Nandyala Police
-
నేడు అల్లు అర్జున్ కేసు తుది తీర్పు.. తిరుమలలో సతీమణి స్నేహారెడ్డి
ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌పై నమోదైన కేసుకు సంబంధించి నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల(2024) సమయంలో తనపై నంద్యాలలో నమోదైన కేసును క్వాష్ చేయాలని ఆయన కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా అనుమతి లేకుండా నంద్యాలలో జనసమీకరణ చేపట్టారంటూ అల్లు అర్జున్‌పై గతంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, దానిని కొట్టివేయాలంటూ అర్జున్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.అల్లు అర్జున్ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన నివేదికను కూడా కోర్టు పరిశీలించింది. అయితే నవంబరు 6న తుది తీర్పు ఇవ్వనున్నట్లు ధర్మాసనం ప్రకటించడంతో ఆయన ఆభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.తిరుమలో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డిబుధవారం తెల్లవారుజామున బన్నీ సతీమణి స్నేహరెడ్డి తిరుమల చేరుకున్నారు. ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామి వారిని ఆమె దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పురోహితుల నుంచి వేదాశీర్వచనం పొందారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే, ఆమెతో పాటుగా అల్లు అర్జున్ లేరని తెలుస్తోంది. మరో నెలరోజుల్లో పుష్ప విడుదల కానున్నండంతో ఆయన సినిమా షెడ్యూల్ విషయంలో బిజీగా ఉన్నట్లు సమాచారం. -
పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ గూండాగిరీ
ఆళ్లగడ్డ: అధికారం అండ చూసుకుని టీడీపీ శ్రేణులు పేట్రేగిపోతున్నాయి. పోలీసులు, పోలీస్స్టేషన్లన్నా లెక్కే లేకుండా పోయింది. పోలీస్‌స్టేషన్‌లో ఉన్న నవ దంపతులపై సాక్షాత్తు సీఐ ఎదురుగానే దాడికి దిగారు. ప్రేమికుడిని బయటకు లాక్కొచ్చి చితకబాదారు. పోలీసుల సమక్షంలోనే ఇష్టమొచ్చినట్లు కొట్టారు. ఈ ఘటన శనివారం రాత్రి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. మండల కేంద్రం చాగలమర్రికి చెందిన సాయి అనే యువతి, వైఎస్సార్ జిల్లా మైదుకూరు పట్టణానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.పెళ్లి చేసుకుంటామని కోరగా, యువతి కుటుంబ సభ్యులు అడ్డు చెప్పారు. ఈ క్రమంలో వారం క్రితం ఇద్దరూ ఇంట్లో చెప్పకుండా బయటకొచ్చి పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తమ కుటుంబ సభ్యుల నుంచి తనకు, తన భర్తకు ప్రాణహాని ఉందని రెండు రోజుల క్రితం యువతి చాగలమర్రి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించింది. అక్కడి ఎస్ఐ.. ఇరు కుటుంబాల వారిని పిలిపించి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో సీఐ వద్దకు వెళ్లి మాట్లాడుకోవాలని సూచించారు. దీంతో శనివారం మధ్యాహ్నం నవ దంపతులు స్థానిక సర్కిల్ కార్యాలయం వద్దకు వచ్చారు.యువతి కుటుంబ సభ్యులను పిలిపించి సీఐ మాట్లాడారు. కుటుంబ సభ్యుల వెంట వెళ్లనని, భర్త వెంటే ఉంటానని యువతి తెగేసి చెప్పింది. ఇద్దరూ మేజర్లు కావడంతో వారి ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకునే హక్కు ఉందని, వారికి ఎటువంటి హాని తల పెట్టవద్దని సీఐ చెప్పారు. దీంతో యువతి సోదరుడు పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకుని అక్కడున్న వారికి విషయం చెప్పాడు. రెండు కార్లలో మనుషులను వెంటబెట్టుకుని సర్కిల్ కార్యాలయం చేరుకున్నాడు.వచ్చీ రాగానే టీడీపీ కార్యకర్తలంతా పోలీసులు చూస్తుండగానే యువకుడిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దెబ్బలు తట్టుకోలేక యువకుడు సీఐ గదిలోకి వెళ్లి దాక్కున్నప్పటికీ, బయటకు ఈడ్చుకు వచ్చి కొట్టారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ లెక్క చేయలేదు. అక్కడి పరిస్థితి చూసి.. యువకుడికి తోడుగా వచ్చిన బంధువులు, స్నేహితులు రోడ్డుపైకి పరుగులు తీసి చీకట్లో దాక్కున్నారు. ఫైర్ ఓపెన్ చేసేందుకు యత్నించిన సీఐ ప్రేమికులపై దాడి చేస్తున్న టీడీపీ శ్రేణులను పోలీసులు, సీఐ అడ్డుకుంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు ఏమాత్రం లెక్క చేయలేదు. పోలీసులపై తిరగబడే పరిస్థితి రావడంతో సీఐ హనుమంత నాయక్ ఫైర్ ఓపెన్ చేస్తానని రివాల్వర్ గురిపెట్టి హెచ్చరించారు. దీంతో వెనక్కు తగ్గిన వారు అక్కడి నుంచి బయటకు వచ్చారు. వారు వచ్చిన కార్ల దగ్గర నిల్చొని ‘నువ్వు మా కార్యాలయం దగ్గరకు వస్తావు కదా.. అక్కడికి రా.. అప్పుడు నీ కథ ఉంటుంది’ అని బహిరంగంగా సీఐ వైపు వేలు చూపిస్తూ »ñబెదిరించినట్లు తెలిసింది.ఈ నేపథ్యంలో నవ దంపతులను పోలీస్ వాహనంలో అక్కడి నుంచి తరలించారు. మనస్తాపానికి గురైన సీఐ, ఇతర అధికారులు విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. సీసీ కెమెరాల్లోని పుటేజీ తెప్పించుకుని పరిశీలించిన ఎస్పీ.. విషయాన్ని రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై సీఐ మాట్లాడుతూ.. ఇరు కుటుంబాలను కూర్చోబెట్టి కౌన్సెలింగ్ ఇస్తుండగా, ఇరు వర్గాలు ఘర్షణ పడటంతో అందరినీ అరిచి అక్కడి నుంచి పంపించామన్నారు. -
ఏసీబీ జడ్జిపై పోస్టు పెట్టిన వ్యక్తి అరెస్ట్
సాక్షి, నంద్యాల: స్కిల్ స్కామ్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. సోషల్ మీడియాలో యెల్లో బ్యాచ్ అడ్డగోలుగా రెచ్చిపోయింది. ఆయనకు సంబంధించి పలు పిటిషన్లపై దర్యాప్తు చేపట్టిన న్యాయమూర్తులపైనా అనుచిత పోస్టులు చేస్తూ పైశాచిక ఆనందం పొందారు. అయితే దర్యాప్తు క్రమంలో ఇందులో బాబు మద్దతుదారుల కంటే టీడీపీ నేతల పాత్రే ఎక్కువుందని తేటతెల్లమవుతోంది. తాజాగా ఈ వ్యవహారంలో ఓ టీడీపీ నేత అరెస్ట్ అయ్యారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడికి రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు జడ్జిని అవమానిస్తూ పోస్టులు పెట్టాడు ఓ వ్యక్తి. అయితే అతన్ని ట్రేస్ చేసిన పోలీసులు.. ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి టీడీపీ సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ముల్లా ఖాజా హుస్సేన్‌గా ధృవీకరించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. ఓ ప్రైవేట్‌కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు ఖాజా హుస్సేన్. ఈ క్రమంలో.. విజయవాడ ఏసీబీ న్యాయమూర్తి హిమబిందును టార్గెట్ చేసి సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేశాడు. టీడీపీ సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి హోదాలోనే పోస్టులు చేసినట్లు అంగీకరించాడతను. అరెస్ట్ చేసిన నంద్యాల పోలీసులు.. ఇవాళ కోర్టులో హాజరుపరిచే ఛాన్స్ ఉంది. మరోవైపు జడ్జిలపై అనుచిత పోస్టులు, ట్రోలింగ్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్ వేసింది ఏపీ హైకోర్టులో. ప్రభుత్వం తరపున ఏపీ శ్రీరామ్ ‘‘ఉద్దేశపూర్వక క్యాంపెయిన్ జరిగిందని.. జడ్జిలను, వాళ్ల కుటుంబ సభ్యులనూ వదలకుండా ట్రోలింగ్ చేశారని, ఈ క్రమంలోనే అనుచిత పోస్టులు పెట్టార’ని వాదించారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్టులు చేసిన సదరు 26 మంది అకౌంట్లను పరిశీలించి.. నోటీసులు జారీ చేయాలని ఏపీ డీజీపీకి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. బుద్దా వెంకన్నతో పాటు సోషల్ మీడియా పేజీల ముసుగులో ఉన్న టీడీపీ నేతలకు నోటీసులు జారీ కానున్నాయి. అంతకు ముందు రాష్ట్రపతి భవన్ సైతం జడ్జిలపై అనుచిత కామెంట్ల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి.. కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
A1 అఖిలప్రియకు బెయిల్ కాదు.. జైలే
సాక్షి, నంద్యాల: టిడిపి నేత మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కు కోర్టులో చుక్కెదురయింది. ఆమె బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ రిమాండ్ కు ఆదేశించింది నంద్యాల కోర్టు. నంద్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టులో భూమా అఖిల ప్రియను ఆమె భర్త భార్గవ్ రామ్ ను మరో ఇద్దరిని హాజరు పరిచారు పోలీసులు. ఈ సందర్భంగా తనకు బెయిల్ ఇవ్వాలంటూ అఖిలప్రియ, ఆమె భర్త JFCM ఇంచార్జ్ జడ్జి ఆదినారాయణకు విన్నవించుకున్నారు. అయితే అఖిలప్రియ బెయిల్ ను తిరస్కరించిన కోర్టు.. ఆమెకు, ఆమె భర్త భార్గవ్ రామ్ కు మరో ఇద్దరికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 30 వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో మాజి మంత్రి అఖిలప్రియను కర్నూలు జైలుకు తరలించారు పోలీసులు. అసలేం జరిగిందంటే టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డిపై ఆ పార్టీకే చెందిన భూమా అఖిలప్రియ వర్గీయులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం, ఘటనపై కేసు నమోదు చేసిన నంద్యాల పోలీసులు.. ప్రాథమిక దర్యాప్తు అనంతరం భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్, ఆమె అనుచరులను అరెస్ట్ చేశారు. (చదవండి: ఆళ్లగడ్డలో తన్నుకున్న తెలుగుదేశం నేతలు) ఉదయం ఏం జరిగిందంటే ఈ దాడి ఘటన కేసులో నలుగురు నిందితులను నంద్యాల పోలీసులు.. కోర్టులో హాజరుపరిచారు. కాగా, ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో పోలీసుల.. 11 మందిపై కేసులు నమోదు చేయగా నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. (చదవండి : అఖిలను కన్న బిడ్డలా పెంచితే మా నాన్నను చంపేందుకు ప్రయత్నించింది: జశ్వంతి) ఈ నలుగురిలో భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్, అఖిలప్రియ పీఏ మోహన్, ఆమె అనుచరుడు సాయి ఉన్నారు. ఇక, పరారీలో ఉన్న మరో ఏడుగురి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో పోలీసులు ఐపీసీ 307, 120B, 324, రెడ్ విత్ 34సెక్షన్ కింద భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ సహా నిందితులపై కేసులు నమోదు చేశారు. నిందితులు వీరే.. - భూమా అఖిల ప్రియా.. A1 - అఖిల ప్రియా అనుచరుడు సాయి.. A4 - అఖిల ప్రియా పిఏ మోహన్.. A7 - మద్దురూ భార్గవ్ రామ్.. A11. -
వారు సిమి కార్యకర్తలు కాదు, దొంగల ముఠా!
కర్నూలు: నంద్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆరుగురు అనుమానితులు మధ్యప్రదేశ్‌కు చెందిన దొంగల ముఠాగా గుర్తించారు. తొలుత వారు సిమీ కార్యకర్తలని ప్రచారం జరిగింది. అయితే, పట్టుబడింది మధ్యప్రదేశ్‌కు చెందిన అంతరాష్ట్ర దొంగల ముఠాగా పోలీసులు తేల్చేయడంతో ఉత్కంఠకు తెరపడింది. నల్లగొండ జిల్లాలో ఎన్కౌంటర్ నేపథ్యంలో సిమీ ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరుగురు దొంగలను సిమి కార్యకర్తలన్న అనుమానంతో తిరుపతి పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేయగా, వారు పరారయ్యారు. దీంతో వైఎస్సార్ కడప జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. వారి కళ్లు కూడా కప్పేయడంతో సమాచారం నంద్యాల పోలీసులకు చేరింది. దాంతో నంద్యాల పోలీసులు అన్ని వాహనాలను క్షుణంగా తనిఖీలు చేయడం ప్రారంభించారు. దీంతో ఎట్టకేలకు సోమవారం మధ్యాహ్నం ఆరుగురు సభ్యుల దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని బండి ఆత్మకూరు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నట్లు సమాచారం. ఈ ముఠా నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో పలు దొంగతనాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. -
కావ్.. కావ్.. ఖాకీ