చిత్తూరులో మహిళ మృతి | woman dies in chittor | Sakshi
Sakshi News home page

చిత్తూరులో మహిళ మృతి

Feb 23 2017 11:52 PM | Updated on Aug 13 2018 3:11 PM

చిత్తూరు జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ మహిళ మృతి చెందింది.

గంగవరం : చిత్తూరు జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ మహిళ మృతి చెందింది. పలమనేరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మదనపల్లె నుంచి చిత్తూరుకు బయలుదేరింది. అలాగే తిరుచ్చి నుంచి ఓ లారీ బొగ్గులోడుతో హైదరాబాద్‌కు వెళుతోంది. ఈ రెండు కల్లుపల్లె సమీపానికి రాగానే ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తమిళనాడు రాష్ట్రం తిరుచంగూడుకు చెందిన లారీ డ్రైవర్‌ ప్రభాకరన్‌ (45), బస్సులో ప్రయాణిస్తున్న హిందూపురానికి చెందిన ఈశ్వరమ్మ (55) అక్కడికక్కడే మృతి చెందారు. మరో 18మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు 108లో పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సీఐ రవికుమార్, ఎస్‌ఐలు జేసీబీల సహాయంతో బస్సు-లారీలను విడదీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement