nandyala MLA
-
ఏపీ హైకోర్టులో 'అల్లు అర్జున్'కు భారీ ఊరట
నంద్యాల కేసు విషయంలో ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌కు భారీ ఊరట లభించింది. ఈ కేసు విషయంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తుది తీర్పు వెల్లడించింది. అల్లు అర్జున్‌పై నంద్యాల పోలీసులు పెట్టిన ఎఫ్ఐఆర్ను కొట్టివేసింది. దీంతో బన్నీకి న్యాయం జరిగిందని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఏపీ అసెంబ్లీ ఎన్నికల(2024) సమయంలో అల్లు అర్జున్ తన స్నేహితుడు మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఆయన అభిమానులు భారీగా అక్కడకు చేరుకున్నారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా అనుమతి లేకుండా నంద్యాలలో జనసమీకరణ చేపట్టారంటూ కేసు నమోదు చేశారు. అయితే, దానిని కొట్టివేయాలంటూ అర్జున్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు, అల్లు అర్జున్ పటిషన్లను పరిశీలించిన కోర్టు తుది తీర్పు వెల్లడించింది. బన్నీకి ఊరట కల్పిస్తూ.. పోలీసుల పిటిషన్‌తో పాటు ఎఫ్ఐఆర్ను కొట్టివేసింది. -
అఖిలప్రియ రెడ్ బుక్ రాజ్యాంగం.. మహిళపై దాడి
సాక్షి, నంద్యాల: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్‌లో టీడీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. ఇప్పటికే పచ్చ మంద.. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. ఇక, తాజాగా నంద్యాల జిల్లాలో అఖిలప్రియ మద్దతుదారులు మహిళలపై భౌతిక దాడులు చేస్తున్నారు.ఆళ్లగడ్డలో రెడ్ బుక్ రాజ్యాంగంనంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. తాజాగా అఖిలప్రియ వర్గీయులు దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దొంగ రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించి కబ్జాలు చేస్తున్నారు. తాజాగా ఆళ్లగడ్డకు చెందిన విశ్వనాథం పెద్ద కొండయ్య స్థలాన్ని కబ్జాకు యత్నించారు. ఈ క్రమంలో అడ్డుకున్న కొండయ్య కూతురిపై పచ్చ మంద విరుచుకుపడింది. అఖిలప్రియ అనుచరుడు రవి చంద్రారెడ్డి ఆమెను అసభ్యపదజాలంతో తిడుతూ రెచ్చిపోయాడు. ఆమెపై దాడి చేయడంతో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. చేయి విరగడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి నుంచి కూటమి ప్రభుత్వం తమను కాపాడాలని వేడుకుంటున్నారు.నా టార్గెట్ వంద మంది: అఖిలప్రియకొన్ని రోజుల క్రితమే తనకు ఓ రెడ్ బుక్ ఉంది అంటూ టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ బెదిరింపులకు దిగారు. రానున్న రోజుల్లో ఆళ్లగడ్డలో తన వల్ల 100 మంది ఇబ్బంది పడుబోతున్నారని ఓపెన్‌గా చెప్పారు. వంద మందిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అంతేకాకుండా.. ఆళ్లగడ్డలో నేను ఎవరినీ ఇబ్బంది పెట్టను అని ఎప్పుడైనా చెప్పానా?. మేము అధికారంలోకి వస్తే తోలు తీస్తానని ముందే చెప్పాను అంటూ బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. నేనేం మంచి దాన్ని కాదు. నేనేమైనా మంచితనం చూపిస్తానని చెప్పానా?. నేను మంచి పద్ధతిలో పోతానని ఎవ్వరూ అనుకోకండి’ అంటూ కామెంట్స్ చేశారు. -
చెప్పలేని మాటల్లో దుర్భాషలాడుతూ.. మంత్రి ఫరూక్ పీఏ వీరంగం
నంద్యాల, సాక్షి: ‘‘లం..కొడకల్లారా..మీకు కళ్లు కనపడవా..ఒక్కొక్కడికి ఉందిరా.. ఎవరి ఆస్తో తెలియకుండానే ట్యాక్స్ వేస్త్రారా’’ అంటూ రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పీఏ అనిల్ నంద్యాల మునిసిపల్ అధికారులపై రెచ్చిపోయారు. నంద్యాలలోని మునిసిపల్ కార్యాలయానికి మంత్రి పీఏ అనిల్ కొంతమంది అనుచరులతో మంగళవారం వచ్చారు. వెంటనే రెవెన్యూ ఆఫీసర్ వెంకట కృష్ణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గులాం హుస్సేన్‌లను మునిసిపల్ చాంబర్‌కు పిలిపించారు. వారు చాంబర్లోకి అడుగుపెట్టగానే తాళం వేసి ఇష్టమొచ్చినట్లు తిట్టారు. గట్టిగా అరుస్తూ మీ అంతు తేలుస్తా.. ఉద్యోగాలు ఎలా చేస్తారో చూస్తా అంటూ బూతుపురాణం అందుకున్నారు. కమిషనర్ నిరంజన్‌రెడ్డి ఎదుటే సిబ్బందిని తిడుతున్నా ఆయన కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. నంద్యాలలోని పద్మావతినగర్‌లో మంత్రి ఫరూక్‌కు చెందిన స్థలం ఉంది. దీనికి సంబంధించి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్‌ను మునిసిపల్ సిబ్బంది వేరొకరి పేరు మీద వేశారు. విషయం తెలుసుకున్న పీఏ అనిల్ రెచ్చిపోయారు. మునిసినల్ చాంబర్‌కు తాళాలు వేసి అధికారులను చెడామడా తిట్టారు. గంట సేపు అటువైపు ఎవ్వరినీ రానివ్వలేదు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం మంత్రి పీఏ అనిల్ చేసిన రభసపై మునిసిపల్ కమిషనర్ నిరంజన్‌రెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా..‘అదేదో ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూ. నాకు పూర్తిగా తెలియదు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు. -
Allu Arjun Nandyala Photos: నంద్యాలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి (ఫొటోలు)
-
Allu Arjun At Nandyal: వైఎస్సార్సీపీ అభ్యర్థి కోసం ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్
ఇద్దరు వ్యక్తుల మధ్య చెదరని మమతకు శ్రీకారం స్నేహం.. చెలిమి బంధానికి మరేదీ సాటిరాదని ఎన్నెన్నో పురాణ కథలు ప్రబోధిస్తున్నాయి. అందుకే ఈ ప్రపంచంలో స్నేహానికి అత్యంత విలువ ఉంది. ఎన్నికల సమయంలో తన మిత్రుడి విజయం కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్నేహ బంధాన్ని పాటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నంద్యాల నియోజికవర్గంలో ఎన్నికల బరిలో నిల్చున్న శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి విజయం సాధించాలని అల్లు అర్జున్ కోరుకున్నారు.తాజాగా అల్లు అర్జున్ తన సతీమణి స్నేహా రెడ్డితో కలిసి నంద్యాల చేరుకున్నారు. వారికి పూలమాలలతో శిల్పా రవిచంద్రారెడ్డి దంపతులు ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ను చూసేందుకు ఆయన అభిమానులు శిల్పా రవి ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. 2019 ఎన్నికల్లో తొలిసారి నంద్యాల నుంచే శిల్పా రవిచంద్రారెడ్డి పోటీచేశారు. ఆ సమయంలో కూడా బన్ని తన మిత్రుడు విజయం సాధించాలని మద్ధతు తెలిపారు.శిల్పా రవిని ప్రజాసేవలో చూడటం తనకు చాలా గర్వంగా ఉందని బన్ని అప్పట్లో తెలిపారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మనంద రెడ్డిపై 35 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. మళ్లీ ఇప్పుడు కూడా శిల్పా రవి నంద్యాల నుంచే ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ క్రమంలో తన మిత్రుడిని గెలిపించాలని అల్లు అర్జున్ తన మద్ధతు తెలిపారు. శిల్పా రవిచంద్రారెడ్డి చేతిని పట్టుకుని తన అభిమానులకు చూపించారు.శిల్పా రవిచంద్రారెడ్డి సతీమణి నాగిని రెడ్డి, అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి ఇద్దరు మంచి స్నేహితులు. వారిద్దరూ క్లాస్‌మెట్స్ కూడా.. అనంతరం రవిచంద్రారెడ్డి, అల్లు అర్జున్ మంచి స్నేహితులు అయ్యారు. ఇరు కుటుంబాల్లో జరుగుతున్న శుభకార్యాల్లో కూడా వారు పాల్గొంటారు. స్నేహానికి అత్యంత విలువ ఇచ్చే వ్యక్తి అల్లు అర్జున్ అని గతంలో ఓ ఇంటర్వ్యూ ద్వార రవిచంద్రారెడ్డి తెలిపారు.అల్లు అర్జున్ ఏమన్నారంటే..'శిల్పా రవిచంద్రారెడ్డి నాకు గత 15 ఏళ్లుగా మంచి మిత్రుడు. రాజకీయాలకు ముందు ఇద్దరం రెగ్యులర్‌గా కలిసేవాళ్లం. ఎప్పుడైతే రవి పాలిటిక్స్‌లోకి వచ్చారో ఆ సమయం నుంచి మేము తక్కువగా కలిసే వాళ్లం. 2019లో రవిచంద్రారెడ్డి గెలుపు కోసం ఒక ట్వీట్ చేశాను. కానీ, నాకు అది చాలా తక్కువే అనిపించింది. రవి ఈ ఐదేళ్లలో చాలా కష్టపడ్డాడు. అందుకే నేనే నంద్యాలకు వచ్చాను. ఈ ఎన్నికల్లో రవి విజయం సాధించి ఇక్కడి ప్రజలకు మరిన్ని మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను.' అని బన్ని అన్నారు. View this post on Instagram A post shared by వై.యస్.ఆర్ కుటుంబం (@_ysrkutumbam)Grateful to the people of Nandyal for the warm reception. Thank you, @SilpaRaviReddy garu, for the hospitality. Wishing you the very best in the elections and beyond. You have my unwavering love and support pic.twitter.com/n34ra9qpMO— Allu Arjun (@alluarjun) May 11, 2024 -
అఖిలా.. ఇన్నాళ్లూ ఎక్కడికెళ్లావ్?
సాక్షి, నంద్యాల: అబ్దుల్ సలాం కుటుంబం ఈ నెల 3న ఆత్మహత్య చేసుకుంటే మాజీ మంత్రి అఖిలప్రియ మాత్రం 11వ తేదీ వచ్చి పరామర్శించారని, ఇన్నాళ్లూ ఆమె ఎక్కడికెళ్లారని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన పట్టణంలోని స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. ముస్లిం మైనార్టీలకు మొదటి నుంచీ శిల్పా కుటుంబం అండగా ఉంటోందన్నారు. మొన్నటి ఎన్నికల్లో 38 వేల మెజార్టీ వచ్చిందంటే ముస్లిం మైనార్టీలు తనకు అండగా నిలవడం వల్లే సాధ్యమైందన్నారు. అఖిలప్రియ శవ, హత్యా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సొంత తాత అయిన భూమా నారాయణరెడ్డిని విజయ డెయిరీ చైర్మన్ పదవి నుంచి దించడానికి ఇంటికి వెళ్లి చంపుతామని అఖిలప్రియ భర్త భార్గవరామ్, తమ్ముడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి బెదిరించలేదా అని నిలదీశారు. సొంత తాతనే మీ కుటుంబ సభ్యులపై కేసు పెట్టారంటే ఏం రాజకీయం చేస్తున్నారో అందరికీ అర్థమవుతోందన్నారు. ఒక్కసారైనా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేని అఖిలప్రియ శిల్పా కుటుంబంపై ఆరోపణలు చేయడం శోచనీయమని, తాను మొదటి సారి పోటీ చేసి 35వేల మెజార్టీతో గెలిస్తే ఆమె మాత్రం 38వేల మెజార్టీతో ఓడిపోయారని గుర్తు చేశారు. (24 గంటల్లోనే ఇద్దరూ అరెస్టు) ‘మీ నాన్న ప్రాణ స్నేహితుడైన ఏవీ సుబ్బారెడ్డిని హత్య చేయించడానికి కుట్ర పన్నారు. నంద్యాలలో మాజీ కౌన్సిలర్ జాకీర్‌హుసేన్, మరో 9మందిపై ఉప ఎన్నికలు ముగిసిన వెంటనే హత్యాయత్నం కేసు పెట్టి వేధించారు. ముస్లిం సోదరులకు అయ్యలూరు మెట్ట వద్ద మాజీ మంత్రి పట్టాలు ఇస్తే వాటిని రద్దు చేయించారు. ఉప ఎన్నిక సమయంలో బేస్మెంట్లు సైతం రాత్రికి రాత్రి తొలగించి ముస్లింలను ఇబ్బంది పెట్టారు. వీటిని ముస్లిం సోదరులు మరచిపోలేద’ని అన్నారు. తమ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో వివరంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని, మీ ఆస్తులు మాత్రం కాంట్రాక్టర్లు ఇచ్చిన పర్సెంటేజీలతో సంపాదించినవి కావా అని ప్రశ్నించారు. దళితుడైన న్యాయవాది సుబ్బరాయుడును టీడీపీ నాయకులే హత్య చేశారు కాబట్టి అఖిలప్రియ నోరు మెదపడం లేదన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు హబీబుల్లా, గన్నికరీం, మాజీ కౌన్సిలర్ జాకీర్‌హుసేన్ తదితరులు పాల్గొన్నారు. (నిన్ను చంపితేగాని చైర్మన్ పదవి రాదు: భూమా విఖ్యాత్‌రెడ్డి) -
టీడీపీ తీరు రాబందులను గుర్తుచేస్తోంది
నంద్యాల: అబ్దుల్ సలామ్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే దానిని టీడీపీ రాజకీయం చేయడం నీచం, దారుణమని కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం నంద్యాలలోని స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆత్మహత్య వ్యవహారంలో టీడీపీ నాయకుల హడావుడి, తాపత్రయం చూస్తుంటే రాబందులు గుర్తుకొస్తున్నాయన్నారు. సలామ్ కుటుంబం మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే స్పందించి ఐపీఎస్ అధికారులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారని, 24 గంటల్లోనే నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయించారని గుర్తు చేశారు. మృతుల కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేíÙయా కూడా ప్రకటించారన్నారు. సలామ్ కుటుంబానికి మొట్టమొదట ధైర్యం ఇచ్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగనేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటుంటే మరో పక్క చంద్రబాబు, అచ్చెన్నాయుడు తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రామచంద్రరావుతో బెయిల్ పిటిషన్ వేయించి డబుల్ గేమ్ ఆడుతున్నారని దుయ్యబట్టారు. అబ్దుల్ సలామ్ ఆత్మహత్య కేసులో బెయిల్ ఇప్పించడంపై ప్రజలకు చంద్రబాబు, అచ్చెం, లోకేష్‌లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత న్యాయవాది సుబ్బరాయుడును హత్య చేస్తే టీడీపీ నాయకులు ఎందుకు మాట్లాడలేదన్నారు. గుంటూరులో ముస్లిం యువకులు న్యాయమైన డిమాండ్లపై శాంతియుతంగా ప్లకార్డులు ప్రదర్శిస్తే వారిపై దేశద్రోహం కేసు పెట్టిన చరిత్ర చంద్రబాబుదని, దీన్ని ఎవరూ మరచిపోలేదని అన్నారు. -
‘మా అల్లుడికే టీడీపీ టికెట్’
సాక్షి, కర్నూలు : నంద్యాల టీడీపీలో వర్గ విభేదాలు రాజుకుంటున్నాయి. ఎంపీ ఎస్పీవై రెడ్డి నంద్యాల అసెంబ్లీ స్థానంపై కన్నేశారు. ఈ విషయంపై ఆయన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమకే నంద్యాల అసెంబ్లీ టికెట్ ఇస్తారని, తన అల్లుడు శ్రీధర్ రెడ్డికే టికెట్ అంటూ ధీమా వ్యక్తం చేశారు. మీడియా ముఖంగా తమ కుటుంబానికే టీడీపీ ఎమ్మెల్యే సీటు ఇస్తారని స్పష్టం చేశారు. నంద్యాలలో ఎవ్వరూ చెయ్యని మంచి పనులు చేస్తున్నాము కాబట్టి తమకే టికెట్ ఇస్తారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాల అసెంబ్లీపై సర్వే చేయిస్తారని, ఆ సర్వేలో తమ పేరు ఖచ్చితంగా వస్తుందన్నారు. -
భూమాకు తుది వీడ్కోలు
⇒ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ⇒ భౌతిక కాయానికి నివాళులర్పించిన నేతలు ⇒ కుటుంబ సభ్యులను ఓదార్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ⇒ అఖిలప్రియకు మంత్రి పదవి ఇవ్వాలని కార్యకర్తల నినాదాలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి సోమవారం ఆళ్లగడ్డలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వ హించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన నాయ కులు, వేలాదిమంది అభిమానుల మధ్య భూమా అంతిమయాత్ర సాగింది. ఆళ్లగడ్డ లోని శోభానాగిరెడ్డి ఘాట్ వద్దనే భూమా అంత్యక్రియలను ఆయన కుమారుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి నిర్వహించారు. ఆదివారం ఉద యం భూమా గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. సాయంత్రం నాలుగు గంటల సమయంలో భారీ జన సందోహం మధ్య భూమా పార్థివ దేహాన్ని ప్రత్యేక వాహనంపై ఉంచి వైపీపీఎం కళాశాల, పాత బస్టాండు మీదుగా శోభాఘాట్ వరకు అంతిమయాత్ర నిర్వహించారు. అనంతరం అక్కడే అంత్యక్రియలను అధికార లాంఛనా లతో పూర్తి చేశారు. ప్రత్యేక పోలీసులు గౌరవ వందనం సమర్పించి సంతాపసూచకంగా గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం జగత్‌విఖ్యాత్‌రెడ్డి తన తండ్రి చితికి నిప్పంటించారు. భూమా కుమార్తెలు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ, నాగ మౌనిక, కుటుంబసభ్యుల రోద నలతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది. భూమా కుటుంబానికి సీఎం భరోసా భూమా కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కుటుంబ సభ్యులతో కాసేపు ఏకాంతంగా చర్చించి ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చనిపోయే సమయానికి 24 గంటల ముందు భూమా విజయవాడలో తనను కలిశారని.. నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల అభివృద్ధి గురించి చర్చించారని తెలిపారు. అఖిలప్రియ ద్వారా ఆయన ఆశయాలను నెరవేరుస్తామని ప్రకటించారు. సీఎం మాట్లాడుతున్నప్పుడు కొందరు కార్యకర్తలు అఖిలప్రియకు మంత్రి పదవి ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. అయితే సీఎం స్పందించలేదు. నేతల నివాళి భూమా భౌతిక కాయానికి కేంద్ర మంత్రి సుజనా చౌదరి, శాసనమండలి చైర్మన్ చక్ర పాణి యాదవ్, స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుతో పాటు డిప్యూటీ సీఎంలు కె.ఇ.కృష్ణ మూర్తి, చిన్నరాజప్ప, మంత్రులు అచ్చెన్నా యుడు, పరిటాల సునీత, పీతల సుజాత, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, ఎంపీ జె.సి.దివా కర్రెడ్డితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఐజ య్య, సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, ఆది మూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, రాజ గోపాల్‌రెడ్డిలు భూమాకు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
కర్నూలు జిల్లా నేతలతో లోకేష్ సమావేశం
- నంద్యాల అసెంబ్లీ స్ధానంపై చర్చ నంద్యాల: కర్నూలు జిల్లా టీడీపీ నేతలతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశమయ్యారు. నంద్యాలలోని ఓ హోటల్లో సోమవారం ఉదయం నేతలతో భేటీ అయినట్టు సమాచారం. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి చెందినందున ఆ సీటును ఎవరికి కేటాయించాలన్న దానిపై చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, శిల్పా బ్రదర్స్, మాజీ మంత్రి ఫరూక్, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా నంద్యాల సీటును నాగిరెడ్డి మరో కుమార్తె నాగమౌనికకు గానీ, భూమా అన్న కుమారుడు బ్రహ్మానందరెడ్డికి గానీ కేటాయించాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. అయితే ప్రస్తుతం ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా అఖిల ప్రియకు మంత్రి వర్గంలో స్థానం కల్సించి, నంద్యాల ఎమ్మెల్యే స్థానాన్ని మాజీ మంత్రి శిల్పా మెహన్ రెడ్డికి గానీ, ఫరూక్ గానీ కేటాయించాలని మరికొందరు కోరుతున్నట్టు సమాచారం. -
భూమా నాగిరెడ్డి కన్నుమూత
- గుండెపోటుతో కుప్పకూలిన నంద్యాల ఎమ్మెల్యే సాక్షి ప్రతినిధి, కర్నూలు/ నంద్యాల: కర్నూలు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి (54)ఆదివారం తీవ్ర గుండెపోటుతో కన్నుమూశారు. ఉదయం ఆళ్లగడ్డ నివాసంలో అల్పాహారం తీసుకున్న భూమా 8.30 గంటల సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయనను కాపాడటానికి వైద్యులు రెండు గంటల పాటు శ్రమించినా ఫలితం లేకపోయింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఉదయం అమరావతిలో ఎమ్మెల్సీ ఎన్నికలపై నిర్వహించిన సమావేశంలో నంద్యాల, ఆళ్లగడ్డ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులతో కలసి భూమా పాల్గొన్నారు. భూమాకు మంత్రి పదవి అంశం సమావేశంలో చర్చకు వచ్చినట్టు, ఈ సందర్భంగా వాదోపవాదాలు చోటు చేసుకున్నట్టు తెలిసింది. అనంతరం అమరావతి నుంచి బయలుదేరి రాత్రి ఏడు గంటల సమయంలో ఆళ్లగడ్డకు చేరుకున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లతో మరోమారు భేటీ అయ్యారు. ఆ తర్వాత విశ్రాంతి తీసుకున్న భూమా ఆదివారం ఉదయం గుండెపోటుకు గురయ్యారు. కుటుంబసభ్యులు, కార్యకర్తలు వెంటనే స్థానిక డాక్టర్ రామలింగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం 9.30 గంటల సమయంలో నంద్యాలలోని సురక్ష ఎమర్జెన్సీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. డాక్టర్ రవికృష్ణ సారథ్యంలో క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ హరినాథరెడ్డి, డాక్టర్ మధుసూదనరావు, కర్నూలు నుంచి వచ్చిన కార్డియాలజిస్ట్ డాక్టర్ మహమ్మద్ అలీలు సుమారు రెండు గంటల పాటు భూమాను కాపాడేందుకు ప్రయత్నించారు. ఒకానొక సమయంలో ఆయన్ను హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు తరలించి వైద్యం అందించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. భూమా ఆరోగ్య పరిస్థితిపై చాలాసేపటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆస్పత్రి వద్ద స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. చివరకు భూమా మరణించినట్లు 11.30 గంటల సమయంలో వైద్యులతో కలసి భూమా బావమరిది, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రకటించారు. గుండె ఆగిపోవడంతో... గుండె పనిచేయడం ఆగిపోవడంతో (కార్డియాక్ అరెస్ట్) భూమా నాగిరెడ్డి మరణించారని డాక్టర్ హరినాథరెడ్డి తెలిపారు. భూమా హార్ట్‌బీట్ తీవ్రస్థాయిలో 250కి పైగా చేరిందని, బీపీ కూడా ఎక్కువై మెదడుకు రక్తప్రసారం నిలిచిపోయిందని చెప్పారు. దీని వల్ల ఆయనకు ఫిట్స్ వచ్చాయని, ఊపిరితిత్తులకు ట్యూబ్ ద్వారా ఆక్సిజన్‌ను పంపే ఏర్పాటుచేసి కొన ఊపిరితో తీసుకువచ్చారని తెలిపారు. వెంటనే వెంటిలేటర్‌పై పెట్టి ఇంజక్షన్లు వేసి తీవ్రంగా ప్రయత్నించినా భూమా గుండె స్పందించలేదని, దీంతో ఆయన మృతి చెందినట్లు నిర్ధారించామని తెలిపారు. ప్రముఖుల సంతాపం.. నివాళులు భూమా హఠాన్మరణంపై ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ శాసనమండలి చైర్మన్ ఎ.చక్రపాణి, ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య, బీజేపీ ఏపీ అధ్యక్షుడు కె. హరిబాబు, వామపక్ష పార్టీల నేతలు కె. నారాయణ, కె. రామకృష్ణ, పి. మధు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు, వైఎస్సార్సీపీ నేతలు వైఎస్ వివేకానందరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి తదితరులు భూమా భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సోమవారం జరిగే అంత్యక్రియలకు ఏపీ సీఎం చంద్రబాబు హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దుఃఖసాగరంలో కుటుంబసభ్యులు భూమా మరణించారని తెలియగానే ఆయన కుటుంబసభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. భూమాను చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు ఆస్పత్రికి తరలివచ్చారు. భూమా భౌతికకాయాన్ని నంద్యాల పార్టీ కార్యాలయంలో కొద్దిసేపు ఉంచిన తర్వాత ఆళ్లగడ్డకు తరలించారు. సోమవారం ఆళ్లగడ్డలో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఎస్వీ మోహన్‌రెడ్డి తెలిపారు. భూమా నేత్రాలను హైదరాబాద్‌లోని ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేశారు. నాగిరెడ్డికి ఇద్దరు కుమార్తెలు అఖిలప్రియ (ఆళ్లగడ్డ ఎమ్మెల్యే), మౌనిక, కుమారుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి ఉన్నారు. భార్య శోభా నాగిరెడ్డి మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. మూడుసార్లు ఎంపీ.. మూడుసార్లు ఎమ్మెల్యే భూమా బాలిరెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు 1964 జనవరి 8వ తేదీన భూమా జన్మించారు. బెంగళూరులో హోమియో వైద్యం చదువుతూ మధ్యలో ఆపేసి రాజకీయరంగ ప్రవేశం చేశారు. ముప్పై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. మూడుసార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. చివరిసారిగా 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన భూమా ఏడాది క్రితం కుమార్తెతో కలసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్ జగన్ సంతాపం సాక్షి, హైదరాబాద్: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. భూమా మరణ వార్త తెలియగానే ఆయన కుమార్తె, ఎమ్మెల్యే అఖిలప్రియకు జగన్ ఫోన్ చేశారు. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా ఫోన్లో అఖిలప్రియను పరామర్శించారు. -
డాక్టర్ అవ్వాలనుకున్న భూమా, తండ్రి హత్యతో..
-
డాక్టర్ అవ్వాలనుకున్న భూమా, తండ్రి హత్యతో..
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతితో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 53 ఏళ్లకే ఆయన గుండెపోటుకు గురై చనిపోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆయన వ్యక్తిగత జీవితం, రాజకీయ జీవితాలు పరిశీలిస్తే.. వ్యక్తిగత జీవితం.. భూమా నాగిరెడ్డి కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం కొత్తపల్లె అనే ఒక మారుమూల గ్రామంలో జన్మించారు. భూమా బాలిరెడ్డి , ఈశ్వరమ్మకు ఈయన చిన్న కుమారుడు. ఆ ప్రాంతంలో ఉన్న కుటుంబ కక్షల రాజకీయాల కారణంగా తన తండ్రి బాలిరెడ్డి ఆయనను సుదూర ప్రదేశములలో ఉంచి చదివించాలని కోరుకున్నారు. దాని ప్రకారమే నాగిరెడ్డిని తమిళనాడు లోని చెన్నైలో సీబీఎస్ఈకి అనుబంధంగా ఉన్న వెలంకన్ని ప్రైవేట్ పాఠశాలలో 10+2 చదివించారు. ఆ తరువాత, నాగిరెడ్డి వైద్య విద్యను అభ్యసించడానికి బెంగుళూరు వెళ్ళారు. కానీ వెంటనే తన తండ్రి హత్యకు గురి కావడంతో తిరిగి వచ్చేశారు. ఈ సంఘటన కారణంగా ఆయన జీవితం మొత్తం మారిపోయింది. రాయలసీమ ప్రాంతంలో కీలక నేతగా మారారు. సీనియర్ రాజకీయవేత్త మరియు మాజీ మంత్రి యస్.వి.సుబ్బారెడ్డి కుమార్తె శోభారాణితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. 2014లో భార్య శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రాజకీయ ప్రస్తానం.. కర్నూలు జిల్లాలో జనవరి 8, 1964న జన్మించిన భూమా నాగిరెడ్డి తొలిసారిగా 1984లో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తొలుత సొసైటీ ప్రెసిడెంట్‌గా పనిచేసిన ఆయన తర్వాత ఎంపీపీగా ఎన్నికయ్యారు. 1992లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మధ్యంతర ఎన్నికలలో ఎన్నికయ్యారు. కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉన్న ఆయన సోదరుడు భూమా శేఖర్‌రెడ్డి ఆకస్మిక మరణంతో భూమా ఈ స్థానానికి ఎంపికయ్యారు. 1996లో మధ్యంతర ఎన్నికలు జరుగుతున్న నంద్యాల లోకసభ నియోజకవర్గానికి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావుపై పోటీ చేసేందుకు టీడీపీ ఆయనను ఎంపిక చేయడంతో మరింత వెలుగులోకి వచ్చారు. భూమా నాగిరెడ్డి లోక్‌సభ సభ్యుడిగా మూడు సార్లు తన సేవలను అందించారు. తొలుత టీడీపీలో ఉన్న నాగిరెడ్డి అక్కడి నుంచి ఎంపీగా కూడా పోటీ చేశారు. తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరి అక్కడి నుంచి కూడా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైఎస్సార్సీపీ టికెట్‌పై భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఏప్రిల్ 24 న రోడ్డు ప్రమాదంలో భూమా సతీమణి శోభ మృతి చెందారు. శోభ మృతి తర్వాత భూమా నాగిరెడ్డి మానసికంగా కుంగిపోయారు. అనారోగ్యం కారణంగా ఆయనకు బైపాస్ సర్జరీ కూడా జరిగింది. 2016లో కూతురు అఖిలప్రియతో కలిసి భూమా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఏడాది నుంచి భూమా నాగిరెడ్డి ఆరోగ్యం సరిగా లేదు. గత వారం రోజులుగా భూమా అనారోగ్య కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిన్న విజయవాడలో భూమానాగిరెడ్డి చంద్రబాబును కలిశారు. భూమా నాగిరెడ్డి కూతురు అఖిలప్రియ ప్రస్తుతం ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. టీడీపీ తరపున భూమా నాగిరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఇటీవల చురుగ్గా పాల్గొన్నారు. శనివారం విజయవాడకు వెళ్ళి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి వివిధ అంశాలపై చర్చించారు. రాత్రి బయలుదేరి ఆళ్లగడ్డకు వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్పా చక్రపాణికి మద్దతు తెలుపుతున్నట్లు భూమా నాగిరెడ్డి శనివారం చంద్రబాబును కలిసి స్పష్టం చేశారు. తమ మధ్య ఉన్న అంతర్గత విభేదాల కారణంగా పార్టీకి నష్టం కలగకూడదన్న ఉద్దేశంతోనే శిల్పాకు మద్దతు తెలిపేందుకు భూమా నాగిరెడ్డి ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయనకు కేబినెట్ పదవి లభించలేదనే అసంతృప్తి మాత్రం అలాగే ఉండిపోయిందని చెబుతుంటారు. ఇటీవల తనకు మంత్రిపదవి ఇచ్చి కేబినెట్లోకి తీసుకుంటానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లు సమాచారం. దాని మేరకే ఈ మధ్య పలుమార్లు చర్చలు కూడా జరిపారంట. ఈలోగానే ఆయన అకాల మరణం చెందడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. -
భూమా నాగిరెడ్డి కన్నుమూత
-
భూమా నాగిరెడ్డికి తీవ్ర అస్వస్థత
-
భూమా నాగిరెడ్డికి తీవ్ర అస్వస్థత
కర్నూలు: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆళ్లగడ్డలోని ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి నంద్యాల ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు వచ్చిందని నాగిరెడ్డి అనుచరులు చెబుతున్నారు. స్మృహలేని స్థితిలో ఆయనను ఆస్పత్రికి తరలించారు. నాగిరెడ్డి అస్వస్థకు గురయ్యారన్న వార్త తెలియగానే ఆయన కుటుంబ సభ్యులు, మద్దతుదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నంద్యాల ఆస్పత్రి వద్దకు భారీ ఎత్తున జనం తరలివస్తున్నారు. నిన్ననే సీఎం చంద్రబాబుతో నాగిరెడ్డి భేటీ అయ్యారు. తన మద్దతుదారులతో కలిసి చంద్రబాబును కలిశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు, శిల్పా సోదరులతో విభేదాలు, మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రితో చర్చించారు. నాగిరెడ్డి అనారోగ్యంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఆయనను తరలించేందుకు అవసరమైతే హెలికాప్టర్ వాడాలని ఆదేశించారు. మరోవైపు అహొబిలంలో ఉన్న నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ హుటాహుటిన నంద్యాలకు బయలుదేరారు. -
ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అరెస్టు.. ఉద్రిక్తత
* ఐపీసీతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు * అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకే కేసు బనాయింపు నంద్యాల టౌన్: పీఏసీ చైర్మన్, వైఎస్సార్ సీపీ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని, తాకవద్దని తనను అవమానించారంటూ ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ డీఎస్సీ దేవదానం ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూమాపై సెక్షన్ 353, 188, 506 ఐపీసీతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నంద్యాల త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేశారు. అనంతరం పోలీసులు ఆయన్ను ఇంటివద్ద అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అసలేం జరిగింది... :ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ, పార్టీకి చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రమైన ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి వెయిటింగ్ స్టాల్లో కూర్చున్నారు. కొద్దిసేపు తర్వాత భూమా బయటకు వెళ్లడంతో అఖిలప్రియ పరిచయస్తులను పలకరిస్తూ ఉన్నారు. ఇంతలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుధాకర్‌రెడ్డి, డీఎస్పీ హరినాథరెడ్డి, ఎన్నికల జోనల్ అధికారి వెంకటేశం అక్కడికి చేరుకొని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటు వేయమని కోరగా, నాన్న వచ్చాక వెళ్తానని అఖిలప్రియ సమాధానం ఇచ్చారు. డీఎస్పీ కోపోద్రిక్తుడై వెయింటింగ్ స్టాల్లో కూర్చుంటే ఓటర్లను ప్రభావితం చేసినట్లేనని అనడంతో.. వీరిద్దరి మధ్యన వాగ్వాదం జరిగింది. దీంతో ఆమె పోలింగ్ కేంద్రం వెలుపలకు వెళ్లారు. భూమాపై కేసు నమోదుకు వ్యూహం.. అఖిలప్రియకు జరిగిన అవమానాన్ని తెలుసుకున్న భూమా పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న శిరివెళ్ల సీఐ ప్రభాకర్‌రెడ్డి, ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ దేవదానంలను నిలదీశారు. సీఐ ప్రభాకర్‌రెడ్డి మరి కొందరు పోలీస్ అధికారులు, రిటర్నింగ్ అధికారి సర్దిచెప్పడంతో ఆయన శాంతించారు. మరోవైపు ఎన్నికల, పోలీస్ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి భూమాపై కేసు నమోదు చేయడానికి వ్యూహం పన్నారు. అధికార పార్టీ నేతలు ప్రభుత్వ పెద్దల ద్వారా పోలీస్ అధికారులపై ఒత్తిడి తేవడంతో కేసు నమోదు అయ్యింది. అరెస్టు సం దర్భంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సా ర్సీపీ కార్యకర్తలు గట్టిగా ప్రతిఘటించారు. భూమా వ్యాఖ్యలకు కులం రంగు..: ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ దేవదానం ఫిర్యాదు మేరకు త్రీటౌన్ ఎస్ఐ సూర్యమౌళి భూ మాపై అట్రాసిటీ, నాన్‌బెయిలబుల్ కేసులను(ఎఫ్ఐఆర్ నెం.132/2015) నమోదు చేశారు. ‘డోంట్టచ్ మీ, నేను ప్రజాప్రతినిధిని’ అని మీడియా సాక్షిగా భూమా చేసిన వ్యాఖ్యలకు కులం రంగు పూశారు. -
'నన్ను దూషించి.. నాన్నపై తప్పుడు కేసు'
పోలీసులు తనను అకారణంగా దూషించి, తమను రెచ్చగొట్టి మరీ తన తండ్రిపై కేసు పెట్టారని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జరిగిన వివాదంలో నంద్యాల ఎమ్మెల్యే, తన తండ్రి భూమా నాగిరెడ్డిపై పోలీసులు కేసు బనాయించిన నేపథ్యంలో ఆమె మాట్లాడారు. అఖిలప్రియ ఏమన్నారో ఆమె మాటల్లోనే... ఓటు వేయడానికి నేను, నాన్నగారు కలిసి వెళ్లాం. నాన్నగారు చిన్న పనిమీద బయటకు వచ్చారు. క్యూ ఎక్కువగా ఉందని పది నిమిషాలు కూర్చోమని పోలీసులే చెప్పడంతో కూర్చున్నాం. నాన్న బయటకు వెళ్లగానే పోలీసులు ఒకేసారి డీఎస్పీ, ఏఎస్పీ వచ్చి.. వెంటనే నన్ను ఓటు వేసి వెళ్లిపొమ్మన్నారు నాన్న వస్తే ఇద్దరం కలిసి ఓటేసి వెళ్లిపోతాం అని చెప్పాను నేను ఓటర్లతో మాట్లాడిందీ లేదు, కదిలింది కూడా లేదు అయినా ఓటు వేయాల్సిందేనని బలవంతం చేశారు పది నిమిషాల్లో ఓటేసి వెళ్లిపోతానని చెప్పినా, వాళ్లు రూడ్‌గా మాట్లాడారు. టీడీపీ ఏజెంట్లు పోలీసుల దగ్గరకు వెళ్లి, మమ్మల్ని పంపేయాలని చెప్పడంతోనే పోలీసులు వచ్చారు పోలింగ్ కేంద్రం వద్ద నేను ఒక్కదాన్నే కూర్చున్నప్పుడు డీఎస్పీ నా దగ్గరకు వచ్చి రూడ్‌గా మాట్లాడారు. గౌరు చరిత ఎవరు, ఆమెకేం సంబంధమని కూడా ఆయన అన్నారు దాంతో నాన్న ఒక తండ్రిగానే రియాక్ట్ అయ్యారు, కూతురు ఒక్కరే ఉన్నప్పుడు అలా మాట్లాడతారా .. రూల్స్ చూపించండి అన్నారే తప్ప వాళ్లను తిట్టలేదు వీళ్లు ఏ కేసు పెట్టినా సిల్లీ రీజన్లకే పెడుతున్నారు. పోలీసులతో వాగ్వాదానికి, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి ఏమైనా సంబంధం ఉందా వాళ్లు అత్యుత్సాహం చూపించారు. గతంలో ఎలా చేశారో.. ఇప్పుడూ అలాగే చేస్తున్నారు అక్కడ పోలీసులు మాట్లాడినదానిపై మేం ఏమైనా చర్యలు తీసుకోగలమా అని చూస్తున్నాం. -
అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు: భూమా
కర్నూలు : ప్రజా ప్రతినిధులపై రౌడీషీట్ నమోదు చేస్తూ అధికార పార్టీ కక్ష సాధింపుకు పాల్పడుతోందని నంద్యాల వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని ఆయన మంగళవారమిక్కడ పేర్కొన్నారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని భూమా నాగిరెడ్డి స్పష్టం చేశారు. -
భూమా నాగిరెడ్డికి వైఎస్ జగన్ పరామర్శ
కర్నూలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా నంద్యాల వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని పరామర్శించారు. వైఎస్ జగన్ ఫోన్ చేసి నాగిరెడ్డిని ఓదార్చారు. భూమా నాగిరెడ్డి తల్లి భూమా ఈశ్వరమ్మ (80) సోమవారం ఉదయం హైదరాబాద్ లోని స్వగృహంలో మరణించారు. ఈశ్వరమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతుండేవారు. ఆమె భౌతికకాయాన్నిఅంత్యక్రియల నిమిత్తం ఆళ్లగడ్డ తరలిస్తున్నారు. కాగా ఇటీవల భూమా నాగిరెడ్డి సతీమణి శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారానికి వెళ్లి తిరిగి వస్తూ ఆమె ప్రమాదానికి గురయ్యారు. -
ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి మాతృ వియోగం
కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాల వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి భూమా ఈశ్వరమ్మ (80) సోమవారం ఉదయం హైదరాబాద్ లోని స్వగృహంలో మరణించారు. ఈశ్వరమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్నారు. కాగా ఆమె భౌతికకాయాన్ని ...అంత్యక్రియల నిమిత్తం ఆళ్లగడ్డ తరలిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇటీవల భూమా నాగిరెడ్డి సతీమణి శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారానికి వెళ్లి తిరిగి వస్తూ ఆమె ప్రమాదానికి గురయ్యారు. -
'భూమాపై రౌడీషీట్ ఓపెన్ చేయటం అమానుషం'
కర్నూలు : నంద్యాల వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై రౌడీషీట్ ఓపెన్ చేయటం అమానుషమని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ టీడీపీ నేతలు, పోలీసులు కలిసి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అక్రమ కేసులు ఎత్తివేయాలని, లేకుంటే న్యాయ పోరాటానికైనా సిద్ధమేనని ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. భూమా నాగిరెడ్డిపై పోలీసులు రెండు హత్యాయత్నం కేసులు, ఒక అట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.