మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క
చెంచులకు అండగా ఉంటాం..
నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధిత మహిళకు పరామర్శ
లక్డీకాపూల్ (హైదరాబాద్): నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి దాడి ఘటనకు భూ వివాదమే కారణమని తాము భావిస్తున్నట్లు మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. చెంచుల పునరావాసం కోసం కేటాయించిన భూములపై కన్నేసిన కొందరు ఇలాంటి దాడులకు తెగబడుతున్నారన్నారు. బుధవారం మంత్రి నిమ్స్‌లో చికిత్స పొందుతున్న చెంచు మహిళ ఈశ్వరమ్మను పరమర్శించారు. బాధితు రాలితో మాట్లాడి దాడి ఘటన వివరాలు తెలుసుకు న్నారు. జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి కేసు పురోగతిని తెలుసుకున్న మంత్రి.. నిందితులకు కఠి న శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, గతంలో భూములు అమ్ముకున్న భూ యాజమానులకు ధరణి తర్వాత తిరిగి పాస్ పుస్తకాలు రావడంతో చెంచులపై దాడులు చేస్తున్నారన్నారు. ఆ భూముల విలువ పెరగడంతో.. వాటిని లాక్కునేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరక్కుండా పోలీసులు కఠినంగా వ్యవహ రించాలన్నారు. మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడితే కఠినంగా శిక్షించేలా పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందన్నారు. జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, అధికారులు బాధి తురాలికి అండగా నిలిచారన్నారు. బాధిత కుటుంబానికి పూర్తి రక్షణ కల్పిస్తామని చెప్పారు.
బాధితు రాలి మామయ్య నాగయ్య మృతిపై అనుమా నాలు న్నందున ఆ కేసును పునఃవిచారణ చేయాల న్నారు. చెంచులకు అండగా ఉంటామని తెలిపారు. బాధిత కుటుంబానికి తాత్కాలికంగా రూ.25 వేలు అందజే శామన్నారు. మహిళా శిశుసంక్షేమ శాఖ కమిషనర్ కాంతి వెస్లీ, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప, నాగ ర్ కర్నూల్ ఐటీడీఓ రోహిత్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు. మంత్రి సీతక్కతో పాటు ఈశ్వరమ్మను పరామర్శించిన వారిలోప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment