ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌పై నమోదైన కేసుకు సంబంధించి నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల(2024) సమయంలో తనపై నంద్యాలలో నమోదైన కేసును క్వాష్ చేయాలని ఆయన కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా అనుమతి లేకుండా నంద్యాలలో జనసమీకరణ చేపట్టారంటూ అల్లు అర్జున్‌పై గతంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, దానిని కొట్టివేయాలంటూ అర్జున్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
అల్లు అర్జున్ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన నివేదికను కూడా కోర్టు పరిశీలించింది. అయితే నవంబరు 6న తుది తీర్పు ఇవ్వనున్నట్లు ధర్మాసనం ప్రకటించడంతో ఆయన ఆభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తిరుమలో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి
బుధవారం తెల్లవారుజామున బన్నీ సతీమణి స్నేహరెడ్డి తిరుమల చేరుకున్నారు. ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామి వారిని ఆమె దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పురోహితుల నుంచి వేదాశీర్వచనం పొందారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే, ఆమెతో పాటుగా అల్లు అర్జున్ లేరని తెలుస్తోంది. మరో నెలరోజుల్లో పుష్ప విడుదల కానున్నండంతో ఆయన సినిమా షెడ్యూల్ విషయంలో బిజీగా ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment