eswaramma
-
దాడికి భూ వివాదమే మూలం
లక్డీకాపూల్ (హైదరాబాద్): నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి దాడి ఘటనకు భూ వివాదమే కారణమని తాము భావిస్తున్నట్లు మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. చెంచుల పునరావాసం కోసం కేటాయించిన భూములపై కన్నేసిన కొందరు ఇలాంటి దాడులకు తెగబడుతున్నారన్నారు. బుధవారం మంత్రి నిమ్స్‌లో చికిత్స పొందుతున్న చెంచు మహిళ ఈశ్వరమ్మను పరమర్శించారు. బాధితు రాలితో మాట్లాడి దాడి ఘటన వివరాలు తెలుసుకు న్నారు. జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి కేసు పురోగతిని తెలుసుకున్న మంత్రి.. నిందితులకు కఠి న శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, గతంలో భూములు అమ్ముకున్న భూ యాజమానులకు ధరణి తర్వాత తిరిగి పాస్ పుస్తకాలు రావడంతో చెంచులపై దాడులు చేస్తున్నారన్నారు. ఆ భూముల విలువ పెరగడంతో.. వాటిని లాక్కునేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరక్కుండా పోలీసులు కఠినంగా వ్యవహ రించాలన్నారు. మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడితే కఠినంగా శిక్షించేలా పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందన్నారు. జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, అధికారులు బాధి తురాలికి అండగా నిలిచారన్నారు. బాధిత కుటుంబానికి పూర్తి రక్షణ కల్పిస్తామని చెప్పారు. బాధితు రాలి మామయ్య నాగయ్య మృతిపై అనుమా నాలు న్నందున ఆ కేసును పునఃవిచారణ చేయాల న్నారు. చెంచులకు అండగా ఉంటామని తెలిపారు. బాధిత కుటుంబానికి తాత్కాలికంగా రూ.25 వేలు అందజే శామన్నారు. మహిళా శిశుసంక్షేమ శాఖ కమిషనర్ కాంతి వెస్లీ, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప, నాగ ర్ కర్నూల్ ఐటీడీఓ రోహిత్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు. మంత్రి సీతక్కతో పాటు ఈశ్వరమ్మను పరామర్శించిన వారిలోప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య తదితరులున్నారు. -
చెంచు మహిళపై అమానుష దాడి
సాక్షి, నాగర్‌కర్నూల్: చెంచు మహిళను వివస్త్రను చేసి అమానుషంగా దాడి చేసిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లికి చెందిన చెంచు దంపతులు కాట్రాజు ఈశ్వరమ్మ–ఈదన్నలకు గ్రామంలో ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. అదే గ్రామానికి చెందిన బండి వెంకటేశ్ ఈ భూమిని కౌలుకు తీసుకున్నాడు. వ్యవసాయ పనులతోపాటు సమీపంలోని ఇసుక ఫిల్టర్ వద్ద పనినిమిత్తం ఈశ్వరమ్మ–ఈదన్న దంపతులు వెంకటేశ్ వద్ద జీతం ఉంటున్నారు. వారం రోజుల కిందట ఈశ్వరమ్మ భర్తతో గొడవపడింది. ఆ తర్వాత మండల పరిధివలోని చుక్కాయిపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ నెల 18వ తేదీన ఈశ్వరమ్మ కోసం బండి వెంకటేశ్ తన సోదరుడితో కలసి బైక్‌పై చుక్కాయిపల్లికి వెళ్లాడు. ఆమెను అదే బైక్‌పై మొలచింతలపల్లికి తీసుకొచ్చేందుకు తిరుగుపయనమయ్యాడు. మార్గమధ్యలో ఎల్లూరు శివారులో బైక్ ఆపాడు. పనులు ఎగ్గొట్టి పారిపోతావా అని ఆగ్రహిస్తూ ఈశ్వరమ్మను బైక్ నుంచి దింపాడు. అనంతరం కర్రతో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఇంటికి తీసుకొ చ్చిన తర్వాత కూడా ఆమెను వివస్త్రను చేసి కారంతో కాళ్లలో, సున్నిత అవయవాల(జననాంగాలు)పై దాడి చేశారు. కర్రకు ఓ వ్రస్తాన్ని చుట్టి డీజిల్‌తో మంట పెట్టి ఒంటిపై విచక్షణారహితంగా వాతలు పెట్టారు. మరుసటి రోజు ఉదయం బడి పిల్లల ఎన్రోల్మెంట్ కోసం ఆదివాసీ లిటరిటీ కౌన్సిల్(ఎన్ఏఎస్సీ) ప్రతినిధులు ఆ గ్రామానికి వచ్చారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వ చ్చి0ది. బుధవారం సాయంత్రం ఏఎస్పీ రామేశ్వర్‌ను కలసి వారు ఫిర్యాదు చేశారు.కొందరు తమ భూములను కూడా బలవంతంగా తీసుకోవడంతో పాటు ఇలా దాడులు చేస్తున్నారని, ఈశ్వరమ్మపై జరిగిన దాడి సభ్యసమాజం తలదించుకునేలా ఉందని చెంచుసంఘం నాయకులు వాపోయారు. ఈశ్వరమ్మపై దాడి చేసిన ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్టు చేసినట్లు నాగర్‌కర్నూల్ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. బండి వెంకటే‹Ù, ఆయన భార్య శివమ్మ, లింగస్వామి, లక్ష్మి దాడి చేసినట్టు తేలిందని, వీరిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. కాగా బాధితురాలు నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలికి అండగా ఉంటాం: జూపల్లి చెంచు మహిళపై జరిగిన అమానుష దాడి పట్ల మంత్రి జూపల్లి కృష్ణారావు విచారం వ్యక్తం చేశారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఎస్పీ వైభవ్ గైక్వాడ్‌కు ఫోన్ చేసి కేసు దర్యాప్తుపై ఆరా తీశారు. అమానుషంగా ప్రవర్తించిన వ్యక్తులపై వెంటనే విచారణ చేపట్టి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
నాగరాజుతో వివాహేతర సంబంధం.. తల్లీకొడుకు మధ్య గొడవలో..
సాక్షి, సత్యసాయి జిల్లా(గోరంట్ల): మండల పరిధిలోని వానవోలు గ్రామానికి చెందిన చాకలి ఈశ్వరమ్మ (42) అనే వితంతువును కుమారుడు పవన్ హత్య చేశాడు. వివాహేతర సంబంధం మానుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో మంగళవారం రాత్రి కట్టెతో కొట్టి, బండరాయితో మోది హతమార్చాడు. గోరంట్ల సీఐ జయనాయక్ తెలిపిన మేరకు.. ఈశ్వరమ్మ భర్త చాకలి కుళ్లాయ్యప్ప పదేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో ఆమె అదే గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. చదవండి: (వ్యభిచార గృహంపై దాడి.. ఇద్దరు అరెస్ట్) కుమారుడు పవన్‌కు కొంత కాలం క్రితం వివాహమైంది. అతని భార్య ఇటీవల పుట్టినింటికి వెళ్లింది. వివాహేతర సంబంధం మానుకోవాలని తల్లికి పవన్ అనేక సార్లు సూచించాడు. ఆమె పెడచెవిన పెడుతూ వచ్చింది. ఈ విషయంపై మంగళవారం రాత్రి తల్లీకొడుకు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో పవన్‌పై తల్లి ఇటుకతో దాడి చేయడానికి ప్రయత్నించగా.. అతను ఆగ్రహానికి గురై కట్టెతో కొట్టి, బండరాయితో మోది చంపేశాడు. తర్వాత మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి ఇంటికి సమీపంలోని మొక్కజొన్న చేనులో పడేశాడు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం ధర్మవరం డీఎస్పీ రమాకాంత్, సీఐ జయనాయక్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో తల్లిని తానే చంపినట్లు పవన్ అంగీకరించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (Hyderabad: అతడే ఆమెగా మారి!) -
వైస్ చైర్మన్ ఈశ్వరమ్మకు రిమాండ్
సూళ్లూరుపేట: జిల్లాలోని పలు బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగవేతకు పాల్పడిన ఆర్థిక నేరస్తురాలు, సూళ్లూరుపేట వైస్ చైర్మన్ గరిక ఈశ్వరమ్మను జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ, గూడూరు డీఎస్పీ రాంబాబుల ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి గురువారం సూళ్లూరుపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచగా ఈ నెల 14 వరకు రిమాండ్ విధించినట్లు సీఐ నూతలపాటి కిషోర్‌బాబు తెలిపారు. అయితే గత నెల 29న ఈశ్వరమ్మ స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయిన విషయం విదితమే. అప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకుని ఒక రోజుపాటు విచారించి బుధవారం 11 గంటలకు అరెస్ట్ చూపించామని సీఐ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కోఆపరేటివ్ సహకార బ్యాంక్ డైరెక్టర్ డి.సుధాభారతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమెను ఈ నెల 22న రాత్రి అదుపులోకి తీసుకుని విచారణ పేరుతో స్టేషన్‌కు తీసుకొచ్చామని తెలిపారు. అయితే టీడీపీ నేత పరసా వెంకటరత్నయ్య తనకు ఎలాంటి ఫోన్ చేయలేదని, ఎస్సై ఇంద్రసేనారెడ్డికి ఫోన్ చేసి ఆమె అనారోగ్యంతో ఉందని, ఇంటికి పంపితే మరలా వస్తుందని చెప్పిన విషయం వాస్తవమేనని తెలిపారు. దీంతో ఎస్సై తనకు ఫోన్ చేసి పరసా ఫోన్ చేస్తున్నారని, ఏం చేయమంటారని అడగడంతో ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవద్దని కచ్చితంగా చెప్పానన్నారు. ఈశ్వరమ్మ వాగ్వాదానికి దిగడంతో హోంగార్డు నాగూరమ్మను తోడుగా వెళ్లమని చెప్పి పంపిన విషయం వాస్తవమేనని అన్నారు. ఈశ్వరమ్మ బయటకు వెళ్లగానే హోం గార్డును కసరడంతో ఆమె స్టేషన్ బయటే ఆగిపోయిందని, ఆ తరువాత వారు పరారైన విషయం నిజమేనన్నారు. అప్పటి నుంచి పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా ఉన్న వ్యక్తి ఆమెకు సపోర్టుగా పలుమార్లు ఫోన్ చేసి మాట్లాడినట్టు కాల్‌లిస్టులో రికార్డయి ఉందని పేర్కొన్నారు. ఆమెను అదుపులోకి తీసుకునేందుకు పది రోజుల ముందే జిల్లా కోఆపరేటివ్ అధికారులు ఆమెపై ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ విషయం జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి దర్యాప్తు ప్రారంభించామన్నారు. బ్యాం కుల నుంచి నిధులు తీసుకుని దుర్వినియోగం చేసినందుకు సంస్థ కార్యదర్శి గరిక ఈశ్వరమ్మ, అధ్యక్షురాలు వనితలపై 409, 418, 420, 423 సెక్షన్లతోపాటు ఆర్డబ్ల్యూ 34, ఐపీసీ సెక్షన్ 29 క్లాజ్ 2 కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. ఏపీ మ్యూచ్చువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ చట్టం 1995 ప్రకారం కేసు రిజిస్టర్ చేశామని తెలిపారు. ఆమెకు సçహాయకులుగా పనిచేసిన వారిని కూడా విచారిస్తామన్నారు. సీఐ ఆవేదన ఈ కేసు విషయంలో అధికారపార్టీ నాయకులకు అనుకూలంగా పనిచేయడం లేదని వారంతా కలసి తనను ఇక్కడ నుంచి బదిలీ చేయించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని సీఐ కిషోర్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. బదిలీకి సిద్ధమయ్యానని, ఈశ్వరమ్మ కేసుతో తమ ఉద్యోగాలకే ఎసరు వచ్చిందని అన్నారు. -
లొంగిపోయిన చైర్పర్సన్ ఈశ్వరమ్మ
సూళ్లూరుపేట: నాటకీయ పరిణామాల మధ్య సూళ్లూరుపేట మున్సిపల్ చైర్పర్సన్ గరిక ఈశ్వరమ్మ మంగళవారం తెల్లవారుజామున సూళ్లూరుపేట పోలీసు స్టేషన్లో లొంగిపోయింది. ఈనెల 22వ తేదీ జిల్లా కో–ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ డి.సుధాభారతి ఈశ్వరమ్మ రూ.7,56,66,000 కోట్లు బ్యాంకులకు చెల్లించకుండా ఎగవేతకు పాల్పడిందని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల నుంచి భర్తతో కలిసి తప్పించుకుని పరారైంది. ఎస్సై కె.ఇంద్రసేనా రెడ్డి, సీఐ కిషోర్‌బాబు రెండు బృందాలుగా ఏర్పడి వారంరోజుల నుంచి తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. హోటల్లో దిగి.. మంగళవారం తెల్లవారుజామున బెంగళూరుకు చెందిన ఓ లాయర్, పలువురు ముఖ్యమైన వ్యక్తులు నాలుగు కార్లలో వచ్చి సూళ్లూరుపేట పట్టణంలోని బైపాస్‌లో ఉన్న ఎంఆర్ గ్రాండ్ హోటల్ దిగారు. ఈశ్వరమ్మ వారితో సమాలోచనలు జరిపారు. అనంతరం లాయర్ సమక్షంలో భర్త ఈశ్వరయ్యతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు. పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈశ్వరమ్మ తమిళనాడులోని చెన్నై నగరానికి దూరంగా ఉన్న ఓ మారుమూల గ్రామంలో తలదాచుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా గాలింపు చర్యల్లో ఉన్న సీఐ, ఎస్సైకు పోలీసులు సమాచారం అందించడంతో చెన్నైకు దగ్గరలో ఉన్న ఎస్సై మాత్రం వెంటనే పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. సీఐ సాయంత్రానికి సూళ్లూరుపేటకు చేరుకున్నారు. తడ ఎస్సై దాసరి వెంకటేశ్వరరావు ఈశ్వరమ్మ, వనితలను నెల్లూరులోని ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ఎదుట హాజరుపరిచారు. -
వామ్మో.. ఈశ్వరమ్మ!
సూళ్లూరుపేటరూరల్: క్యామెల్ సేవా సంస్థతో రూ.కోట్లు కాజేసిన సూళ్లూరుపేట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గరిక ఈశరమ్మ అవినీతి, అక్రమాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే నాబార్డు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను మోసగించి రూ.9.21 కోట్ల రుణం పొందారు. అందులో రూ.7.08 కోట్లు తిరిగి చెల్లించని కారణంగా నాబార్డు సంస్థ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధికారుల సాయంతో ఈశ్వరమ్మపై కేసు పెట్టడం, ఈ కేసులో ఆమెను మాజీ మంత్రి పరసా వెంకటరత్నం పోలీస్ కస్టడీ నుంచి తప్పించడం తెలిసిందే. తాజాగా మెప్మా ద్వారా మరుగుదొడ్ల సొమ్మును కాజేసినట్లు వెలుగులోకి వచ్చింది. దేవాలయం భూములను పట్టాలుగా ఇప్పిస్తానని అంకణానికి ఇంత చొప్పున వసూలు చేసిన విషయం వెలుగు చూసింది. ఆత్మగౌరవం అభాసుపాలు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ అని, రాష్ట్ర ప్రభుత్వంఆత్మగౌరవమని పేర్లు పెట్టి పేదలకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించే పథకానికి శ్రీకారం చుట్టితే ఈశ్వరమ్మ ఆ పథకాన్ని అభాసుపాల్జేసింది. సూళ్లూరుపేట మున్సిపాలిటీలోని 16వ వార్డులో ఈశ్వరమ్మ మరుగుదొడ్లు నిర్మించే బాధ్యతను భుజానకెత్తుకుంది. ఈ పథకంలో ఒక్కో మరుగుదొడ్డికి ప్రభుత్వం రూ.15 వేలను మూడు విడతలుగా విడుదల చేసింది. నాగరాజపురం, వేనాటి మునిరెడ్డి లెప్రసీ కాలనీ, కాలువకట్ట గిరిజనులకు మొత్తం 68 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. పురపాలక సంఘ పరిధిలోని పొదుపు సమాఖ్య నాయకుల జాయింట్ అకౌంట్లో దీనికి సంబంధించిన సొమ్ము జమ అయ్యేది. ఈశ్వరమ్మ ఆ సమాఖ్య నాయకుల సహకారంతో సొమ్ము మొత్తం స్వాహా చేసింది. కానీ మరుగుదొడ్లు మాత్రం నిర్మించిన దాఖలాలు లేవు. లెప్రసీ కాలనీలో మరుగుదొడ్ల నిర్మాణానికి తెచ్చిన సిమెంట్ ఇటుకలను మళ్లీ తీసుకెళ్లి పోయింది. దీంతో ఆ కాలనీలోని 33 ఇళ్లకు ఒక్క మరుగుదొడ్డి కూడా నిర్మితం కాలేదు. గిరిజనకాలనీలో మరుగుదొడ్లు కట్టించిన దాఖలా లేదు. నాగరాజపురంలో చాలా మందికి కేవలం రూ.5 వేలు మాత్రమే చెల్లించింది. కొందరు తమ సొంత సొమ్ముతో మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్దేశం పక్కదారి పట్టింది. ఈ వ్యవహారంపై పురపాలక సంఘం ఏఈ ప్రవీణ్ మాట్లాతూ వెంటనే విచారణ జరిపిస్తామన్నారు. దేవాలయ భూములకు పట్టాలిప్పిస్తానని.. సూళ్లూరుపేటలోని నాగరాజపురంలో తడ మండలం వాటంబేడు శివాలయానికి చెందిన దేవుడి మాన్యం ఉంది. ఈ స్థలాన్ని చాలా మంది ఆక్రమించుకుని పక్కా ఇళ్లు నిర్మించుకున్నారు. వాటిల్లో క్యామెల్ సేవా సంస్థకు చెందిన రెండు పెద్ద భవనాలు కూడా ఉన్నాయి. దీంతో ఈశ్వరమ్మ ఇక్కడ ఆక్రమించుక్ను స్థలాలకు ప్రభుత్వం నుంచి పట్టా తెప్పిస్తానని మాయమాటలు చెప్పి స్థానికుల నుంచి ఒక్కో అంకణానికి రూ.100 చొప్పున సొమ్ము వసూలు చేసింది. ఏళ్లు గడుస్తున్నా ఇక్కడున్న వారిలో ఎవరికీ పట్టాలు వచ్చిన దాఖలాలు లేవు. అంధులనే కనికరం కూడా లేదు వీరిద్దరూ కళ్లు కనిపించని వృద్ధులు. ఈమె పేరు ఊరుబిండి శ్రీనివాసన్, చెల్లమ్మ దంపతులు. వీరికి పిల్లు లేరు. వీరికి 30 ఏళ్ల క్రితం ప్రభుత్వం లెప్రసీ కాలనీలో ఇంటి స్థలం పట్టా ఇచ్చింది. వీరికి నేటికీ పక్కా ఇల్లు కట్టించిన దాఖలాలు లేవు. ఇంత కాలం వీరు పరదా కప్పిన గుడిసెలో జీవిస్తూ వచ్చారు. ప్రస్తుతం సూళ్లూరుకు చెందిన బూదూరు వెంకటయ్య అనే బేల్దారి మేస్త్రీ తన సొంత ఖర్చులతో రేకుల ఇల్లు కటిస్తున్నాడు. శ్రీనివాసన్ దంపతులు వారానికి ఒక్కసారి సబ్ అర్బన్ రైల్లో చెన్నైకు వెళ్లి దేవాలయాల ముంగిట భిక్షమెత్తుకుంటారు. ఆ వచ్చిన డబ్బులతో వీరు కాలం వెల్లదీస్తున్నారు. అలాంటి వీరికి మరుగుదొడ్డి అవసరమైన సౌకర్యం. ఈశ్వరమ్మ వీరికి దొడ్డి కట్టిస్తానని ఇటుక రాళ్లను ఇంటి ముందు దించింది. కొన్ని రోజుల తర్వాత వాటిని తీసుకెళ్లి పోయింది. దీంతో నేటికీ ఈ ముసలి వారు పక్కనున్న కాళం గి నదినే ఆశ్రయిస్తూ కాలం గడుపుతున్నారు. -
రూ.కోట్లు మింగిన ‘క్యామెల్’
సూళ్లూరుపేట/సూళ్లూరుపేట రూరల్: టీడీపీ నాయకురాలు, సూళ్లూరుపేట మున్సిపల్ వైస్ చైర్పర్సన్, క్యామెల్ మహిళా కో–ఆపరేటివ్ మహిళా బ్యాంక్ అధినేత గరిక ఈశ్వరమ్మ ఆర్థిక నేరంలో చిక్కుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నాబార్డు, సూళ్లూరుపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల నుంచి పలురకాలుగా మొత్తం రూ.9.21 కోట్ల రుణంను ఈశ్వరమ్మ పొందింది. అయితే తిరిగి రూ.7.08 కోట్లు చెల్లించకపోవడంతో సూళ్లూరుపేట పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. నాబార్డు అనుబంధ సంస్థ అయిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధికారులు సుధాభారతి, శేఖర్‌బాబులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై కె.ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేశారు. బ్యాంక్ అధికారులు నేరుగా ఎస్పీని కలిసి వివరాలు తెలియజేసి ఆయన సూచన మేరకు సూళ్లూరుపేటకు వచ్చి ఫిర్యాదు చేయడంతో ఈశ్వరమ్మ అధికార పార్టీ నాయకురాలైనా వెంటనే కేసు నమోదైంది. మంగళవారం రాత్రి ఎస్సై సూళ్లూరుపేటలోని క్యామెల్ సేవా సంస్థ కార్యాలయానికి వెళ్లి ఈశ్వరమ్మ, మహిళా బ్యాంకు అధ్యక్షురాలు వనితలను అరెస్ట్ చేశారు. పరసా జోక్యంతో.. మంగళవారం రాత్రి ఈశ్వరమ్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాగా టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పరసా వెంటరత్నం స్థానిక పోలీసులకు ఫోన్ చేసి ఆమెను వెంటనే విడుదల చేయాలని చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో ఎస్సై ఈశ్వరమ్మకు ఒక మహిళా హోంగార్డును కాపలాగా ఇచ్చి పంపించారు. తిరిగి వస్తానని చెప్పి వెళ్లిన ఈశ్వరమ్మ బుధవారం సాయంత్రమైనా రాకపోవడంతో ఎస్సై వాకబు చేసి పరారైనట్టు నిర్ధారించుకున్నారు. కాగా నిందితురాలు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. క్యామెల్‌తోనే మొదలైన ప్రస్థానం ఈశ్వరమ్మ భర్త ఈశ్వరయ్య తొలుత మునెమ్మ అనే మహిళతో కలసి క్యామెల్ సేవాసంస్థను ఏర్పాటుచేశారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ కింద సంస్థ నమోదయ్యాక దానికి విదేశీ నిధులు రావడం మొదలైంది. దీంతో ఈశ్వరయ్య చిత్తూరు జిల్లాలోని మేర్లపాక గ్రామానికి చెందిన ఈశ్వరమ్మను పెళ్లాడి సంస్థను ఆమె చేతుల్లో పెట్టాడు. సునామీ రావడం, పలు కార్యక్రమాల కోసం విదేశీ నిధులు ఇబ్బడిముబ్మడిగా రావడంతో సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకుంది. అప్పుడే ఈశ్వరమ్మ మహిళా బ్యాంక్‌ను స్థాపించి గ్రామాల్లో పొదుపు సంఘాలను ఏర్పాటుచేసింది. మొదలైన అక్రమాలు క్యామెల్ మహిళా బ్యాంక్ ప్రత్యేకంగా ఇచ్చే పొదుపు రుణాల్లో భారీ కుంభకోణం చోటుచేసుకుంది. గ్రూపులకు రుణం ఇచ్చినట్లు రికార్డు చేసి అందులో సగం మాత్రమే దోచినట్లు సహకార సంఘ అధికారుల విచారణలో తేలింది. దీంతో వారు బాధిత సభ్యులు ఇచ్చిన వాంగ్మూలాలను ఆధారంగా చూపించి పోలీసులకు ఫిర్యాదు చే శా రు. ఇదిలా ఉండగా ఎస్బీఐ వారు ఇది వరకే మహిళా బ్యాంక్‌కు నోటీసులు ఇవ్వడంతో ఈశ్వర మ్మ కొంతమేర ఆస్తులను సదరు బ్యాంక్‌కు అ టాచ్ చేసినట్లు తెలిసింది. అయితే నాబార్డుకు ఎ లాంటి చెల్లింపులు జరగకపోవడంతో దాని అనుబంధ సంస్థ సహకార బ్యాంకు పోలీసులకు ఫి ర్యాదు చేసింది. ఇదిలాఉండగా ఈశ్వరమ్మ బ్యాం కుల నుంచి తీసుకున్న రుణం సొమ్ము చాలావరకు రియల్ఎస్టేట్ వ్యాపారంలో వెచ్చించి తీ వ్రంగా నష్టపోయినట్లు పలువురు చెబుతున్నారు. టీడీపీలో చేరి.. సూళ్లూరుపేటలో క్యామెల్ ఒక సేవా సంస్థ నుంచి రాజకీయ వ్యవస్థగా మారింది. 2009లో ఈశ్వరమ్మ ప్రజారాజ్యం పార్టీ తరఫున అసెంబ్లీ సీటు తెచ్చుకుని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చి 35 వేల ఓట్లు సాధించింది. ఆ తర్వాత కాలంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి వాకాటి నారాయణరెడ్డి గ్రూపులో స్థిరపడింది. ఆ పార్టీలో నుంచే సూళ్లూరుపేట పురపాలకానికి చైర్మన్ పదవికి పోటీ చేసి కౌన్సిలర్‌గా ఎన్నికైంది. ఆ తర్వాత నాటకీయ పరిణామాల మధ్య ఈశ్వరమ్మను పురపాలకానికి ఉపాధ్యక్షురాలైంది. తర్వాత ఆమె వాకాటితో కలసి టీడీపీలో చేరింది. వ్యక్తిగత మరుగుదొడ్ల సొమ్మును కూడా కాజేసినట్లు ఆరోపణలున్నాయి. కాగా ఆమెకు అనుకూలమైన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నప్పటికి అసలు నిందితురాలు పరారీలో ఉండటంతో కేసు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. -
ఎంత పనిచేశావు తల్లీ
వారిది అన్యోన్యమైన దాంపత్యం. ఇద్దరు బిడ్డలు. వారిని అపురూపంగా చూసుకుంటున్నారు. వ్యవసాయంలో వచ్చే అరకొర సంపాదనతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో బిడ్డలకు కొత్త దుస్తులు కొనివ్వాలన్న విషయంలో నెలకొన్న చిన్న వివాదం ఆ ఇంటిని చిన్నాభిన్నం చేసింది. క్షణికావేశంలో ఆ ఇల్లాలు తీసుకున్న నిర్ణయం ఇద్దరు చిన్నారులను బలి తీసుకుంది. ఆమె కూడా కొన ఊపిరితో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. హృదయ విదారకమైన ఈ సంఘటన సదుం మండలంలో శనివారం చోటుచేసుకుంది. - అత్తా, కోడలు మధ్య వివాదం - క్షణికావేశానికి గురైన కోడలు సదుం: కొత్త బట్టలు కొనుగోలు విషయం లో ఏర్పడిన వివాదంతో బిడ్డలకు విషమిచ్చిన తల్లి తానూ తినింది. ఎస్ఐ నాగరాజు కథనం మేరకు... స దుం మండలం కురవపల్లెకు చెందిన రైతు నాగేంద్రకు ఈశ్వరమ్మతో (22) వివాహం జరిగింది. వైష్ణవి (5), వర్షిణి (1) కుమార్తెలు ఉన్నారు. వైష్ణవి ఒకటో తరగతి చదువుతోంది. వర్షిణి అంగన్వాడీ పాఠశాలకు వెళుతోంది. వీరికి కొత్త దుస్తులు తీసివ్వాలని ఈశ్వరమ్మ అత్త వీరమ్మను శుక్రవారం కోరింది. చిన్నమ్మాయి వర్షిణికి దుస్తులు కొనిచ్చింది. మరోసారి వైష్ణవికి కొనిస్తానని వీరమ్మ పేర్కొంది. దీంతో వారి మధ్య వాగ్వా దం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈశ్వరమ్మ మనస్తాపం చెందింది. కుటుంబ సభ్యులు శనివారం పనులు చేసేందుకు వ్యవసాయ పొలానికి వెళ్లిన తర్వాత ఇద్దరు బిడ్డలకు విషపు గులికలు తినిపించిన ఈశ్వరమ్మ తానూ తీసుకుంది. ఉదయం 10 గంటల ప్రాంతంలో వీరమ్మ పొలం నుంచి ఇంటికి వచ్చింది. ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న కోడలు, మనువరాళ్లను గమనించింది. స్థానికుల సాయంతో సదుం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువచ్చింది. మార్గమధ్యంలోనే వర్షిణి మృతి చెందగా, వైద్యశాలలో వైష్ణవి మృతి చెందింది. -
చిత్తూరులో మహిళ మృతి
గంగవరం : చిత్తూరు జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ మహిళ మృతి చెందింది. పలమనేరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మదనపల్లె నుంచి చిత్తూరుకు బయలుదేరింది. అలాగే తిరుచ్చి నుంచి ఓ లారీ బొగ్గులోడుతో హైదరాబాద్‌కు వెళుతోంది. ఈ రెండు కల్లుపల్లె సమీపానికి రాగానే ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తమిళనాడు రాష్ట్రం తిరుచంగూడుకు చెందిన లారీ డ్రైవర్ ప్రభాకరన్ (45), బస్సులో ప్రయాణిస్తున్న హిందూపురానికి చెందిన ఈశ్వరమ్మ (55) అక్కడికక్కడే మృతి చెందారు. మరో 18మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు 108లో పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సీఐ రవికుమార్, ఎస్ఐలు జేసీబీల సహాయంతో బస్సు-లారీలను విడదీశారు. -
డెంగీతో విద్యార్థిని మృతి
అనంతపురం రూరల్ : అనంతపురం రూరల్ మండలం చియ్యేడుకు చెందిన వెంకటలక్ష్మి, వెంకటరాముడు దంపతుల కుమార్తె ఈశ్వరమ్మ(14) డెంగీతో శుక్రవారం మరణించింది. అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఆమె శనివారం నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. అనంతపురం ఆస్పత్రికి తరలించగా అక్కడ రెండ్రోజల పాటు చికిత్స చేసిన తరువాత ఏ జ్వరమో చెప్పకుండా డాక్టర్లు చేతులెత్తేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో హుటాహుటిన బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు డెంగీగా నిర్ధరించారన్నారు. అక్కడ చికిత్స పొందుతూ చివరకు మతి చెందినట్లు కన్నీటిపర్యంతమయ్యారు. అనంతపురం పెద్దాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మతి చెందిందని వారు ఆరోపించారు. విషయం తెలియగానే వైఎస్సార్ సీపీ యువజన విభాగం మండల కన్వీనర్ వరప్రసాద్‌రెడ్డి, సర్పంచ్ ఉజ్జినప్ప, కురుగుంట ఎంపీటీసీ సభ్యుడు కిరణ్‌కుమార్‌రెడ్డి గ్రామానికి చేరుకున్నారు. విద్యార్థిని మతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
ఇంటి యజమాని కన్నేశాడని..
ఇంట్లో అద్దెకు ఉంటున్న వివాహిత పై ఇంటి యజమాని కన్నేశాడు. ఆమె భర్త ఇంట్లో లేనప్పుడు అదును చూసి ఆమె పై అత్యాచారయత్నం చేశాడు. దీంతో కేకలు వేసి అక్కడి నుంచి పరారైన మహిళ అనంతరం.. ఇరుగు పొరుగుల సూటి పోటి మాటలు తట్టుకోలేక.. మనసిక వేదనకు గురై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులోని నల్లబండ బజార్ కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సుబ్బరత్నాలు, ఈశ్వరమ్మ(24) దంపతులు కూలి పనులు చేసుకుంటూ.. మొద్దు రాంరెడ్డి(60) ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న రాంరెడ్డి ఈశ్వరమ్మపై కన్నేశాడు. గురువారం ఆమె భర్త ఇంట్లో లేనప్పుడు లోపలికి వెళ్లి ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. ఆమె నిరాకరించడంతో.. అత్యాచార యత్నం చేశాడు. దీంతో ఆమె కేకలు వేసి పరుగులు తీసింది. అనంతరం గురువారం రాత్రి ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో స్థానికులు ఆమెను సూటి పోటి మాటలతో హింసించడంతో మనస్తాపానికి గురై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
రూ.వెయ్యి కోసం మహిళ హత్య!
పోలీసుల అదుపులో నిందితులు అనాథలుగా మిగిలిన ఇద్దరు చిన్నారులు పీలేరు: మండలంలోని కంచెంవారిపల్లెలో బుధవారం తెల్లవారుజామున ఒక మహిళను దుండగులు రూ.1000 కోసం హత్య చేశారు. పోలీసుల కథనం మేరకు.. పీలేరు మండలం తలపుల పంచాయతీ చిన్నయ్యగారిపల్లెకు చెందిన జె.మల్లయ్య కుమార్తె ఈశ్వరమ్మ(35)ను 15 ఏళ్ల క్రితం వేపులబైలు పంచాయతీ కంచెంవారిపల్లెకు చెందిన నరసింహులుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి కుమార్తె భార్గవి(14), కుమారుడు నరేంద్ర(5) ఉన్నారు. మూడేళ్ల క్రితం నరసింహులు మృతిచెందాడు. ఈశ్వరమ్మ కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటోంది. మంగళవారం వితంతు పెన్షన్ రూ.1000 తీసుకుంది. రాత్రి పిల్లలతో కలిసి భోజనం చేసి ఇంట్లో పడుకున్నారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈశ్వరమ్మ ఇంటిపక్కన శవమై పడి ఉండడాన్ని మరిది లక్ష్మినారాయణ గుర్తిం చాడు. ఈ విషయాన్ని ఇరుగు పొరుగు వారికి, బంధువులకు తెలిపాడు. విషయం తెలుసుకున్న పీలేరు ఎస్ఐ సురేష్‌బాబు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈశ్వరమ్మ ఐదేళ్లుగా స్థానిక ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో సహాయకురాలిగా పనిచేస్తోంది. అనాథలైన చిన్నారులు అనారోగ్యంతో తండ్రి మృతిచెందాడు. తల్లి హత్యకు గురికావడంతో పిల్లలు భార్గవి, నరేంద్ర అనాథలయ్యారు. భార్గవి స్థానిక జంగంపల్లె ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కుమారుడు నరేంద్ర అంగన్వాడీ కేంద్రానికి వె ళుతున్నాడు. తల్లికోసం చిన్నారులు విలపిస్తుంటే పలువురు కంటతడి పెట్టారు. అది పెన్షన్ డబ్బు పోలీసులు కంచెంవారిపల్లెకు చేరుకుని హత్యకు దారి తీసిన కారణాలపై గ్రామస్తులను ఆరా తీశారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు చంద్ర, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈశ్వరమ్మ మంగళవారం తీసుకున్న వితంతు పెన్షన్ రూ.1000ల కోసం గొంతునులిమి చంపేసినట్లు చంద్ర అంగీకరించినట్టు సమాచారం. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పీలేరు రూరల్ సీఐ మహేశ్వర్ తెలిపారు. -
ఇద్దరు కుమార్తెలు, తల్లి ఆత్మహత్య
గంగవరం: భర్త వేధింపులు తాళలేక చిత్తూరు జిల్లా గంగవరం వుండలం వడ్డిండ్లు గ్రామానికి చెందిన మహిళ ఈశ్వరమ్మ(28) తన ఇద్దరు కువూర్తెలతో బావిలో దూకి ఆత్మహత్య చేసుంది. వడ్డిండ్లు గ్రామానికి చెందిన జయురాం(32)తో కర్ణాటక రాష్ట్రం నంగిలికి సమీపంలోని జి.వూరేడుపల్లెకు చెందిన ఈశ్వరవ్ము(28)కు పదేళ్ల కిందట వివాహమైంది. కూలి పనులు చేసుకుని వారు జీవిస్తున్నారు. వారికి ఇద్దరు ఆడ పిల్లలు. ఇక వుగ బిడ్డలు పుట్టరనే నెపంతో రెండో పెళ్లి చేసుకునేందుకు భార్యతో జయురాం తరచూ గొడవ పడేవాడు. ఇలా ఈశ్వరవ్ము చెల్లెల్ని వివాహం చేసుకుంటానని ఒత్తిడి తెచ్చేవాడు. దీంతో ఆమెకు వురో వ్యక్తితో వివాహం చేశారు. వుంగళవారం కూడా భార్యపై జయరాం చేరుుచేసుకున్నాడు. దీంతో వునస్తాపానికి గురైన ఈశ్వరమ్మ ఇద్దరు బిడ్డలను బావిలోకి తోసి తానూ దూకి ఆత్మహత్య చేసుకుంది. ముగ్గురూ చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. -
డీఎస్సీ పరీక్షకు వెళ్తూ..
విశాఖపట్నం: డీఎస్సీ పరీక్ష రాసేందుకు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు చెట్టుకొమ్మ విరిగిపడటంతో ఒక మహిళ మృతి చెందింది. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా పాడేరు మండలంలో సోమవారం జరిగింది. వివరాలు.. ఈశ్వరమ్మ (28) తన భర్త సుబ్బారావుతో కలిసి డీఎస్సీ పరీక్ష రాసేందుకు వెళ్తోంది. మార్గ మధ్యలో పాడేరు మండలం మూలకుండమ్మ పాదాల మలుపు వద్దకు రాగానే చెట్టు కొమ్మ విరిగి వారు ప్రయాణిస్తున్న బైక్‌పై పడింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, భర్త తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ సుబ్బారావును మెరుగైన వైద్యం కోసం పాడేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. (పాడేరు) -
బంగారం కోసం కడతేర్చారు
ప్రవాసాంధ్ర వృద్ధురాలి దారుణ హత్య యలహంక : వృద్ధురాలిని హతమార్చి ఆమె శరీరంపై ఉన్న బంగారం, ఇంటిలోని విలువైన వస్తువులను ఎత్తుకెళ్లిన ఘటన యలహంక సమీపంలోని కామాక్షమ్మ లే ఔట్లో సంచలనం రేకెత్తించింది. యలహంక పోలీసుల సమాచారం మేరకు... ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా, పీలేరు నియోజకవర్గం పరిధిలో ఉన్న కోన గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ(75), ఆమె భర్త లక్ష్మినారాయణ కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరుకు వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. వీరికి ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరందరికీ పెళ్లిళ్లు కావడంతో యలహంకలోనే వేర్వేరు ఇళ్లలో వారు నివాసం ఉంటున్నారు. మూడేళ్ల క్రితం లక్ష్మినారాయణ మరణించాడు. అప్పటి నుంచి ఈశ్వరమ్మ ఒంటరిగానే ఉంటోంది. బుధవారం తెల్లవారుజామున ఇంటిలోకి దుండగులు చొరబడి ఈశ్వరమ్మను హత్య చేసి ఆమె చెవికి ఉన్న కమ్మలు, మెడలోని బంగారు చైన్, ఉంగరం, ఇంటిలో ఉన్న విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. ఉదయం విషయాన్ని గుర్తించిన స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని బెంగళూరు సీసీబీ అడిషనల్ కమిషనర్ హరిశేఖరన్, ఈశాన్య విభాగం డీసీపీ వికాస్కుమార్, పోలీసులు పరిశీలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
భూమా నాగిరెడ్డికి వైఎస్ జగన్ పరామర్శ
కర్నూలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా నంద్యాల వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని పరామర్శించారు. వైఎస్ జగన్ ఫోన్ చేసి నాగిరెడ్డిని ఓదార్చారు. భూమా నాగిరెడ్డి తల్లి భూమా ఈశ్వరమ్మ (80) సోమవారం ఉదయం హైదరాబాద్ లోని స్వగృహంలో మరణించారు. ఈశ్వరమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతుండేవారు. ఆమె భౌతికకాయాన్నిఅంత్యక్రియల నిమిత్తం ఆళ్లగడ్డ తరలిస్తున్నారు. కాగా ఇటీవల భూమా నాగిరెడ్డి సతీమణి శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారానికి వెళ్లి తిరిగి వస్తూ ఆమె ప్రమాదానికి గురయ్యారు. -
ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి మాతృ వియోగం
కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాల వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి భూమా ఈశ్వరమ్మ (80) సోమవారం ఉదయం హైదరాబాద్ లోని స్వగృహంలో మరణించారు. ఈశ్వరమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్నారు. కాగా ఆమె భౌతికకాయాన్ని ...అంత్యక్రియల నిమిత్తం ఆళ్లగడ్డ తరలిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇటీవల భూమా నాగిరెడ్డి సతీమణి శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారానికి వెళ్లి తిరిగి వస్తూ ఆమె ప్రమాదానికి గురయ్యారు.