
యువ నటి శ్రీలీల(sreeleela) నిస్సందేహంగా భారతీయ సినీరంగంలో తదుపరి పెద్ద స్టార్ కానుంది అంటున్నాయి సినీజోస్యాలు. తన అందం, ఆకర్షణ, ఎలక్ట్రిఫైయింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ అసాధారణమైన ఇతర నైపుణ్యాలతో, ఆమె దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరిగా మారింది. ఇప్పుడు కార్తీక్ ఆర్యన్ సరసన బాలీవుడ్‌లో అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతోంది. పుష్ప2లోని కిస్సిక్ పాటతో ఆమె ఉత్తరాది ప్రేక్షకుల్ని ఒక ఊపు ఊపారు. నిజానికి పుష్ప తొలి భాగంలో సమంత ఐటమ్ సాంగ్ హిట్ అయినా కూడా సమంతకు రానంత పాప్యురారిటీ శ్రీలీలకు వచ్చింది. ఆ పాట ఆమె హిందీ చిత్రసీమలోకి రెడ్‌కార్పెట్ వేసింది. దాంతో సౌత్‌లోనూ ఆమె క్రేజ్ తారాస్థాయికి చేరుకుంది, ఇక ఆమె బాలీవుడ్‌లో మెరిసిపోతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టే...శ్రీలీల తాజా హిందీ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
ఇటీవల, ఈ చిత్రం సెట్ నుంచి అనేక వీడియోలు ఫొటోలు ఆనలైన్ లో ప్రత్యక్షమయ్యాయి. మరుసటి తక్షణమే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎరుపు రంగులో వదులుగా ఉండే దుస్తులు ధరించిన శ్రీలీల లుక్ ని, ఆమె రూపాన్ని మెచ్చుకుంటూ ఆమె పాత్ర గురించి ఊహాగానాలు చేస్తూ, అభిమానులు వీటిని షేర్ చేస్తున్నారు. ఓ రకంగా ఈ చిత్రానికి దక్షిణాదిలో విపరీతమైన టాక్ రావడానికి కారణం శ్రీలీలే అని చెప్పాలి.
అందం, ప్రతిభ ఆత్మవిశ్వాసాల కలయికగా శ్రీలీల బాలీవుడ్‌లో రంగప్రవేశం చేస్తోంది. ఖచ్చితంగా కొన్నేళ్ల పాటు భారతీయ సినీరంగాన్ని ఊపే సత్తా ఆమెకు ఉందని బాలీవుడ్ మీడియా ఊహాగానాలు చేస్తోంది. ఈ సందర్భంగా శ్రీలీలను ఈ స్థాయిలో నిలబెట్టిన కొన్ని ముఖ్యమైను అంశాలను పరిశీలించాలి..
కన్నడ చిత్రం కిస్ (2019)తో శ్రీలీల మరపురాని అరంగేట్రం చేసింది, ఆమె సహజమైన సౌందర్యం, ప్రకాశవంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్ర విజయం ఆమెకు కొత్త అవార్డులను సంపాదించిపెట్టింది, ఇది భారతీయ చలనచిత్రంలో ఆమె మంచి జర్నీకి నాంది పలికింది.
రెండో విషయంగా చెప్పాల్సి వస్తే ఆమె నృత్య,నటనా ప్రతిభ గురించే చెప్పాలి. ధమాకా (2022)లో, జింతాక్ పాటలో చురుకైన రిథమ్, గ్రేస్ ఎక్స్‌ప్రెషన్స్ లతో శ్రీలీల తెలుగు సినిమాకి డాన్స్ డార్లింగ్‌గా మారింది.
పెళ్లి సందడి (2021)లో సాంప్రదాయంగా కనపడి, భగవంత్ కేసరి (2023)లో యాక్షన్ సీన్స్ వరకు శ్రీలీల తనలోని షేడ్స్ స్కిల్స్ బాగా పండించింది. స్కంద (2023), ఆదికేశవ (2023), గుంటూరు కారం (2024) చిత్రాల జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న పాత్రలతో తన స్కిల్స్‌కు సానబట్టింది.
భాషపై పట్టు కూడా శ్రీలలకు అచ్చొచ్చిన మరో అంశం. కన్నడ, తెలుగు, తమిళం ఇంగ్లీషు భాషలపై ఆమెకున్న పట్టు ఆమెని విభిన్న భాషా చిత్రాల్లో, భిన్న పరిశ్రమల్లో బలంగా నిలబెట్టింది. వివిధ భాషా నేపథ్యాలకు చెందిన అభిమానులతో ఆమె సులభంగా మమేకం కాగలుగుతోంది. అంతర్జాతీయ ట్రెండ్స్‌ను ఒడిసిపట్టగల శ్రీలీల ఫ్యాషన్ ఐకాన్‌గా కూడా ఆకట్టుకోగలుగుతోంది. ఆమె వార్డ్‌రోబ్ ఫ్యాషన్ ప్రియుల ఫేవరెట్ గా పేరొందింది.
అధిక ఫ్యాషన్‌తో యువత కు మరింత దగ్గర కాగలుగుతోంది. ఆమె ఫ్యాషన్ లుక్స్ ఆమెను మ్యాగజైన్‌లపై, వెబ్‌సైట్స్‌లో తళుక్కుమనేలా చేస్తున్నాయి. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ (2023) వంటి చిత్రాలలో పనిచేస్తున్నప్పుడు, శ్రీలీల తన వైద్య విద్య పరిజ్ఞానం గురించి ఆమె స్వచ్ఛంద సేవల గురించి బాగా వెలుగులోకి వచ్చింది. ఆమె సహకారం అందిస్తున్న గ్రామీణ ఆరోగ్య కార్యక్రమాలు మహిళల విద్యకు మద్దతు అందించడం వంటివి ఆమెను నటిగా మాత్రమే కాక అంతకు మించి భారతీయ సినిమా రంగంలో ఒక ప్రత్యేకమైన రోల్ మోడల్‌గా అవతరించేందుకు అవకాశం అందిస్తున్నాయి.