Silpa Ravichandra Kishore Reddy
-
పుష్పగాడి జాతర.. స్నేహితుడు శిల్పా రవిచంద్ర ప్రశంసలు
బాక్సాఫీస్ వద్ద 'పుష్ప'గాడి రూల్ ప్రారంభమైంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'పుష్ప2' సినిమా తాజాగా విడుదలైంది. సినిమా చూసిన ప్రేక్షకులు అల్లు అర్జున్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులోని యాక్షన్ సీన్స్‌తో పాటు డ్యాన్స్‌లలో ఆయన దుమ్మురేపారని సోషల్‌మీడియాలో మోత మోగిస్తున్నారు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్ అద్భుతమంటూ బన్నీని మెచ్చుకుంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ స్నేహితుడు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి పుష్ప సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.(ఇదీ చదవండి: Pushpa 2 Movie Review బన్నీ నట విశ్వరూపం.. ‘పుష్ప 2’ హిట్టా? ఫట్టా?)హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్లో పుష్ప సినిమాను శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి చూశారు. అనంతరం ఆయన మీడియాతో ఇలా మాట్లాడారు. 'పుష్ప సినిమాతో అల్లు అర్జున్ మరో స్థాయికి చేరుకున్నారు. ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్‌గా పుష్ప నిలుస్తుంది. ఈ సినిమాలో నాకు బాగా జాతర ఎపిసోడ్ నచ్చింది. గంగమ్మతల్లి అవతారంలో ఐకాన్ స్టార్ తన నట విశ్వరూపంతో గూస్బంప్స్ తెప్పిస్తారు. ఈ సీన్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.'అని ఆయన అన్నారు.అల్లు అర్జున్,శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి ఇద్దరూ చాలా మంచి స్నేహితులని తెలిసిందే. గత ఎన్నికల సమయంలో ఆయనకు మద్ధతుగా నంద్యాలకు బన్నీ వెళ్లారు. స్నేహం కోసం తాను ఎప్పుడూ నిలబడుతానని బన్నీ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. తాజాగా తన కుటుంబంతో పాటు శిల్పా రవి సంధ్య థియేటర్‌కు వెళ్లారు. బన్నీ ఫ్యామిలీతో కలిసి ఆయన సినిమా చూశారు. -
నంద్యాల మాజీ ఎమ్మెల్యే ట్వీట్‌కు బన్నీ రిప్లై .. అదేంటో తెలుసా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మరో రెండు వారాల్లో థియేటర్లలో సందడి చేయనుంది. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ కాగా.. యూట్యూబ్‌ను కకావికలం చేస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే అత్యంత వేగంగా 40 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఇంతవరకు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఏ మూవీ కూడా ఇలాంటి రికార్డ్ సాధించలేదు.అయితే అల్లు అర్జున్‌కు, నంద్యాల వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో రవికి మద్దతు తెలిపారు. తన ఫ్యామిలీతో కలిసి స్వయంగా నంద్యాలకు వెళ్లి రవిని కలిశారు. ఆ సమయంలోనే అల్లు అర్జున్ నిబంధనలు పాటించలేదంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత న్యాయస్థానం ఈ కేసును కొట్టివేసింది.తాజాగా పుష్ప 2 రిలీజ్ సందర్భంగా శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఈ మూవీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని శిల్పారవి పోస్ట్ చేశారు. థియేటర్లలో వైల్డ్ ఫైర్‌ను చూసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ సందర్భంగా పుష్ప 2 టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.శిల్పా రవి చేసిన ట్వీట్‌కు ఐకాన్ స్టార్ స్పందించారు. థ్యాంక్యూ బ్రదర్.. మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు అంటూ బన్నీ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. వీరిద్దరు మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే.Thank you brotherrr 🖤 . Thank you for your love ❤️🔥— Allu Arjun (@alluarjun) November 21, 2024 -
ఏపీ హైకోర్టులో 'అల్లు అర్జున్'కు భారీ ఊరట
నంద్యాల కేసు విషయంలో ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌కు భారీ ఊరట లభించింది. ఈ కేసు విషయంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తుది తీర్పు వెల్లడించింది. అల్లు అర్జున్‌పై నంద్యాల పోలీసులు పెట్టిన ఎఫ్ఐఆర్ను కొట్టివేసింది. దీంతో బన్నీకి న్యాయం జరిగిందని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఏపీ అసెంబ్లీ ఎన్నికల(2024) సమయంలో అల్లు అర్జున్ తన స్నేహితుడు మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఆయన అభిమానులు భారీగా అక్కడకు చేరుకున్నారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా అనుమతి లేకుండా నంద్యాలలో జనసమీకరణ చేపట్టారంటూ కేసు నమోదు చేశారు. అయితే, దానిని కొట్టివేయాలంటూ అర్జున్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు, అల్లు అర్జున్ పటిషన్లను పరిశీలించిన కోర్టు తుది తీర్పు వెల్లడించింది. బన్నీకి ఊరట కల్పిస్తూ.. పోలీసుల పిటిషన్‌తో పాటు ఎఫ్ఐఆర్ను కొట్టివేసింది. -
నేడు అల్లు అర్జున్ కేసు తుది తీర్పు.. తిరుమలలో సతీమణి స్నేహారెడ్డి
ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌పై నమోదైన కేసుకు సంబంధించి నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల(2024) సమయంలో తనపై నంద్యాలలో నమోదైన కేసును క్వాష్ చేయాలని ఆయన కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా అనుమతి లేకుండా నంద్యాలలో జనసమీకరణ చేపట్టారంటూ అల్లు అర్జున్‌పై గతంలోనే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, దానిని కొట్టివేయాలంటూ అర్జున్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.అల్లు అర్జున్ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన నివేదికను కూడా కోర్టు పరిశీలించింది. అయితే నవంబరు 6న తుది తీర్పు ఇవ్వనున్నట్లు ధర్మాసనం ప్రకటించడంతో ఆయన ఆభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.తిరుమలో అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డిబుధవారం తెల్లవారుజామున బన్నీ సతీమణి స్నేహరెడ్డి తిరుమల చేరుకున్నారు. ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామి వారిని ఆమె దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పురోహితుల నుంచి వేదాశీర్వచనం పొందారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే, ఆమెతో పాటుగా అల్లు అర్జున్ లేరని తెలుస్తోంది. మరో నెలరోజుల్లో పుష్ప విడుదల కానున్నండంతో ఆయన సినిమా షెడ్యూల్ విషయంలో బిజీగా ఉన్నట్లు సమాచారం. -
అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికతో పాటు ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉదయం 7.30 గంటలకే తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. జూబ్లీహిల్స్‌లోని బీఎస్ఎన్ఎల్ సెంటర్ ఉదయం 7.30 గంటలకే ఓటేశాడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నంద్యాల టూర్‌పై క్లారిటీ ఇచ్చాడు. నంద్యాల అంసెబ్లీ నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్తి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి తన స్నేహితుడని.. అందుకే ఆయనకు మద్దతుగా నంద్యాల వెళ్లాలని చెప్పాడు. ‘శిల్పా రవి నాకు 15 ఏళ్లుగా మిత్రుడు. అతనికి మద్దతు ఇస్తానని గతంలో మాట ఇచ్చాను. రాజకీయాలతో సంబంధం లేకుండా స్నేహితుడిగా మాత్రమే శిల్పారవికి మద్దతుగా నంద్యాల వెళ్లాను. నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను’అని బన్నీ అన్నారు. -
Allu Arjun At Nandyal: వైఎస్సార్సీపీ అభ్యర్థి కోసం ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్
ఇద్దరు వ్యక్తుల మధ్య చెదరని మమతకు శ్రీకారం స్నేహం.. చెలిమి బంధానికి మరేదీ సాటిరాదని ఎన్నెన్నో పురాణ కథలు ప్రబోధిస్తున్నాయి. అందుకే ఈ ప్రపంచంలో స్నేహానికి అత్యంత విలువ ఉంది. ఎన్నికల సమయంలో తన మిత్రుడి విజయం కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్నేహ బంధాన్ని పాటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నంద్యాల నియోజికవర్గంలో ఎన్నికల బరిలో నిల్చున్న శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి విజయం సాధించాలని అల్లు అర్జున్ కోరుకున్నారు.తాజాగా అల్లు అర్జున్ తన సతీమణి స్నేహా రెడ్డితో కలిసి నంద్యాల చేరుకున్నారు. వారికి పూలమాలలతో శిల్పా రవిచంద్రారెడ్డి దంపతులు ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ను చూసేందుకు ఆయన అభిమానులు శిల్పా రవి ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. 2019 ఎన్నికల్లో తొలిసారి నంద్యాల నుంచే శిల్పా రవిచంద్రారెడ్డి పోటీచేశారు. ఆ సమయంలో కూడా బన్ని తన మిత్రుడు విజయం సాధించాలని మద్ధతు తెలిపారు.శిల్పా రవిని ప్రజాసేవలో చూడటం తనకు చాలా గర్వంగా ఉందని బన్ని అప్పట్లో తెలిపారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మనంద రెడ్డిపై 35 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. మళ్లీ ఇప్పుడు కూడా శిల్పా రవి నంద్యాల నుంచే ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ క్రమంలో తన మిత్రుడిని గెలిపించాలని అల్లు అర్జున్ తన మద్ధతు తెలిపారు. శిల్పా రవిచంద్రారెడ్డి చేతిని పట్టుకుని తన అభిమానులకు చూపించారు.శిల్పా రవిచంద్రారెడ్డి సతీమణి నాగిని రెడ్డి, అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి ఇద్దరు మంచి స్నేహితులు. వారిద్దరూ క్లాస్‌మెట్స్ కూడా.. అనంతరం రవిచంద్రారెడ్డి, అల్లు అర్జున్ మంచి స్నేహితులు అయ్యారు. ఇరు కుటుంబాల్లో జరుగుతున్న శుభకార్యాల్లో కూడా వారు పాల్గొంటారు. స్నేహానికి అత్యంత విలువ ఇచ్చే వ్యక్తి అల్లు అర్జున్ అని గతంలో ఓ ఇంటర్వ్యూ ద్వార రవిచంద్రారెడ్డి తెలిపారు.అల్లు అర్జున్ ఏమన్నారంటే..'శిల్పా రవిచంద్రారెడ్డి నాకు గత 15 ఏళ్లుగా మంచి మిత్రుడు. రాజకీయాలకు ముందు ఇద్దరం రెగ్యులర్‌గా కలిసేవాళ్లం. ఎప్పుడైతే రవి పాలిటిక్స్‌లోకి వచ్చారో ఆ సమయం నుంచి మేము తక్కువగా కలిసే వాళ్లం. 2019లో రవిచంద్రారెడ్డి గెలుపు కోసం ఒక ట్వీట్ చేశాను. కానీ, నాకు అది చాలా తక్కువే అనిపించింది. రవి ఈ ఐదేళ్లలో చాలా కష్టపడ్డాడు. అందుకే నేనే నంద్యాలకు వచ్చాను. ఈ ఎన్నికల్లో రవి విజయం సాధించి ఇక్కడి ప్రజలకు మరిన్ని మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను.' అని బన్ని అన్నారు. View this post on Instagram A post shared by వై.యస్.ఆర్ కుటుంబం (@_ysrkutumbam)Grateful to the people of Nandyal for the warm reception. Thank you, @SilpaRaviReddy garu, for the hospitality. Wishing you the very best in the elections and beyond. You have my unwavering love and support pic.twitter.com/n34ra9qpMO— Allu Arjun (@alluarjun) May 11, 2024 -
శ్రీకృష్ణాష్టమి సందర్బంగా భక్తి గీతం ఆలపించిన నంద్యాల ఎమ్మెల్యే సతీమణి
-
సుబ్బరాయుడుది ముమ్మాటికి టీడీపీ హత్యే
సాక్షి, కర్నూలు: ‘వైఎస్సార్సీపీ నాయకుడు, న్యాయవాది వుడూరు సుబ్బరాయుడుది తెలుగుదేశం పార్టీ చేయించిన హత్యే. ఆంధ్రప్రదేశ్‌లో దళితులకు అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఊరుకోరని’ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. టీడీపీ నాయకుల చేతిలో హత్యకు గురైన సుబ్బరాయుడి కుటుంబ సభ్యులను పార్టీ ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి శనివారం పరామర్శించారు. (వైఎస్సార్సీపీ నేత హత్య) ఈ సందర్భంగా మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. సుబ్బరాయుడు కుటుంబానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఏపీలో దళితుల్ని భయభ్రాంతులకు గురిచేసి, వారిని అణచివేసే ధోరణిలో చంద్రబాబు, టీడీపీ నాయకులు వ్యవహరించడం సిగ్గుచేటు. సుబ్బరాయుడును హత్య చేయడం దారుణమైన చర్య. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ హత్య తెలుగుదేశం పార్టీ నాయకుల కుట్రలో భాగమే. టీడీపీకి అండగా ఉన్న తోక పత్రికల్లో అవాస్తవాలు రాయించి ప్రజలను మభ్యపెట్టే కుట్ర చేస్తున్నారు. (చంద్రబాబు, లోకేశ్ ఎక్కడ దాక్కున్నారు?) దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న చంద్రబాబు నాయుడు మాటలను ఆదర్శంగా తీసుకునే టీడీపీ నాయకులు దళితులపైన దాడులకు పాల్పడుతున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రతి ఒక్కరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకొని, శిక్షించాలించాలి. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకే సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం' అని మేరుగ నాగార్జున, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి భరోసా ఇచ్చారు. -
చంద్రబాబు, లోకేశ్ ఎక్కడ దాక్కున్నారు?
నంద్యాల: రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని గగ్గోలు పెట్టే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ నంద్యాలలో దళిత నాయకుడు నాగ సుబ్బరాయుడు హత్యకు గురైతే ఎందుకు మాట్లాడటం లేదని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేశ్, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిలు ప్రస్తుతం ఎక్కడ దాక్కున్నారని నిలదీశారు. శుక్రవారం కర్నూలు జిల్లా నంద్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇతరులతో ఎన్నడూ ఘర్షణ కూడా పడని సుబ్బరాయుడును టీడీపీ నాయకులు కేవలం రాజకీయ ఆధిపత్యం కోసం హతమార్చడం దారుణమన్నారు. ప్రశాంతతకు నెలవైన నంద్యాల నియోజకవర్గంలోకి భూమా కుటుంబం అడుగుపెట్టినప్పటి నుంచి హత్యలు, దాడులు జరుగుతున్నాయన్నారు. ఇలావుండగా.. సుబ్బరాయుడు హత్యపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ఈ కేసులో దోషులను కఠినంగా శిక్షించాలంటూ శుక్రవారం నంద్యాల పట్టణంలో ధర్నా నిర్వహించాయి. సుబ్బరాయుడు రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక.. నంద్యాలలో టీడీపీ నాయకులు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొన్నాపురానికి చెందిన సుబ్బరాయుడు వైఎస్సార్సీపీ నేతగా, న్యాయవాదిగా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడేవారు. ఇటీవల ఆయన పొన్నాపురం వైఎస్సార్సీపీ ఇన్చార్జిగా నియమితులయ్యారు. ఈ నెల 9న హత్యకు గురయ్యారు. సుబ్బరాయుడు ఎదగడం జీరి్ణంచుకోలేక టీడీపీ నేత మనోహర్‌గౌడ్ ఆయన్ను అడ్డు తొలగించుకోవాలనుకున్నారనే ఆరోపణలున్నాయి. మనోహర్‌గౌడ్, అతని అనుచరులు కడమ రవికుమార్, బోయమండ్ల సురేంద్ర, కాట్రావత్ సత్యహరినాయక్ పథకం ప్రకారం ఈ హత్యకు పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో సైతం వెల్లడైనట్లు సమాచారం. -
వైఎస్సార్సీపీ అభ్యర్థికి బన్నీ విషెస్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. నంద్యాల శాసనసభ వైఎస్సార్ సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి బెస్ట్ విషెస్ తెలుపుతూ శనివారం బన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ లేఖను ఉంచారు. ‘నా మిత్రుడు రవి నంద్యాల ఎమ్మెల్యే బరిలో నిలువడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్తున్నందుకు శుభాకాంక్షలు. అతన్ని ప్రజాసేవలో చూడటం నాకు చాలా గర్వంగా ఉంది. నాకు ఆయన చాలా ఏళ్ల నుంచి మంచి స్నేహితునిగా ఉన్నారు. మెరుగైన సమాజం నిర్మించడంలో ఆయన నాయకత్వం ఉపయోగపడుతుందని విశ్వసిస్తున్నాను. రాజకీయంగా మా ఇద్దరి దారులు వేరు అయినప్పటికీ.. నేను నా స్నేహితుని నూతన ప్రయాణం విజయవంతం కావాలని కోరుకుంటున్నాన’ని బన్నీ పేర్కొన్నారు. కాగా, శుక్రవారం రోజున బన్నీ జనసేన తరఫున ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన నాగాబాబుకు మద్దతు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాము ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనకపోయినా.. మోరల్‌గా ఎప్పుడూ నాగబాబు వెంట ఉంటామని ఆయన పేర్కొన్నారు. అయితే నిన్న నాగబాబుకు మద్దతు తెలిపిన బన్నీ.. నేడు రవిచంద్రారెడ్డికి అభినందనలు తెలుపుతూ పోస్ట్ చేయడం గమనార్హం. View this post on Instagram BEST WISHES TO SILPA RAVI REDDY GARU A post shared by Allu Arjun (@alluarjunonline) on Apr 6, 2019 at 12:02am PDT -
నంద్యాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి శిల్ప రవిచంద్ర ప్రచారం
-
దోపిడీ ప్రభుత్వాన్ని సాగనంపుదాం
నంద్యాల: టీడీపీ హయాంలో అవినీతికి పెచ్చుమీరిందని, దోపిడీ ప్రభుత్వాన్ని సాగనంపేరోజు ఎప్పుడెప్పుడు వస్తుందానని ప్రజలు ఎదురు చూస్తున్నారని వైఎస్సార్సీపీ నంద్యాల నాయకులు శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి అన్నారు. శుక్రావారం పట్టణంలోని నూనెపల్లెలో రావాలి జగన్.. కావాలి జగన్.. కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి జగన్ ముఖ్యమంత్రి అయితే చేపట్టే నవరత్నాల సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల మంజూరులో పేదవారికి న్యాయం జరగడం లేదన్నారు. ఎవరు లంచం ఇస్తే వారికి మాత్రమే పనులు జరుగుతుండటంతో పేదలు మరింత నిరుపేదలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కా గృహాల మంజూరు, వృద్ధాప్య పింఛన్లు, కార్పొరేషన్ రుణాలు ఇలా ప్రతి పథకానికి టీడీపీ నాయకులు డబ్బు వసూలు చేస్తున్నారని విమర్శించారు. జిల్లా రైతులకు అన్యాయం టీడీపీ హయాంలో రైతాంగం కన్నీరు పెడుతోందని శిల్పా రవి అన్నారు. కర్నూలు జిల్లా కరువు కాటకాలతో అల్లాడుతుంటే ఈ ప్రాంత ప్రజలను ఎండగట్టి అనంతపురం, నెల్లూరు జిల్లాలకు సాగునీరు పంపారని విమర్శించారు. ఇటీవల చంద్రబాబు జలసిరి కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడు ఈ ప్రాంత రైతుల కన్నీరు కనపడలేదా అని ప్రశ్నించారు. నాలుగున్నర సంవత్సరాలుగా ఒక్క పంటకు కూడా మద్దతు ధర లేదని, దీని వలన రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు మంచిరోజులు రావాలంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పాలన మళ్లీ రావాలని, అది ఒక్క జగన్మోహన్రెడ్డికే సాధ్యమన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అమృతరాజు, వైఎస్సార్సీపీ నాయకులు సోమ గోని శ్రీనివాసగౌడు, తోట రామకృష్ణ, రమణగౌడ్, తోట రాజగోపాల్, ఓబులేసు గౌడ్, తోట మద్దిలేటి, కుమారగౌడ్, పోలూరు శీను పాల్గొన్నారు. -
ముస్లిం యువకుల అరెస్ట్ అన్యాయం
నంద్యాల(కర్నూలు): న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శించిన ముస్లిం యువకులను అరెస్ట్ చేయడం అన్యాయమని వైఎస్సార్సీపీ నేతలు శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్ అన్నారు. నారా హహమారా..టీడీపీ హమారా కార్యక్రమంలో ప్లకార్డులు పట్టుకున్న 8 మంది ముస్లింలు యువకులను పోలీసులు అరెస్ట్ చేయడంతో, వారిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ బుధవారం రాత్రి నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్లో ముస్లిం సోదరులతో కలిసి వైఎస్సార్సీపీ నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. బాధితుల ఇళ్లకు వెళ్లి, వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా శిల్పా, హఫీజ్‌ఖాన్‌మాట్లాడుతూ ..నాలుగున్నరేళ్ళ పాలనలో కనిపించని ముస్లింలు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు కనిపించారా అని ప్రశ్నించారు. చంద్రబాబు సభలో ప్లకార్డులు పట్టుకుంటే దేశద్రోహం కేసు అయినట్లు యువకులను నిర్బంధించి పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారన్నారు. ముస్లింలపై చంద్రబాబుకు ఏ పాటి ప్రేమ ఉందో ఈ సంఘటన తెలియజేస్తోందన్నారు. వక్స్ భూముల పరిరక్షించాలని కోరడం నేరమెలా అవుతుందని ప్రశ్నించారు. హిట్లర్‌లా నిరంకుశంగా వ్యవహరించడం దుర్మార్గం అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో మైనారిటీ ఓట్లకోసం ఇచ్చిన హామీలు నెరవెర్చలేదన్నారు. నాలుగున్నరేళ్లు ప్రధాని మోదీతో జతకట్టి, ఎన్నికల సమయంలో ముస్లిం ఓట్లు పడవని బీజేపీతో దూరంగా ఉండటాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అరెస్ట్ చేసిన యువకులను బేషరతుగా విడుదల చేసి నంద్యాలకు పంపకపోతే అధికారపార్టీ నేతలను అడ్డుకుంటామని హెచ్చరించారు. వైస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ యువజన విభాగం అధ్యక్షుడు పీపీ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. యువకుల అక్రమ అరెస్ట్‌ను ప్రతి ఒక్కరు నిరసించాలన్నారు. ఇలాంటి చర్యలకు దిగితే ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. ముస్లింలకు అండగా వైఎస్సార్సీఈపీ ఉంటుందని, ఎవరూ అందోళన చెందల్సిన అవసరం లేదన్నారు. అరెస్ట్ చేసిన యువకులను వెంటనే విడుదల చేయకపోతే భారీ ఎత్తున అందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు ఇస్సాక్ బాషా, కౌన్సిలర్లు అనిల్ అమృతరాజ్, జాకీర్ హుసేన్, సుబ్బరాయుడు, శోభారాణి, నాయకులు జగన్ ప్రసాద్, పాంషావలి, టైలర్‌శివ తదితరులు పాల్గొన్నారు. కొవ్వొత్తుల ప్రదర్శన కర్నూలు (ఓల్డ్‌సిటీ): ముస్లింల పట్ల చంద్రబాబు ప్రదర్శిస్తున్నది కపటప్రేమేనని వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శించారు. గుంటూరులో నిర్వహించిన ‘నారా హమారా, టీడీపీ హమారా’ కార్యక్రమంలో ముస్లింలు ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పడాన్ని జీర్ణించుకోలేక తొమ్మిది మందిని అరెస్టు చేశారన్నారు. ఈ సంఘటనకు నిరసనగా బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు మొదటినుంచీ ముస్లింల వ్యతిరేకి అని, వారికి మంత్రి పదవి కూడా ఇవ్వలేదని విమర్శించారు. ముస్లిం యువకులను అరెస్టు చేయడం దారుణమన్నారు. మైనారిటీసెల్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎ.రహ్మాన్ మాట్లాడుతూ నచ్చని అంశాలపై నిరసన తెల్పుకోవడం ప్రజాస్వామ్యం కల్పించిన హక్కన్నారు. గుంటూరులో అరెస్టు చేసిన ముస్లిం యువకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు పి.రాజావిష్ణువర్దన్‌రెడ్డి, నాయకులు ధనుంజయాచారి, ఫిరోజ్, జమీల, సలోమి, సపియా ఖాతూన్, సాంబశివారెడ్డి, కృష్ణకాంత్‌రెడ్డి, ఆదిమోహన్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, రాఘవేంద్రరెడ్డి, ఖాదర్‌ఖాన్, నజీర్‌అహ్మద్‌ఖాన్, గఫూర్‌ఖాన్, సయ్యద్ ఆసిఫ్, శ్రీనివాసరెడ్డి, మాధవస్వామి, గణపచెన్నప్ప, అల్లాబకష్ తదితరులు పాల్గొన్నారు. -
'నిరూపిస్తే ఉపఎన్నిక నుంచి తప్పుకుంటాం'
నంద్యాల: తెలుగుదేశం పార్టీపై శిల్పామోహన్‌రెడ్డి కుమారుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఓటర్లను మభ్యపెడుతోందని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచేందుకు తెలుగుదేశం రూ.200 కోట్లు ఖర్చు చేస్తోందని అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. తెలుగుదేశం నీచ రాజకీయాలు చేస్తోందని, ఇటువంటి రాజకీయాలు ఎక్కడా చూడలేదన్నారు. మొదటి నుంచి డబ్బు పంచే అలవాటు టీడీపీకి ఉందన్నారు. ఓటుకు రూ. 5వేలు ఇవ్వడానికి వెనుకాడట్లేదని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలకు వెళ్లకుండా ఉండేందుకు ఒక్కో మహిళకు రూ.300 ఇస్తున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరకడంతో రాత్రికి రాత్రి అమరావతికి మకాం మార్చారని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే టీడీపీ వైఎస్సార్సీపీపై తప్పుడు ప్రచారం చేస్తోందని రవిచంద్ర మండిపడ్డారు. ధైర్యం, నిజాయితీ ఉంటే తాము డబ్బు పంచామని ఆరోపిస్తున్న వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాలని డిమాండ్ చేశారు. వీడియోలో డబ్బు పంచినట్లు నిరూపిస్తే తన తండ్రి శిల్పామోహన్ రెడ్డి ఎన్నికల నుంచి తప్పుకుంటారని సవాలు విసిరారు. ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ విజయంపై రవిచంద్ర కిశోర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.