సాక్షి, నంద్యాల: టిడిపి నేత మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కు కోర్టులో చుక్కెదురయింది. ఆమె బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ రిమాండ్ కు ఆదేశించింది నంద్యాల కోర్టు. నంద్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టులో భూమా అఖిల ప్రియను ఆమె భర్త భార్గవ్ రామ్ ను మరో ఇద్దరిని హాజరు పరిచారు పోలీసులు. ఈ సందర్భంగా తనకు బెయిల్ ఇవ్వాలంటూ అఖిలప్రియ, ఆమె భర్త JFCM ఇంచార్జ్ జడ్జి ఆదినారాయణకు విన్నవించుకున్నారు.
అయితే అఖిలప్రియ బెయిల్ ను తిరస్కరించిన కోర్టు.. ఆమెకు, ఆమె భర్త భార్గవ్ రామ్ కు మరో ఇద్దరికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 30 వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో మాజి మంత్రి అఖిలప్రియను కర్నూలు జైలుకు తరలించారు పోలీసులు.
అసలేం జరిగిందంటే
టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డిపై ఆ పార్టీకే చెందిన భూమా అఖిలప్రియ వర్గీయులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం, ఘటనపై కేసు నమోదు చేసిన నంద్యాల పోలీసులు.. ప్రాథమిక దర్యాప్తు అనంతరం భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్, ఆమె అనుచరులను అరెస్ట్ చేశారు.
(చదవండి: ఆళ్లగడ్డలో తన్నుకున్న తెలుగుదేశం నేతలు)
ఉదయం ఏం జరిగిందంటే
ఈ దాడి ఘటన కేసులో నలుగురు నిందితులను నంద్యాల పోలీసులు.. కోర్టులో హాజరుపరిచారు. కాగా, ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో పోలీసుల.. 11 మందిపై కేసులు నమోదు చేయగా నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.
(చదవండి : అఖిలను కన్న బిడ్డలా పెంచితే మా నాన్నను చంపేందుకు ప్రయత్నించింది: జశ్వంతి)
ఈ నలుగురిలో భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్, అఖిలప్రియ పీఏ మోహన్, ఆమె అనుచరుడు సాయి ఉన్నారు. ఇక, పరారీలో ఉన్న మరో ఏడుగురి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో పోలీసులు ఐపీసీ 307, 120B, 324, రెడ్ విత్ 34సెక్షన్ కింద భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ సహా నిందితులపై కేసులు నమోదు చేశారు.
నిందితులు వీరే..
- భూమా అఖిల ప్రియా.. A1
- అఖిల ప్రియా అనుచరుడు సాయి.. A4
- అఖిల ప్రియా పిఏ మోహన్.. A7
- మద్దురూ భార్గవ్ రామ్.. A11.
Comments
Please login to add a commentAdd a comment