
నంద్యాలలో ఎవ్వరూ చెయ్యని పనులు తాము చేస్తున్నాము కాబట్టి తమకే టికెట్ ఇస్తారని..
సాక్షి, కర్నూలు : నంద్యాల టీడీపీలో వర్గ విభేదాలు రాజుకుంటున్నాయి. ఎంపీ ఎస్పీవై రెడ్డి నంద్యాల అసెంబ్లీ స్థానంపై కన్నేశారు. ఈ విషయంపై ఆయన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమకే నంద్యాల అసెంబ్లీ టికెట్ ఇస్తారని, తన అల్లుడు శ్రీధర్ రెడ్డికే టికెట్ అంటూ ధీమా వ్యక్తం చేశారు. మీడియా ముఖంగా తమ కుటుంబానికే టీడీపీ ఎమ్మెల్యే సీటు ఇస్తారని స్పష్టం చేశారు.
నంద్యాలలో ఎవ్వరూ చెయ్యని మంచి పనులు చేస్తున్నాము కాబట్టి తమకే టికెట్ ఇస్తారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాల అసెంబ్లీపై సర్వే చేయిస్తారని, ఆ సర్వేలో తమ పేరు ఖచ్చితంగా వస్తుందన్నారు.