ఏపీ హైకోర్టులో 'అల్లు అర్జున్‌'కు భారీ ఊరట | Allu Arjun Gets Big Relief From Andhra Pradesh High Court In Nandyal Code Of Conduct Case | Sakshi
Sakshi News home page

Allu Arjun Nandyal Case: ఏపీ హైకోర్టులో 'అల్లు అర్జున్‌'కు భారీ ఊరట

Published Wed, Nov 6 2024 11:28 AM | Last Updated on Wed, Nov 6 2024 12:52 PM

AP High Court Big Relief To Allu Arjun In Nandyal Case

నంద్యాల కేసు విషయంలో ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌కు భారీ ఊరట లభించింది. ఈ కేసు విషయంలో తాజాగా ఆంధ్ర‌ప్రదేశ్ హైకోర్టు తుది తీర్పు వెల్లడించింది. అల్లు అర్జున్‌పై నంద్యాల పోలీసులు పెట్టిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది. దీంతో బన్నీకి న్యాయం జరిగిందని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల(2024) సమయంలో అల్లు అర్జున్‌ తన స్నేహితుడు మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఆయన అభిమానులు భారీగా అక్కడకు చేరుకున్నారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.  ఎన్నికల సమయంలో సెక్షన్‌ 144, పోలీస్‌ యాక్ట్‌ 30 అమల్లో ఉండగా అనుమతి లేకుండా నంద్యాలలో జనసమీకరణ చేపట్టారంటూ  కేసు నమోదు చేశారు.  అయితే, దానిని కొట్టివేయాలంటూ అర్జున్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి పిటిష‌న్ దాఖలు చేశారు. పోలీసులు, అల్లు అర్జున్‌ పటిషన్లను పరిశీలించిన కోర్టు తుది తీర్పు వెల్లడించింది. బన్నీకి ఊరట కల్పిస్తూ.. పోలీసుల పిటిషన్‌తో పాటు ఎఫ్‌ఐఆర్‌ను  కొట్టివేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement