంటుంటారు. వీటిలో రోజువారీ దినచర్య రాసుకుంటారు. ఈ కోవలో ఒక కుర్రాడు తయారు చేసుకున్న టైమ్ టేబుల్ ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిని చూసిన వారు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.
క్రమశిక్షణ కోసం టైమ్ టేబుల్
ట్విట్టర్ యూజర్ @Laiiiibaaaa ఒక పోస్టు షేర్ చేశారు. దీనిని చూసినవారెవరైనా నవ్వకుండా ఉండలేకపోతున్నారు. ఆరేళ్ల పిల్లాడు తనను తాను క్రమశిక్షణతో ఉంచుకునే ఉద్దేశంతో తన 24 గంటల దినచర్యకు సంబంధించిన టైమ్ టేబుల్ రూపొందించుకున్నాడు. ఈ పిల్లాడు తాను చేయాల్సిన అన్ని పనులకు అధిక సమయం కేటాయిస్తూ, చదువుకునేందుకు కేవలం 15 నిముషాలు మాత్రమే కేటాయించాడు. ఇదే నెటిజన్లను తెగ నవ్విస్తోంది.
My 6 year old cousin made this timetable...Bas 15 minutes ka study time, zindgi tu Mohid jee ra hai 😭🤌 pic.twitter.com/LfyJBXHYPI
— Laiba (@Laiiiibaaaa) June 22, 2023
ఏమేమి రాశాడంటే..
ఆ పిల్లాడు తన టైమ్ టేబుల్‌లో నిద్ర నుంచి లేచే సమయం, వాష్‌రూమ్, బ్రేక్‌ఫాస్ట్, టీవీ టైమ్, స్నానం చేసే సమయం, లంచ్, నిద్రించే సమయం. ప్లే విత్ రెడ్ కార్, అత్త ఇంటికి వెళ్లే సమయం.. ఇలా అన్నింటికీ రోజులో కొంత సమయాన్ని కేటాయించాడు. అయితే చదువుకునేందుకు కేవలం 15 నిముషాల సమయం మాత్రమే కేటాయించాడు. ఈ పోస్టుకు ఇప్పటివరకూ 12 మిలియన్లకు పైగా వీక్షణలు దక్కాయి.
ఇది కూడా చదవండి: దిమ్మతిరిగే ఆ పట్టణం పేరు చదివితే..జీనియస్!
Comments
Please login to add a commentAdd a comment