బాక్సాఫీస్ వద్ద 'పుష్ప'గాడి రూల్ ప్రారంభమైంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'పుష్ప2' సినిమా తాజాగా విడుదలైంది. సినిమా చూసిన ప్రేక్షకులు అల్లు అర్జున్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులోని యాక్షన్ సీన్స్‌తో పాటు డ్యాన్స్‌లలో ఆయన దుమ్మురేపారని సోషల్‌మీడియాలో మోత మోగిస్తున్నారు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్ అద్భుతమంటూ బన్నీని మెచ్చుకుంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ స్నేహితుడు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి పుష్ప సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
(ఇదీ చదవండి: Pushpa 2 Movie Review బన్నీ నట విశ్వరూపం.. ‘పుష్ప 2’ హిట్టా? ఫట్టా?)
హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప సినిమాను శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి చూశారు. అనంతరం ఆయన మీడియాతో ఇలా మాట్లాడారు. 'పుష్ప సినిమాతో అల్లు అర్జున్ మరో స్థాయికి చేరుకున్నారు. ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్‌గా పుష్ప నిలుస్తుంది. ఈ సినిమాలో నాకు బాగా జాతర ఎపిసోడ్ నచ్చింది. గంగమ్మతల్లి అవతారంలో ఐకాన్ స్టార్ తన నట విశ్వరూపంతో గూస్‌బంప్స్ తెప్పిస్తారు. ఈ సీన్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.'అని ఆయన అన్నారు.
అల్లు అర్జున్,శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి ఇద్దరూ చాలా మంచి స్నేహితులని తెలిసిందే. గత ఎన్నికల సమయంలో ఆయనకు మద్ధతుగా నంద్యాలకు బన్నీ వెళ్లారు. స్నేహం కోసం తాను ఎప్పుడూ నిలబడుతానని బన్నీ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. తాజాగా తన కుటుంబంతో పాటు శిల్పా రవి సంధ్య థియేటర్‌కు వెళ్లారు. బన్నీ ఫ్యామిలీతో కలిసి ఆయన సినిమా చూశారు.
Comments
Please login to add a commentAdd a comment