సచివాలయంలో మహిళాశక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవంలో మంత్రి సీతక్క. చిత్రంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, సీఎస్ శాంతికుమారి
సచివాలయంలో ప్రారంభించిన మంత్రి సీతక్క
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో 151 మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సంకలి్పంచారని, మహిళాశక్తి క్యాంటీన్లు ఒక బ్రాండ్‌గా ఎదగాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. శుక్రవారం డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ సచివాలయంలో గ్రౌండ్‌ఫ్లోర్, థర్డ్‌ఫ్లోర్‌లో మహిళాశక్తి క్యాంటీన్లను సీఎస్ శాంతికుమారితో కలిసి ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ క్యాంటీన్లు కార్పొరేట్ క్యాంటీన్లను తలపిస్తున్నాయన్నారు. మహిళాశక్తి క్యాంటీన్లు ప్రతి ఇంటి అమ్మచేతి వంటలా నాణ్యతకు మారుపేరుగా నిలవాలని చెప్పారు. పల్లెరుచులు, ఇప్పపువ్వు లడ్డూలు, నన్నారి వంటి వాటిని పట్టణాలకు పరిచయం చేయాలన్నారు. రానున్న ఐదేళ్లలో మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు అందిస్తామన్నారు.
జిల్లా ఆస్పత్రుల్లోనూ....
మహిళా శక్తి క్యాంటీన్లకు సచివాలయంలో మొదటి అడుగు పడిందని, 20 రోజుల్లో జిల్లా ఆస్పత్రుల్లో మహిళాశక్తి కాంటీన్లు ప్రారంభించే పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. తెలంగాణ మహిళాసంఘాలు దేశానికే ఆదర్శంగా ఎదుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, పీఆర్ అండ్ ఆర్ డీ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానీయ, సీఎం కార్యాలయ కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, సెర్ప్ డైరెక్టర్ గోపాల్‌రావు, అధికారులు నర్సింహారెడ్డి, సునీతరెడ్డి, రజిత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment