నంద్యాల మునిసిపల్ ఉద్యోగులపై రెచ్చిపోయిన మంత్రి ఫరూక్ పీఏ
నంద్యాల, సాక్షి: ‘‘లం..కొడకల్లారా..మీకు కళ్లు కనపడవా..ఒక్కొక్కడికి ఉందిరా.. ఎవరి ఆస్తో తెలియకుండానే ట్యాక్స్ వేస్త్రారా’’ అంటూ రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ పీఏ అనిల్ నంద్యాల మునిసిపల్ అధికారులపై రెచ్చిపోయారు. నంద్యాలలోని మునిసిపల్ కార్యాలయానికి మంత్రి పీఏ అనిల్ కొంతమంది అనుచరులతో మంగళవారం వచ్చారు. వెంటనే రెవెన్యూ ఆఫీసర్ వెంకట కృష్ణ, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ గులాం హుస్సేన్‌లను మునిసిపల్ చాంబర్‌కు పిలిపించారు.
వారు చాంబర్‌లోకి అడుగుపెట్టగానే తాళం వేసి ఇష్టమొచ్చినట్లు తిట్టారు. గట్టిగా అరుస్తూ మీ అంతు తేలుస్తా.. ఉద్యోగాలు ఎలా చేస్తారో చూస్తా అంటూ బూతుపురాణం అందుకున్నారు. కమిషనర్ నిరంజన్‌రెడ్డి ఎదుటే సిబ్బందిని తిడుతున్నా ఆయన కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. నంద్యాలలోని పద్మావతినగర్‌లో మంత్రి ఫరూక్‌కు చెందిన స్థలం ఉంది. దీనికి సంబంధించి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్‌ను మునిసిపల్ సిబ్బంది వేరొకరి పేరు మీద వేశారు. విషయం తెలుసుకున్న పీఏ అనిల్ రెచ్చిపోయారు. మునిసినల్ చాంబర్‌కు తాళాలు వేసి అధికారులను చెడామడా తిట్టారు. గంట సేపు అటువైపు ఎవ్వరినీ రానివ్వలేదు.
విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం
మంత్రి పీఏ అనిల్ చేసిన రభసపై మునిసిపల్ కమిషనర్ నిరంజన్‌రెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా..‘అదేదో ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూ. నాకు పూర్తిగా తెలియదు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment