హైదరాబాద్: రాష్ట్రంలో మహిళల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు ఏర్పాటైన కమిటీ శనివారం సచివాలయంలో సమావేశమైంది. మహిళల సమస్యల పరిష్కారంలో కృషిచేస్తున్న ఉమెన్ స్టాఫ్ క్రైసిస్ సంస్థ కార్యకలాపాలు అధ్యయనం చేయడానికి కమిటీ సభ్యుడు సునీల్‌శర్మను గుజరాత్‌కు, స్త్రీ ఆర్ట్స్ సంస్థ కార్యకలాపాలను అధ్యయనం చేసేందుకు హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి సౌమ్యా మిశ్రాను కేరళకు పంపాలని కమిటీ నిర్ణయించింది.
అలాగే, ఈ నెల 11న మహిళా ఐటీ ఉద్యోగులతో, 12న స్వచ్చంధ సంస్థలతో సమావేశమై వారి సూచనలు, సలహాలు తీసుకోవాలని.. 15న ప్రభుత్వానికి నివేదికను అందచే యాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, సీఐడీ ఐజీ చారుసిన్హా, పోలీసు ట్రైనింగ్ విభాగం ఐజీ స్వాతి లక్రా, ఐఏఎస్ అధికారి సునీల్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
మహిళల భద్రతపై గుజరాత్, కేరళలో అధ్యయనం
Published Sun, Sep 7 2014 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM
Advertisement
Advertisement