సార్‌.. నాకు పెళ్లి వద్దు, చదువుకుంటా!  | Inter student approached the police | Sakshi
Sakshi News home page

సార్‌.. నాకు పెళ్లి వద్దు, చదువుకుంటా! 

Published Sun, Feb 25 2024 5:13 AM | Last Updated on Sun, Feb 25 2024 5:13 AM

Inter student approached the police - Sakshi

జగిత్యాలక్రైం: ‘నాకు పెళ్లి వద్దు, చదువుకుంటా’అని ఓ యువతి పోలీసులను ఆశ్రయించిన ఘటన జగిత్యాల జిల్లాకేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. జగిత్యాల రూరల్‌ మండలం పొలాస గ్రామానికి చెందిన విద్యార్థిని(20)కి రాయికల్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి చేసేందుకు కుటుంబసభ్యులు సంబంధం కుదుర్చారు. ఈ నెల 26న నిశ్చితార్థం జరపాలని నిర్ణయించారు.

అయితే ‘ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నా, ఇంకా చదువుకుంటా, అమ్మనాన్న నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు, నాకు పెళ్లి ఇష్టం లేదు’అని జగిత్యాల రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో సీఐ ఆరీఫ్‌ అలీఖాన్, ఎస్సై సుధాకర్‌ను ఆ విద్యార్థిని కలిసి గోడు వెళ్లబోసుకుంది. స్పందించిన పోలీసులు ఆమె తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి చదువుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆ విద్యార్థినిని సఖీ కేంద్రానికి తరలించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement