బ్యాంక్ లింకేజీ వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరించిన మంత్రి సీతక్క
సాక్షి, హైదరాబాద్: 2024–25లో రాష్ట్రంలోని 3,56, 273 స్వయం సహాయక మహిళా సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) రూ.20,000.39 కోట్లు అందించే లక్ష్యంగా బ్యాంక్ లింకేజీ వార్షిక రుణ ప్రణాళికను పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆవిష్కరించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ– గ్రామీణాభివృద్ధి సంస్థ ఎస్‌హెచ్‌జీ– బ్యాంక్ లింకేజి వార్షిక ఋణ ప్రణాళికలో భాగంగా శనివారం దీనిని విడుదల చేశారు.
ఎస్‌హెచ్‌జీ వార్షిక ఋణ ప్రణాళికను ఆవిష్కరించిన అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.20 వేల కోట్లకు వార్షిక రుణ ప్రణాళికతో పాటు అదనంగా 2,25,000 మహిళలకు వివిధ జీవనోపాధి కార్యక్రమాల నిమిత్తం రూ.4,500 కోట్లు బ్యాంకుల నుంచి సహాయం అందించనున్నట్టు తెలియజేశారు. మహిళాశక్తి క్యాంటీన్లను త్వరలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.
కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చాక మహిళల ఆర్థిక అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనివ్వడంతో పాటు బ్యాంకుల ద్వారా వ్యక్తిగత రుణాలు ఇప్పిస్తున్నట్టు తెలిపారు. మహిళా సంఘాలకు ఏ పూచీకత్తు లేకుండా ఇతోధికంగా ఋణాలు అందిస్తున్నందుకు మహిళల తరపున, ప్రభుత్వం తరపున బ్యాంకు అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. సమావేశంలో పీఆర్‌శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, నాబార్డ్ సీజీఎం సుశీల చింతల తదితరులుపాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment