కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాల వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి భూమా ఈశ్వరమ్మ (80) సోమవారం ఉదయం హైదరాబాద్ లోని స్వగృహంలో మరణించారు. ఈశ్వరమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్నారు. కాగా ఆమె భౌతికకాయాన్ని ...అంత్యక్రియల నిమిత్తం ఆళ్లగడ్డ తరలిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా ఇటీవల భూమా నాగిరెడ్డి సతీమణి శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారానికి వెళ్లి తిరిగి వస్తూ ఆమె ప్రమాదానికి గురయ్యారు.