
ప్రతీకాత్మక చిత్రం
కాణిపాకం (యాదమరి): బాలికపై అత్యాచారయత్నం చేసిన వృద్ధుడిని.. దిశ యాప్ ద్వారా సమచారం అందుకున్న పోలీసులు మూడు నిమిషాల్లో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గురువారం రాత్రి చిత్తూరు జిల్లా కాణిపాకం మండలంలో జరిగింది. కాణిపాకం ఎస్‌ఐ రమేష్‌బాబు కథన మేరకు.. మండలంలోని చిగరపల్లె దళితవాడలో గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో ఇంటిముందు వీధిలో ఆడుకుంటున్న బాలిక (9)కు అదే ప్రాంతానికి చెందిన కేశవులు (55) మాయమాటలు చెప్పి పక్కనున్న చీకటి ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు.
బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వెళ్లగా కేశవులు పారిపోయాడు. తర్వాత స్థానిక మహిళలు దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాణిపాకం పోలీసులు మూడు నిమిషాల్లో గ్రామానికి చేరుకుని వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేశవులుపై కేసు నమోదు చేసినట్టు ఎస్.ఐ. చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment